సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి తెలుగులో దారిమార్పు, Replaced: #REDIRECT → #దారిమార్పు,
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మన దేశంలోనే రాకెట్‌, ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా ఏర్పడిందే శ్రీహరికోట రాకెట్‌ లాంచింగ్‌ . ఈ కేంద్రం భూమధ్యరేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన రాకెట్ భూమ్యాకర్షణ శక్తిని తేలిగ్గా అధిగమించి అంతరిక్షంలోకి అనుకున్న విధంగా పంపవచ్చు. భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంలో ఉండగా,13డిగ్రీల అక్షాంశంతో శ్రీహరికోట కేంద్రం రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎంతో గొప్పదిగా చెప్పుకునే అమెరికాలోని కేఫ్ కెన్నెడీ రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 28 డిగ్రీల అక్షాంశంలోనూ, రష్యాలోని రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 55 డిగ్రీల అక్షాంశంలోనూ ఉన్నాయి. రాకెట్ కేంద్రంగా గుర్తింపు పొందిన తర్వాత మొదట షార్ నుంచి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాలు ప్రారంభమయ్యాయి.1971, అక్టోబర్ 9న రోహిణి-125 సౌండింగ్ రాకెట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అది మొదలు, ఇప్పుడు చంద్రయాన్-1 దాకా శ్రీహరికోట ఎన్నో కీలక ప్రయోగాలకు వేదికైంది. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం 2002, సెప్టెంబర్ 5న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గా మార్చారు.
#దారిమార్పు [[శ్రీహరికోట]]