ప్రియంవద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
ఊళ్ళల్ల రజాకార్ల ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో సొంత ఊళ్ళో వుండకుండా రహస్యంగా ఉండాల్సిన పరిస్థితి కలిగింది. వీరి జాడ చెప్పమని ఆమె తండ్రిని పోలీసులు బాగా హింసించినా ఆచూకీ చెప్పలేదు. అమ్మను, నాన్నను చూసేందుకు ఊరొచ్చింది ప్రియంవద.ఆ విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రి పదకొండు గంటలకు వచ్చి చేసి స్టేషనుకు తీసుకుపోయి, రెండు రోజులు తుంగతుర్తి క్యాంపుల ఉంచిన తర్వాత సూర్యాపేటకు తీసుకుపోయారు. అక్కడ ఒకరోజు ఉంచి హైదరాబాద్ తీసుకపోయి, చంచల్‌గూడ జైల్లో బంధించారు. మూడు నెలల తర్వాత బయటికి వచ్చింది.
 
జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయుధాలు పట్టి కాల్చడం నేర్చుకుంది. దళంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా పరోక్షంగా మాత్రమే సహాయం అందించింది. తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసినప్పుడు గుట్ట మీద సెంట్రీగా పనిచేసింది. అందుకు ఆమె కోసం పోలీసులు వెతికారు. ఆమె యూనియన్ సైన్యం చేతిలో రెండోసారి సొంతింట్లనే అరెస్టయింది. ఈసారి ఆమెను సికింద్రాబాద్ కంటోన్మెంట్ జైలుకు తీసుకెళ్లి, వరంగల్ జైలుకు పంపించారు. రెండేళ్ల తర్వాత బయిటికొచ్చింది. నల్లగొండ, ఖమ్మం, [[వరంగల్‌]] జైళ్ళలోనూ ఆమె జైలు జీవితం గడిచింది. అవివాహితగా ఉన్న ప్రియంవద తుదిశ్వాస విడిచే వరకూ సిపిఐ నాయకురాలిగా, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు కార్యక్రమాల్లో చురుకైన పాత్రను నిర్వర్తించారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రియంవద" నుండి వెలికితీశారు