"తెలుగు మాండలికాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
'''తెలుగు మాండలికాలు''' అనగా [[తెలుగు భాష]]కు సంబంధించిన [[మాండలిక భాష]]లు (Dialects). మండలం అంటే ప్రాంతం. ఒక ప్రాంతంలో ఎక్కువమంది మాట్లాడే భాషని మాండలిక భాష అంటారు. ప్రతి భాషకి మాండలిక భాష ఉంటుంది. అలాగే తెలుగు భాషలో భాషాభేదాలున్నాయి. మాండలిక భాష అనేది ప్రత్యేకమైన భాష కాదు. ఇది ప్రధాన భాషలో ఒక అంతర్గత భాషగా ఉంటుంది. ఏ ప్రాంతనికి చెందిన భాషా భేదమైనా తెలుగు భాషలో భాగంగానే ఉంటుంది. మాండలిక భాషని న్యూన ప్రామాణికం (Substandard form) గా చూస్తారు. అంటే ప్రధాన భాషకన్న తక్కువగా - చిన్నచూపు ఉంటుంది. మాండలిక భాష వ్యవహార ప్రధానమైనది. కొందరు మాండలిక భాషలో రచనలు చేసినా సార్వజనీనంగా ఉండే అవకాశం తక్కువ.
 
మాండలిక భాషల్ని అవగాహన చేసుకోవడం చాలా కష్టం.{{fact}} ప్రధాన భాషలు పరిసరాల భాషల ప్రభావం వల్ల భాషా స్వరూపం మార్పుకు లోనవుతూ ఉంటుంది. ఉదాహరణకి తెలంగాణా తెలుగుపై ఉర్దూ ప్రభావం వల్ల ప్రత్యేకత సంతరించుకుంది. భౌగోళిక పరిస్థితుల ప్రభావం చేత కూడా మాండలిక పదాలు ఏర్పడుతూ ఉంటాయి. సముద్రతీరంలోని వాళ్ళ భాషాపదాలు, ఎడారి ప్రాంతంలోగల భాషాపదాలు భిన్నంగా ఉంటాయి. కులాన్ని బట్టి, వృత్తిని బట్టి, మతాన్ని బట్టి మాండలిక భాషాభేదాలు ఏర్పడాతాయి. మనదేశంలో కొన్ని కులాల భాష ప్రత్యేకంగా ఉంటుంది. కమ్మరి, జాలరి, వడ్రంగి మొదలైనవారి భాష ప్రత్యేకంగా ఉండి వృత్తి మాండలికాలుగా వ్యవహరింపబడతాయి. క్రైస్తవమతస్థులైన తెలుగువారి భాషకి, హిందూ మతస్థులైన తెలుగువారి భాషకి భేదాలు గమనించవచ్చును.
==తేడాలు==
1961జనగణన ప్రకారం తెలుగు మాండలికాలు:-
అంకతి, [[ఆంధ్ర]] , [[బుడబుక్కల]] , [[డొక్కల]] , [[చెంచు]] , [[ఎకిడి]] , గొడారి, బేరాది, [[దాసరి]] , [[దొమ్మర]] , గోలారి (గొల్లరి), [[కమ్మర]] , కామాటి, [[కాశికాపిడి]] , కొడువ, [[మేదరి]] , మాలబాస, [[మాతంగి]] , నగిలి, [[పద్మసాలి]] , [[జోగుల]] , [[పిచ్చుకుంట్ల]] , [[పాముల]] , కొండ రెడ్డి, సాలెవారి, తెలంగాణా, తెలుగు, సగర, వడగ, వడరి, [[వాల్మీకి]] , [[యానాది]] , బగట, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, మద్రాసు([[వడుగ]] ), ఒరిస్సా([[బడగ]] )
 
వడ్డెర, చెంచు, సవర మరియు మన్న దొర మాండలికాలు ప్రామాణిక తెలుగుకు అతిదగ్గరగా ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1185976" నుండి వెలికితీశారు