ప్రియంవద
దాయం ప్రియంవద (1928 - ఆగస్టు 3, 2013) తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడిన మహిళ. దివంగత తెలంగాణా సాయుధ పోరాటయోధుడు దాయం రాజిరెడ్డి సోదరి. భీమిరెడ్డి నరసింహారెడ్డి, శశిరేఖ, మల్లు స్వరాజ్యం తదితర ఉద్యమకారులంతా ప్రియంవద సమీప బంధువులు.
జననం - విద్యాభ్యాసం
మార్చునల్గొండ జిల్లా, తుంగతుర్తి మండలం వెంపటి సమీపంలోని తూర్పుగూడెంలో 1928లో లక్ష్మమ్మ, రామకృష్ణారెడ్డి దంపతులకు జన్మించారు. ప్రియంవద ది మధ్య తరగతి వ్యవసాయ నాడు అమ్మాయిలకు విద్య అంతంత మాత్రమే అయినా తరగతి వరకు చదువుకుంది. కూడా నేర్చుకుంది. రష్యన్ సాహిత్యం, గోర్కి నవలలు ఆ రోజుల్లోనే చదివింది. రెండో ప్రపంచ యుద్ధం గురించి వెలువడిన పుస్తకాల పట్ల ఆసక్తి చూపడం వల్ల నాటి పరిస్థితిని అర్థం చేసుకోగలిగింది.
ఉద్యమ ప్రస్థానం
మార్చుసుశిక్షితురాలైన గెరిల్లా సైనికురాలు ప్రియంవద తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కమ్యూనిస్టుగా ఆదర్శ జీవనప్రస్థానం సాగించింది. 1943 సంవత్సరంలో 15ఏళ్ళ వయసులోనే అన్న రాజిరెడ్డితో కలిసి ఖమ్మం ఆంధ్రమహాసభకు హాజరయ్యింది. తెలంగాణ సాయుధపోరాట యోధులు కీ.శే. బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నరసింహారెడ్డి, దాయం రాజిరెడ్డిలతో కలిసి సూర్యాపేట ప్రాంతంలో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. గెరిల్లా సైనికురాలిగా ఆయుధం పట్టడానికి ముందు ఆమె విజయవాడలో ఆత్మరక్షణ, ఆయుధశిక్షణ పొందింది. సాయుధ పోరాటంలో గాయపడ్డ యోధులకు వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఆరోగ్యసేవిక (నర్సింగ్) ట్రైనింగ్ పొందింది.
ప్రియంవద వాళ్ల వదిన శశిరేఖ అన్నయ్య భీంరెడ్డి నర్సింహారెడ్డి. అన్న, వదినలతో పాటు భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు వెళ్లింది ప్రియంవద. అలా పదిహేనేళ్ల ప్రాయంలో ఆమె ఉద్యమం పట్ల ప్రభావితమైంది. స్త్రీల సమస్యలపై, రైతు కూలీల సమస్యలపై అన్నతో కలిసి ఉద్యమబాట పట్టింది. 1952లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో పిడిఎఫ్ అభ్యర్థుల విజయానికి కృషిచేశారు. మహిళా హక్కుల సాధన, బాల్యవివాహాల నిర్మూలన, బాలికా విద్య కోసం ఉద్యమం చేపట్టారు. మహిళల కూలీరేట్ల పెంపు కోసం ఆమె రాజీలేని పోరాటం సాగించి, పెద్ద రైతు కుటుంబ నేపథ్యం కలిగిఉన్న అర్ధశేరు వడ్లు మాత్రమే ఉండే రోజు కూలీని, రెండుశేర్ల వడ్లు కూలీగా ఇప్పించారు.
ఆంధ్రమహాసభలు వరంగల్, ఖమ్మంలో జరిగిన తర్వాత అన్న రాజిరెడ్డిను భువనగిరి ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్‌గా నియమించారు. ఇబ్బందుల్లో ఉన్న రాజిరెడ్డికి తోడుగా కొలనుపాక జైన మందిరంలో నడిపే స్కూలులో యాభై రూపాయల జీతంతో టీచర్‌గా చేరారు. అక్కడ ఒక సంవత్సరంపాటు పనిచేశారు. ఆసమయంలో వీరి కుటంబంపై ప్రభుత్వం నిషేధం విధించడంతో 1944లో విజయవాడకి వెళ్లారు. అక్కడ జరిగిన అఖిలభారత కిసాన్ మహాసభకు వలంటీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వివిధ గ్రామాలకు వెళ్లి తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఆడవాళ్లలో చైతన్యం కలిగించింది.
