రాజసులోచన: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox actor
| name =రాజసులోచన
| image = Rajasulochana.jpg
| imagesize =
| caption =
పంక్తి 7:
| location = [[విజయవాడ]], కృష్ణా జిల్లా
| height = 5"7
| deathdate = {{death date and age |2013|3|5|1935|8|15|df=yes}}
| deathplace = {{flagicon|India}} [[మద్రాసు]], [[భారతదేశం]]
| birthname = రాజీవలోచన
| othername =
| homepage =
| notable role = [[పాండవ వనవాసం]] <br /> [[బభృవాహన]] <br /> [[భాగ్యదేవత]]
| spouse = సి. ఎస్. రావు
}}
'''రాజసులోచన''' (జ. [[ఆగష్టు 15]], [[1935]] - మ. [[మార్చి 05]],[[2013]]) అలనాటి [[తెలుగు సినిమా]] నటి మరియు [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]], [[భరత నాట్యం|భరత నాట్య]] నర్తకి. తెలుగు సినిమా దర్శకుడు [[చిత్తజల్లు శ్రీనివాసరావు]] భార్య. ఈమె [[విజయవాడ]] లో సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది, కానీ విద్యాభ్యాసం అంతా [[తమిళనాడు]] లో జరిగింది.
 
రాజసులోచన తండ్రి భక్తవత్సలం నాయుడుకు మద్రాసుకు బదలీ కావడంతో, రాజసులోచన చిన్న వయసులోనే అక్కడకు వెళ్ళిపోయారు. చెన్నైలోని ట్రిప్లికేన్‌ ప్రాంతంలో ఆమె బాల్యం గడిచింది. అక్కడి తోపు వెంకటాచలం చెట్టి వీధిలో 1939లో స్థాపించిన ప్రసిద్ధ శ్రీసరస్వతీ గాన నిలయంలో ఆమె నాట్యం నేర్చుకున్నది. కష్టపడి తల్లిదండ్రుల్ని ఒప్పించి సరస్వతీ గాన నిలయంలో నాట్యం నేర్చుకున్నది. ఈమె 1963లో పుష్పాంజలి నృత్య కళాకేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించినది. అది ఇప్పటికీ నడుస్తున్నది.
 
==సినీ జీవితం==
స్టేజీ మీద రాజసులోచన నాట్య ప్రదర్శన చూసి కొందరు నిర్మాతలు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు. రాజసులోచన 1953లో కన్నడ చిత్రం 'గుణసాగరి' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. [[కన్నతల్లి]] చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. అంతకు ముందు 'గుణసాగరి' అనే కన్నడ చిత్రంతో పాటు 'సత్యశోధనై' అనే తమిళ చిత్రంలో నటించారు. తొలిసారి హీరోయిన్ గా ఎన్.టి.ఆర్. సరసన ఘంటసాల నిర్మించిన [[సొంతవూరు]] (1956) చిత్రంలో నటించింది. తన చిత్రాలకు నృత్య దర్శకులైన [[పసుమర్తి కృష్ణమూర్తి]], [[వెంపటి పెదసత్యం]], [[వెంపటి చినసత్యం]], జగన్నాథశర్మ మొదలైన వారి వద్ద కూచిపూడి నృత్యంలోని మెళకువలు నేర్చుకున్నారు. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాల్లో కలిపి దాదాపు 275 చిత్రాల దాకా అందరు మేటి నటుల సరసన నటించారు<ref>http://andhrajyothy.com/mainnewsshow.asp?qry=2013/mar/5/main/5main55&more=2013/mar/5/main/main&date=3/5/2013</ref>. ప్రతి భాషలోను తన పాత్రకు స్వయంగా డైలాగ్స్ చెప్పుకునేవారు.
 
==నృత్య కళాకేంద్రం==
"https://te.wikipedia.org/wiki/రాజసులోచన" నుండి వెలికితీశారు