మగధీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
వారిద్దరి ప్రేమ గురించీ తెలుసుకున్న ఇందూ తండ్రి, వారికి పెళ్ళిచేయాలని నిశ్చయించుకుని రఘువీర్, హర్షలకు చెప్తాడు. ఇందూ కింద లేని సమయం చూసుకుని ఇందూ తండ్రిని చంపి ఆ నేరాన్ని హర్ష మీద నెట్టేస్తాడు. హెలీకాఫ్టర్ మీద అప్పటికప్పుడు ఇందూను తీసుకుని వాళ్ళ కోటకు వెళ్ళిపోతూండగా, రఘువీర్ మనుషుల్ని కొట్టి అగ్ని ప్రమాదం ఎదుర్కొని మరీ హెలీకాఫ్టర్ కు వేళ్ళాడుతూ వెళ్తాడు హర్ష. ఇందూ చేయి తగలడంతో మళ్ళీ ఆ అనుభూతికి లోనై హెలీకాఫ్టర్ మీంచి పడిపోతాడు. ఓ సరస్సులో పడిపోతూ దాదాపు మృత్యువును దగ్గర నుంచి చూస్తాడు. ఆ సమయంలో ఇందూ చేతి స్పర్శ వల్ల అతనికి పూర్తిగా గత జన్మ జ్ఞాపకాలు మేల్కొంటాయి.
 
1909లో ఉదయ్ పూర్ రాజ్యానికి చెందిన విక్రమ్ సింగ్ ([[శరత్ బాబు]]) కుమార్తె మిత్రవింద దేవి (తర్వాతి జన్మలో ఇందు), ఆ రాజ్యసైన్యంలో ముఖ్యవీరుడు, సైనికులకు శిక్షణనిచ్చేవాడూ అయిన కాలభైరవ (హర్ష పూర్వజన్మ)ని ప్రేమిస్తుంది, కానీ కాలభైరవ తనకిష్టమన్నది చెప్పకుండా నిగ్రహించుకుంటాడు. అలానే కాలభైరవ వందమందిని చంపిగానీ చావనివారూ, రాజ్యం కోసం పోరాడుతూ 30ఏళ్ళలోపే మరణించేవారూ అయిన యోధులు కల శతద్రువంశ యోధుడు. అతనికీ ఆ వీరత్వం, పోరాటతత్త్వం వస్తాయి. ఆమెని మోహించి ఆమెనీ, రాజ్యసింహాసనాన్ని అధిష్టించాలనుకునే రాజు మేనల్లుడు రణదేవ్ భిల్లా (రఘువీర్ గతజన్మ) ఆమె కాలభైరవకు సన్నిహితం కావడాన్ని సహించలేకపోతాడు. ఈ రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు, హిందుస్తాన్ కి ఏకైక సామ్రాట్టు అయ్యేందుకు ఢిల్లీని ఏలుతున్న షేర్ ఖాన్ రాజ్యం వెలుపల లక్షలాది సైనికులతో మోహరిస్తాడు. అతని కాలభైరవని రాజ్యబహిష్కారం చేయించేందుకు ఓ పన్నాగం పన్నుతాడు. దాని ప్రకారం ఎప్పుడూ జరిగే రాజ్యంలోని అత్యుత్తమ వీరుడు పోటీని మార్చి తనకూ, భైరవకూ మధ్య మరో పోటీ ఏర్పాటుచేయిస్తాడు. మిత్రవిందాదేవి వస్త్రశకలాన్ని తీసి, గుర్రాల రథంపైకి విసరుతాడు. ఆ గుర్రాలు వేగం పుంజుకుని వెళ్ళిపోయాకా ఎవరైతే ముందుగా ఆ వస్త్రంతో నగరంలోకి అడుగుపెడతారో వారికి మిత్రవిందాదేవితో వివాహం, రాజ్యం దక్కాలని, ఓడినవారు రాజ్యం వదిలిపోవాలని ప్రతిపాదిస్తాడు. ఆవేశంలో ఉన్న మిత్రవింద అందుకు అంగీకారం తెలుపుతుంది. భైరవను ఎన్నోరకాలుగా మోసం చేసి, సైనికులను పెట్టి చంపి ఓడించాలనుకున్నా వారందరినీ చిత్తుచేస్తాడు. గుర్రాలున్న రథం ఊబిలోకి దిగుతూంటే గుర్రాల ప్రాణాలు కాపాడేందుకు తానూ ఊబిలోకి దిగి కాపాడి తన గుర్రం సాయంతో బయటపడతాడు. ఈ అవకాశం తీసుకుని వస్త్రంతో వెళ్తూన్న రణదేవ్ నుంచి వస్త్రాన్ని చివరి నిమిషింలో లాక్కుని ముందుగా నగరంలోకి ప్రవేశించి విజయం సాధిస్తాడు. దాంతో మిత్రవింద పిలుపును అందుకుని ఓడిపోయిన రణదేవ్ ను జనమంతా తరిమేస్తారు. అయితే విక్రమ్ సింగ్ మాత్రం రహస్యంగా వారి వివాహం జరగకూడదనుకుంటాడు. 30 వయసులోపలే రాజును కాపాడేందుకు ఆ వంశస్తులు మరణిస్తారని, అలా కాలభైరవ మరణించి కూతురు వైధవ్యం అనుభవించకూడదని ఆయన అభిమతం. ఈ విషయం తెలిసి మొదట షాక్ అయినా, వెంటనే భైరవ రాజు కోర్కె మన్నించి, అందరి ముందూ రాకుమారి గౌరవాన్ని కాపాడేందుకే ఈ పోటీలో పాల్గొన్నాను తప్ప ఆమెను వివాహం చేసుకునే ఉద్దేశం లేదని, తానెప్పటికీ సింహాసనానికి బద్ధుడైన సైనికుణ్ణే అని ప్రకటిస్తాడు.
<!-- the winner will marry her and the loser will be banished from Udayghad. Bhairava's victory leads to Ranadev's banishment. Vikram Singh, however, secretly requests that Bhairava not marry his daughter, because Bhairava has a high chance of dying in battle, and he does not wish to see Mithra widowed. Though shocked, Bhirava concedes to the king's request and publicly declines to marry Mithra, leaving her distraught.
-->
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/మగధీర_(సినిమా)" నుండి వెలికితీశారు