సూర్యాపేటలో భక్తవత్సలాపురం, అనాసపురం, దురాసపల్లి, రాయపాడు గ్రామాలల్లోతిరిగి, ఇళ్ళల్లోకి వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలె ? స్త్రీలకు స్థావరాలు కొన్ని తెలిసున్నా చెప్పకుండా ఎట్లుండాలె? కారం చల్లటానికి ఎట్ల సిద్ధమవ్వాలి, ఇల్లు వదిలిపోయేటప్పుడు అన్నం గిట్ల ఉంటె అండ్ల విషం కలిపి పెట్టిపోవాలె వంటివి చెప్పేది. సమాజంలో స్త్రీలకుండే ఇబ్బందులు వాటినెదుర్కోవాలంటే ఏం చెయ్యాలె ? స్త్రీలను ముందుకెట్లా తీసుకురావాలి అన్న విషయాలు ఎంతో ఉత్తేజంతో ప్రసంగించేది. చదువు విషయంలో ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకు పాఠాలు చెప్పేది. వీధివీధికి గ్రూపు మీటింగులు పెట్టేది. సూర్యాపేటలో ఒక సంవత్సరం పాటు పనిచేసిన తర్వాత హుజూర్ నగర్ లో మరికొంత కాలం పనిచేసింది.
ఊళ్ళల్ల రజాకార్ల ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో సొంత ఊళ్ళో వుండకుండా రహస్యంగా ఉండాల్సిన పరిస్థితి కలిగింది. వీరి జాడ చెప్పమని ఆమె తండ్రిని పోలీసులు బాగా హింసించినా ఆచూకీ చెప్పలేదు. అమ్మను, నాన్నను చూసేందుకు ఊరొచ్చింది ప్రియంవద.ఆ విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రి పదకొండు గంటలకు వచ్చి చేసి స్టేషనుకు తీసుకుపోయి, రెండు రోజులు తుంగతుర్తి క్యాంపుల ఉంచిన తర్వాత సూర్యాపేటకు తీసుకుపోయారు. అక్కడ ఒకరోజు ఉంచి హైదరాబాద్ తీసుకపోయి, చంచల్‌గూడ జైల్లో బంధించారు. మూడు నెలల తర్వాత బయటికి వచ్చింది.
జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయుధాలు పట్టి కాల్చడం నేర్చుకుంది. దళంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా పరోక్షంగా మాత్రమే సహాయం అందించింది. తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసినప్పుడు గుట్ట మీద సెంట్రీగా పనిచేసింది. అందుకు ఆమె కోసం పోలీసులు వెతికారు. ఆమె యూనియన్ సైన్యం చేతిలో రెండోసారి సొంతింట్లనే అరెస్టయింది. ఈసారి ఆమెను సికింద్రాబాద్ కంటోన్మెంట్ జైలుకు తీసుకెళ్లి, వరంగల్ జైలుకు పంపించారు. రెండేళ్ల తర్వాత బయిటికొచ్చింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జైళ్ళలోనూ ఆమె జైలు జీవితం గడిచింది. అవివాహితగా ఉన్న ప్రియంవద తుదిశ్వాస విడిచే వరకూ సిపిఐ నాయకురాలిగా, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు కార్యక్రమాల్లో చురుకైన పాత్రను నిర్వర్తించారు.
మరణం
మార్చుపోరాటం కొనసాగిస్తున్నప్పుడే ప్రియం వద పార్టీకి చెందిన ఒకాయనను వివాహం చేసుకుందామనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అయినా ఆమె ఎందుకిలా జరిగిందని విచారించలేదు. మరో వివాహమూ చేసుకోలేదు. ఒంటరిగానే బతికింది. ఉద్యమరోజుల్లో ప్రజలకు అత్యంత దగ్గరగా గడిపిన ఆమె చివరి రోజుల్లో ప్రజా జీవితానికి దూరంగా జీవిస్తూ 2013, ఆగస్టు 3 శుక్రవారం నాడు తుది శ్వాస విడిచారు. శనివారం స్వగ్రామం తూర్పుగూడెంలో ప్రియంవద అంత్యక్రియలు జరిగాయి. ప్రియంవద భౌతికకాయంపై సిపిఐ జెండాకప్పి పుష్ఫగుచ్ఛాలతో నివాళులు అర్పించారు.
మూలాలు
మార్చు- విశాలాంధ్ర వెబ్ లో Archived 2016-03-06 at the Wayback Machine
- నమస్తే తెలంగాణ వెబ్ లో Archived 2015-02-09 at the Wayback Machine