వికీపీడియా:నామకరణ పద్ధతులు

పేజీలకు పేర్లు పెట్టడంలో వికీపీడియా సాంప్రదాయం గురించి ఈ పేజీ వివరిస్తుంది.

ఈ పేజీ URL చూడండి: http://te.Wikipedia.org/wiki/వికీపీడియా:నామకరణ పద్దతులు అని ఉంది కదా. తెలుగు వికీపీడియాలో ఉండే పేజీ లన్నిటికీ మొదటి భాగం ఇదే - http://te.Wikipedia.org/wiki/ - ఉంటుంది. తరువాతి భాగం - వికీపీడియా:నామకరణ పధ్ధతులు అనేది ఆ పేజీకి శీర్షికగా ఉంటుంది.

పేర్లు, రకాలుసవరించు

వికీపీడియాలో, వికీపీడియా నేమ్ స్పేసులో, రెండు రకాలైన పేజీలు ఉంటాయి.

  1. వికీపీడియా సైటుకు సంబంధించిన పేజీలు - వికీపీడియా అంటే ఏమిటి, సహాయం పొండడం ఎలా, లాగిన్‌ అవడం ఎలా మొదలైనవి. వీటికి పేర్లు ఇలా ఉంటాయి: వికీపీడియా:సహాయం, వికీపీడియా:తొలగింపు విధానం, వికీపీడియా:కొత్తవారిని ఆదరించండి, వికీపీడియా:నామకరణ పధ్ధతులు మొదలైనవి. ఇవి వికీపీడియా సైటు గురించి తెలియజేసేవి అన్నమాట. ఈ పేజీల పేర్లకు ముందు తప్పనిసరిగా వికీపీడియా: అనేది ఉండాలి.
  2. ఇక రెండో రకం- విజ్ఞాన సర్వస్వం కు సంబంధించిన పేజీలు. వీటి పేర్లు ఇలా ఉంటాయి: గురజాడ అప్పారావు, శ్రీకృష్ణదేవ రాయలు మొదలైనవి. వీటికీ, పైవాటికి తేడా గమనించండి - వీటికి వికీపీడియా: అనేది లేదు. మీరు కొత్త పేజీని తయారు చేసేటపుడు గుర్తుంచుకోవలసిన వాటిలో ఇది ముఖ్యమైనది. ఇప్పుడు గురజాడ అప్పారావు ను నొక్కి ఆ పేజీ చూడండి. దాని శీర్షికలో వికీపీడియా: ఉండకపోవడం గమనించండి.

పేరును నిర్ణయించే విధానాలుసవరించు

వ్యాసాలకు సాధారణంగా నిర్ధారించదగ్గ వనరులలో ఆ వ్యాసానికి సంబంధించిన వస్తువు, సంస్థ, వ్యక్తి, జలచరాలు, ఖగోళం, భూమి, పదార్థం, ఇలా దేనికి ఉద్దేశించిందో అలాగే పేరు పెట్టడం జరుగుతుంది. ఒక్కోసారి ఒక వ్యాసానికి ఒకటి కంటే ఎక్కువ సబబైన పేర్లు ఉన్నప్పుడు సముదాయంలోని సభ్యులు ఏకాభిప్రాయంతో అన్నింటికంటే బాగా సరిపడే పేరును నిర్ణయిస్తారు. పేరును నిర్ణయించే క్రమంలో ఈ క్రింది విధానాలను దృష్టిలో పెట్టుకోవాలి.

  • గుర్తుపట్టేలా ఉండాలి – ఒక విషయంపైన అనుభవజ్ఞులు కాకపోయినా, విషయం గురించి ఎంతో కొంత తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఆ పేరును ఫలానా విషయమని గుర్తుపట్టేలా ఉండాలి.
  • సహజత్వం – పేర్లు సహజంగా ఉండాలి. అంటే ఒక పాఠకుడు ఆ విషయాన్ని గురించి వెతికేటప్పుడు ఎలా వెతుకుతారో, ఒక వాడుకరి ఇంకో వ్యాసం నుండి లింకు ఇచ్చేటప్పుడు ఎలాంటి పదానికి లింకిస్తారో ఆలోచించాలి. సాధారణంగా అలాంటి సహజమైన పేర్లు తెలుగు భాషలో ఆ విషయాన్ని పిలిచే పద్ధతికి అద్దంపడతాయి. ఉదాహరణకు కొన్ని అసహజమైన పేర్లు ఆంప్రరారోరసం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ)
  • ఖచ్చితత్వం – వ్యాసం పేరు ఎటువంటి అయోమయం లేకుండా వీలైనంత ఖచ్చితంగా గుర్తుపట్టేలా ఉండాలి. అంతే కాకుండా ఇతర వాటినుండి వేరుపరచగలిగేలా ఉండాలి. ఉదాహరణకు : రామారావు వ్యాసానికి సరైన పేరు కాదు.
  • క్లుప్తత – పై నిబంధనలను పాటిస్తూనే పేరు వీలైనంత చిన్నదిగా ఉండాలి. అసలు ఉన్నపేరుకు అదనంగా మార్పులు, చేర్పులు చేయడం సరికాదు. దీని వలన కొంత గందరగోళం ఏర్పడింది. అది ఇది ఒకటేనా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది
  • సారూప్యత – వ్యాసం పేరు ఇప్పటికే అలాంటి విషయంపై వ్యాసాలకు ఉన్న పేర్ల శైలిలో ఉండాలి.

