వికీపీడియా:నామకరణ పద్ధతులు: కూర్పుల మధ్య తేడాలు

చి అక్షరదోషాల సరిజేత
పంక్తి 28:
* వ్యక్తుల గురించిన పేజీల పేర్లలో గౌరవ వాచకాలు (శ్రీ, గారు మొదలైనవి) అవసరం లేదు.
* కొందరు ప్రముఖులు తమ స్వంత పేరుతో కాక ఇతర పేర్లతో ప్రసిధ్ధి చెందుతారు. ఉదాహరణకు '''ఆరుద్ర'''. ''భాగవతుల శంకర శాస్త్రి'' అంటే కొంత మందికి తెలియక పోవచ్చు, కాబట్టి ఆరుద్ర అనే పేరునే వాడాలి.
* పేర్లకు ముందు ఉండే బిరుదులను కూడా చేర్చవద్దు. ఉదాహరణకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, దాక్టర్‌డాక్టర్ నందమూరి తారక రామారావు అనే పేరు పెట్టవద్దు.
* తెలుగు పేర్లే పెట్టండి. సాధారణంగా వాడే పేరు ఇంగ్లీషు భాషా పదం అయినా, తెలుగు అనువాదానికే ప్రాధాన్యత ఇవ్వండి. వ్యాసం మొదటి లైనులో ఇంగ్లీషు పేరు రాయవచ్చు. అయితే, కొన్ని పేర్ల (ఉదాహరణకు స్పేస్‌ షటిల్‌)కు తెలుగు అనువాదాలు ఉండక పోవచ్చు; వాటికి ఇంగ్లీషు పేరే వాడండి, కానీ తెలుగు లిపిలో ఉండాలి. ఇంగ్లీషు లిపిలో పేరు రాయకండి.
* నదుల పేర్లకు ''నది'' అని చేర్చనవసరం లేదు. ఉదాహరణకు గోదావరి నదికి పేజీ తయారు చేసేటపుడు [[గోదావరి]] అని అంటే సరిపోతుంది. ''గోదావరి నది'' అని అనరాదు. అయితే అదే పేరుతో ఇతర పేజీలు కూడా ఉండే అవకాశం ఉంటే అప్పుడు ''నది'' చేర్చాలి. ఉదాహరణకు కృష్ణా నది. కృష్ణ పేరుతో జిల్లా కూడా ఉంది కాబట్టి, ''కృష్ణా నది'' పేజీ పేరు [[కృష్ణా నది]] అనే ఉండాలి.