భువనగిరి కోట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
[[సర్వాయి పాపన్న]] గోల్కొండను గెలిచే ముందర భువనగిరి దుర్గాన్ని స్వాధీనపరచుకుని తన అపారధనరాశుల్ని కొండ అంతర్భాగంలోని కాళికాలయంలో దాచిపెట్టాడని ఈ కొండలో ఇప్పటికి కనుగొనని అనేక గుహలు సొరంగాలున్నట్లు చెప్పుకుంటారు. ఇది అతిశయోక్తే. కొండపైన ఒక శివాలయం వుంది. కొండకింద రెండు దేవాలయాలు ఒకటి పచ్చలకట్ల సోమేశ్వరుడు, బమ్మదేవర ఆలయం, ఒక మఠం ఉన్నాయి.
 
== ఇతర వివరాలు ==
 
[[వాడుకరి:Sreeramoju haragopal|Sreeramoju haragopal]] గారు చేర్చారు.
జానపదుల పేరుమీద ఒక దుర్గం, ఒక నగరం ఏర్పడ్డది చరిత్రలో ఎక్కడైనా వుందో లేదో కాని మా బోనగిరిఖిలా వుంది.
అనగనగా ఒక రాజు. ఆ రాజు ఇప్పటి రాయగిరి రైల్వేస్టేషన్ ( ఒకప్పటి తిరుమలగిరి తండా) దగ్గరి మల్లన్నగుట్ట మీద కోట కట్టబోతుంటే బోనయ్యనే గొల్లాయన ‘ ఈడ కోటేం కడ్తరుగని మీకు మంచి జాగ జూపిస్త రమ్మ’ని తీసుకపోయి బోనగిరిగుట్టను చూపెట్టిండంట. దాని మీది కప్పివున్న తీగెలపొద మొదలు హనుమపురం దాకుండెనట. దాన్ని నరికి రాజుకు గుట్ట చూపెడితే రాజు రాయిగిరిలో కోటకట్టుడాపి బోనగిరిగుట్ట మీద ఖిల్లా కట్టిండట. రాజు ఇనామిస్తనంటే బోనయ్య తనపేరు, తనభార్యపేరు గిరమ్మ కలిసొచ్చేటట్ల ఊరు కట్టియ్యమన్నడంట. రాజు తథాస్తన్నడు. బోనయ్య, గిరమ్మల పేరుమీద ‘బోనగిరి’ని కట్టించిండు రాజు. ఆ బోనగిరే సంస్కృతీకరించబడి ఇపుడు భువనగిరిగా పిలువబడుతున్నది. ఇది జానపదుల కథే. దీనికి చారిత్రకసాక్ష్యం లేదు. కాని, భువనగిరికోటే చరిత్రకు సాక్ష్యం.
Line 46 ⟶ 47:
 
కోటలోపల ప్రాకారాల్లో ధాన్యాగారాలు, సైనికాగారాలు, గుర్రపుకొట్టా లున్నాయి. రాజప్రాసాదాల కింద ఎన్నో అంతుతెలియని రహస్య శిలాగర్భ మార్గాలున్నాయి.ఈ సొరంగాల తొవ్వలు ఎక్కడికి తీసుకెళ్తాయో ఎవరు కనుక్కోలేకపోయారు. కోటలో పడివున్న ఫిరంగులు ఎనిమిది. మరికొన్ని కొండకిందలోయల్లో పడిపోయివుంటాయని స్థానికులు చెప్పారు.అందులో ఒకటి కుతుబ్షాహీలతో షితాబుఖాన్ (సీతాపతి) చేసిన యుద్ధంలో వాడిన ఫిరంగియని డి.సూర్యకుమార్ (చారిత్రకపరిశోధకులు) గారు రాసారు. చరిత్రలో తెలంగాణాను ఏలిన అందరి ఏలుబడిలో భువనగిరిప్రాంతం వుంది. మూసీనది ప్రాంతాన్ని జయించిన మహాపద్మనందులు, ఆ తర్వాత మౌర్యులు, పిదప మహిషకుడు ఖారవేలుడి ఏలుబడిలో వుండి వుంటుంది భువనగిరి. శాతవాహనుల నుండి ఆసఫ్జాహీల దాకా వివిధరాజుల, రాజ్యాలలో భువనగిరి భాగమై వుంది. శాసనాల దాఖలా ప్రకారం క్రీ.శ. 1100 లకు ముందునుండే భువనగిరిదుర్గం కళ్యాణీచాళుక్యుల పాలనలో వుంది.అపుడిది కొలనుపాకకు రక్షణ, సైనికదుర్గంగా వుండేది.
 
 
== శాసనాధారాలు ==
"https://te.wikipedia.org/wiki/భువనగిరి_కోట" నుండి వెలికితీశారు