ఇతర సూచనలుసవరించు

ఇంకా ఈ కింది సూచనలను కూడా దృష్టిలో ఉంచుకోండి.

  • పేరులోని పదాల మధ్య ఖాళీ ఉండవచ్చు, అండర్‌స్కోరు పెట్టవలసిన అవసరం లేదు.
  • కొన్ని స్పెషలు కారెక్టర్లు ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి వాటిని పేజీ పేర్లలో వాడవద్దు. కింది వాటిని అసలు వాడవద్దు
    • పైపు ( | ), నక్షత్రం (*), యాంపర్శాండ్‌ (&), ప్లస్‌ (+), మీసాల బ్రాకెట్టు ({}), స్క్వేర్‌ బ్రాకెట్టు ( [ ] ) మొదలైనవి.
  • సినిమాల గురించిన పేజీలకు పేరు చివర సినిమా అని బ్రాకెట్లో రాయండి. ఉదాహరణకు - అల్లూరి సీతారామ రాజు (సినిమా). ఒకవేళ అదే పేరుతో రెండు సినిమాలు ఉంటే సంవత్సరం కూడా రాయండి. ఉదాహరణకు "మిస్సమ్మ (2005 సినిమా)".
  • వ్యక్తుల గురించిన పేజీల పేర్లలో గౌరవ వాచకాలు (శ్రీ, గారు మొదలైనవి) అవసరం లేదు.
  • కొందరు ప్రముఖులు తమ స్వంత పేరుతో కాక ఇతర పేర్లతో ప్రసిధ్ధి చెందుతారు. ఉదాహరణకు ఆరుద్ర. భాగవతుల శంకర శాస్త్రి అంటే కొంత మందికి తెలియక పోవచ్చు, కాబట్టి ఆరుద్ర అనే పేరునే వాడాలి.
  • పేర్లకు ముందు ఉండే బిరుదులను కూడా చేర్చవద్దు. ఉదాహరణకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారక రామారావు అనే పేరు పెట్టవద్దు.
  • తెలుగు పేర్లే పెట్టండి. సాధారణంగా వాడే పేరు ఇంగ్లీషు భాషా పదం అయినా, తెలుగు అనువాదానికే ప్రాధాన్యత ఇవ్వండి. వ్యాసం మొదటి లైనులో ఇంగ్లీషు పేరు రాయవచ్చు. అయితే, కొన్ని పేర్ల (ఉదాహరణకు స్పేస్‌ షటిల్‌)కు తెలుగు అనువాదాలు ఉండక పోవచ్చు; వాటికి ఇంగ్లీషు పేరే వాడండి, కానీ తెలుగు లిపిలో ఉండాలి. ఇంగ్లీషు లిపిలో పేరు రాయకండి.
  • నదుల పేర్లకు నది అని చేర్చనవసరం లేదు. ఉదాహరణకు గోదావరి నదికి పేజీ తయారు చేసేటపుడు గోదావరి అని అంటే సరిపోతుంది. గోదావరి నది అని అనరాదు. అయితే అదే పేరుతో ఇతర పేజీలు కూడా ఉండే అవకాశం ఉంటే అప్పుడు నది చేర్చాలి. ఉదాహరణకు కృష్ణా నది. కృష్ణ పేరుతో జిల్లా కూడా ఉంది కాబట్టి, కృష్ణా నది పేజీ పేరు కృష్ణా నది అనే ఉండాలి.

మరింత సమాచారంసవరించు

దీనిపై ఇంగ్లీషు పేజీ కూడా చూడండి.