మగధీర (సినిమా)

2009 తెలుగు సినిమా

మగధీర 2009లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని అల్లు అరవింద్ నిర్మాణంలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రాం చరణ్ తేజ కథానాయకుడిగా నటించారు.మొదటి రోజు 15 కోట్ల షేర్ నీ రాబట్టి అల్ టైం ఇండస్ట్రీగా నిలిచింది., ఫుల్ రన్ లో 60 కోట్లు వసూళ్లు రాబట్టింది.

మగధీర
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజమౌళి
నిర్మాణం అల్లు అరవింద్
తారాగణం రాం చరణ్ తేజ,
కాజల్ అగర్వాల్,
శ్రీ హరి
సంగీతం ఎం.ఎం. కీరవాణి
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
భాష తెలుగు

కథ మార్చు

17వ శతాబ్దంలో తనను ప్రేమించిన విషయం తనకి తెలుసంటూ, ఆ విషయం ఇప్పుడైనా చెప్పమంటూ రాకుమారి (కాజల్ అగర్వాల్) అభ్యర్థించడంతో సినిమా ప్రారంభమౌతుంది. తన అంగరక్షకుడు, ప్రేమికుడు ఐన కాలభైరవ (రామ్‌చరణ్ తేజ్) కోసం చేయిజాస్తుంది. అప్పటికే ఆమె కొండకొమ్ముపై రక్తిసిక్తమై ఉంటుంది, అతని స్థితీ అదే. అతను చేయందించే సరికి ఆమె తుళ్ళిపోయి లోయలోకి జారిపోతుంది. హతాశుడైన కాలభైరవ ఆమె కోసం పరుగులెత్తి దూకేస్తాడు. చివరకి వారిద్దరూ పడిపోవడంలోనూ ఒకరి కోసం ఒకరు చేయిజాపుతూంటారు, కానీ కలుసుకోకుండానే పడి మరణిస్తారు. అతని స్నేహితుడు షేర్ ఖాన్ (శ్రీహరి) కాలభైరవ రక్షణ కవచానికి చితి అంటించి, దిగిపోతున్న సూర్యుణ్ణి చూస్తూ "కమ్ముకొస్తున్న చీకటిని చీల్చుకుంటూ మళ్ళీపుడతావురా భైరవా" అంటూండగా సన్నివేశం ముగుస్తుంది.

21వ శతాబ్దంలో దూసుకువస్తున్న బైక్ రేసర్ హర్ష (రామ్‌చరణ్ తేజ్)పై మళ్ళీ కథ కొనసాగుంది, హర్ష సిటీలో జరిగే కష్టమైన పోటీల్లో కూడా విజయం సాధిస్తూంటాడు. విదేశాల్లో బైక్ రేసుల్లో పాల్గొనేందుకు హర్ష వానలో ఆటోలో వెళ్తూంటాడు. అతను వాన వల్ల ఏర్పడ్డ మసకలో ఓ అమ్మాయి ఆటోను ఆపేందుకు చేయి ఊపడం చూస్తాడు, ఆటో నిండిపోయిందని చేయివూపి చెప్పే ప్రయత్నం చేస్తాడు. అనుకోకుండా అతని వేళ్ళు, ఆమె వేళ్ళకు తగులుతాయి, హర్ష ఆ స్పర్శలో విద్యుత్ ప్రవాహం అనుభూతి చెందుతాడు, దాంతో పాటుగా కొన్ని దృశ్యాలు కూడా కనిపిస్తాయి. తర్వాత, ఆమెను చేరుకునేందుకే జన్మించానన్నంత భావం కలిగి, ఆమె కోసం తిరిగివచ్చి ఆ బస్టాప్ లో ఆమె వేసుకున్న డ్రస్ రంగు బట్టి ఆరాతీస్తాడు. ఆమె అప్పుడే వాన వల్ల రెయిన్ కోట్ వేసుకోవడంతో ఆమె గురించి ఆమెనే అడుగుతాడు. ఆమె పేరు ఇందూ, అంటూండే ఇందిర (కాజల్ అగర్వాల్) అని తెలుస్తుంది. ఇందు, తనను చూడకుండానే డ్రెస్ చూసి వెంటపడడం ఆసక్తిగా అనిపించి, అతనికి ఇందును పరిచయం చేస్తానని కట్ చేయకుండా కొనసాగిస్తుంది. అయితే ఎలాంటివాడో తెలియదు కనుక తప్పుదోవ పట్టిస్తూంటుంది. ఆమె, ఆమె స్నేహితులు అతనికి ఇందుపై ఉన్న ప్రేమని అవకాశంగా తీసుకుంటారు. ఇంతలో ఇందు కుటుంబంతో సంబంధాలు తెగిపోయిన బావ రఘువీర్ (దేవ్ గిల్) ఆమె తండ్రి కేసువేయడంతో అతన్ని చంపేద్దామని వస్తాడు. అయితే ఇందును చూసి వెర్రెక్కిపోయి, ఆమెను పెళ్ళిచేసుకునేందుకు తమ కుటుంబాల మధ్య ఉన్న వివాదం వల్ల కుదరదని, తను చస్తే తప్ప ఇందు తండ్రి మాట్లాడడని చెప్పడంతో, తండ్రినే చంపేస్తాడు. తండ్రి చనిపోయిన విషయం చెప్తూ ఆ వంకతో ఇందును, ఆమె తండ్రిని మోసం చేసి ఇంట్లో స్థానం పొందుతాడు. నిద్రపోతున్న ఇందును ముట్టుకుందామని ప్రయత్నించగానే, ఓ కంటికి కనిపించని యోధుడు తన గొంతు కోసేస్తున్న అనుభూతి పొందుతాడు. రఘువీర్ ఈ విషయమై తాంత్రికుడైన ఘోరా (రావు రమేష్) ని కలుస్తాడు. అతని పూర్వజన్మలో ఇందూని మోహించిన రాకుమారుడనీ, యోధుడైన ఆమె ప్రేమికుడి చేతిలో చనిపోయాడని చెప్తాడు. అతను కూడా మళ్ళీ పునర్జన్మ పొందాడని, అతన్ని రఘువీర్ చంపితే తప్ప ఇందూని ముట్టుకోలేవని చెప్తాడు. అతన్ని కనిపెట్టి, చంపి ఇందూని దక్కించుకోవాలని రఘువీర్ నిర్ణయించుకుంటాడు. ఇంతలో ఇందు, ఆమె స్నేహితులు తనని ఆటపట్టిస్తున్నట్టు తెలుసుకుని ఆమె తనను ప్రేమిస్తున్న విషయం తెలుసుకుంటాడు హర్ష.

వారిద్దరి ప్రేమ గురించీ తెలుసుకున్న ఇందూ తండ్రి, వారికి పెళ్ళిచేయాలని నిశ్చయించుకుని రఘువీర్, హర్షలకు చెప్తాడు. ఇందూ కింద లేని సమయం చూసుకుని ఇందూ తండ్రిని చంపి ఆ నేరాన్ని హర్ష మీద నెట్టేస్తాడు. హెలీకాఫ్టర్ మీద అప్పటికప్పుడు ఇందూను తీసుకుని వాళ్ళ కోటకు వెళ్ళిపోతూండగా, రఘువీర్ మనుషుల్ని కొట్టి అగ్ని ప్రమాదం ఎదుర్కొని మరీ హెలీకాఫ్టర్ కు వేళ్ళాడుతూ వెళ్తాడు హర్ష. ఇందూ చేయి తగలడంతో మళ్ళీ ఆ అనుభూతికి లోనై హెలీకాఫ్టర్ మీంచి పడిపోతాడు. ఓ సరస్సులో పడిపోతూ దాదాపు మృత్యువును దగ్గర నుంచి చూస్తాడు. ఆ సమయంలో ఇందూ చేతి స్పర్శ వల్ల అతనికి పూర్తిగా గత జన్మ జ్ఞాపకాలు మేల్కొంటాయి.

1909లో ఉదయ్ పూర్ రాజ్యానికి చెందిన విక్రమ్ సింగ్ (శరత్ బాబు) కుమార్తె మిత్రవింద దేవి (తర్వాతి జన్మలో ఇందు), ఆ రాజ్యసైన్యంలో ముఖ్యవీరుడు, సైనికులకు శిక్షణనిచ్చేవాడూ అయిన కాలభైరవ (హర్ష పూర్వజన్మ)ని ప్రేమిస్తుంది, కానీ కాలభైరవ తనకిష్టమన్నది చెప్పకుండా నిగ్రహించుకుంటాడు. అలానే కాలభైరవ వందమందిని చంపిగానీ చావనివారూ, రాజ్యం కోసం పోరాడుతూ 30ఏళ్ళలోపే మరణించేవారూ అయిన యోధులు కల శతధ్రువంశ యోధుడు. అతనికీ ఆ వీరత్వం, పోరాటతత్త్వం వస్తాయి. ఆమెని మోహించి ఆమెనీ, రాజ్యసింహాసనాన్ని అధిష్టించాలనుకునే రాజు మేనల్లుడు రణదేవ్ భిల్లా (రఘువీర్ గతజన్మ) ఆమె కాలభైరవకు సన్నిహితం కావడాన్ని సహించలేకపోతాడు. ఈ రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు, హిందుస్తాన్ కి ఏకైక సామ్రాట్టు అయ్యేందుకు ఢిల్లీని ఏలుతున్న షేర్ ఖాన్ రాజ్యం వెలుపల లక్షలాది సైనికులతో మోహరిస్తాడు. అతని కాలభైరవని రాజ్యబహిష్కారం చేయించేందుకు ఓ పన్నాగం పన్నుతాడు. దాని ప్రకారం ఎప్పుడూ జరిగే రాజ్యంలోని అత్యుత్తమ వీరుడు పోటీని మార్చి తనకూ, భైరవకూ మధ్య మరో పోటీ ఏర్పాటుచేయిస్తాడు. మిత్రవిందాదేవి వస్త్రశకలాన్ని తీసి, గుర్రాల రథంపైకి విసరుతాడు. ఆ గుర్రాలు వేగం పుంజుకుని వెళ్ళిపోయాకా ఎవరైతే ముందుగా ఆ వస్త్రంతో నగరంలోకి అడుగుపెడతారో వారికి మిత్రవిందాదేవితో వివాహం, రాజ్యం దక్కాలని, ఓడినవారు రాజ్యం వదిలిపోవాలని ప్రతిపాదిస్తాడు. ఆవేశంలో ఉన్న మిత్రవింద అందుకు అంగీకారం తెలుపుతుంది. భైరవను ఎన్నోరకాలుగా మోసం చేసి, సైనికులను పెట్టి చంపి ఓడించాలనుకున్నా వారందరినీ చిత్తుచేస్తాడు. గుర్రాలున్న రథం ఊబిలోకి దిగుతూంటే గుర్రాల ప్రాణాలు కాపాడేందుకు తానూ ఊబిలోకి దిగి కాపాడి తన గుర్రం సాయంతో బయటపడతాడు. ఈ అవకాశం తీసుకుని వస్త్రంతో వెళ్తూన్న రణదేవ్ నుంచి వస్త్రాన్ని చివరి నిమిషింలో లాక్కుని ముందుగా నగరంలోకి ప్రవేశించి విజయం సాధిస్తాడు. దాంతో మిత్రవింద పిలుపును అందుకుని ఓడిపోయిన రణదేవ్ ను జనమంతా తరిమేస్తారు. అయితే విక్రమ్ సింగ్ మాత్రం రహస్యంగా వారి వివాహం జరగకూడదనుకుంటాడు. 30 వయసులోపలే రాజును కాపాడేందుకు ఆ వంశస్థులు మరణిస్తారని, అలా కాలభైరవ మరణించి కూతురు వైధవ్యం అనుభవించకూడదని ఆయన అభిమతం. ఈ విషయం తెలిసి మొదట షాక్ అయినా, వెంటనే భైరవ రాజు కోర్కె మన్నించి, అందరి ముందూ రాకుమారి గౌరవాన్ని కాపాడేందుకే ఈ పోటీలో పాల్గొన్నాను తప్ప ఆమెను వివాహం చేసుకునే ఉద్దేశం లేదని, తానెప్పటికీ సింహాసనానికి బద్ధుడైన సైనికుణ్ణే అని ప్రకటిస్తాడు.

ఖగోళంలో ఏర్పడనున్న అష్టగ్రహకూటమి రాజ్యానికీ, రాకుమారికి అరిష్టమని జ్యోతిష్కులు చెప్తారు. ఈ దోషం తగ్గడానికి భైరవకోనలోని దేవతాప్రతిమను రాకుమారి మిత్ర పూజించాలని సూచిస్తారు. దీనికి తగ్గట్టు షేర్ ఖాన్ రాజ్యసరిహద్దుల్లో అపారమైన సైన్యంతో పొచివున్న సంగతి మంత్రి చెప్తారు. వెంటనే పూజకి సిద్దం కమ్మని రాజు మిత్రవిందని భైరవని ఆదేశిస్తాడు వారు పల్లకిలో భైరవ లోనికి వెళతారు. అక్కడ రాజ గురువు మిత్రవిందని ఎనిమిది రంగులతో కాలభైరవుడుకి పూజ చేయమని చెప్తాడు

తారాగణం మార్చు

రాం చరణ్ తేజ

కాజల్ అగర్వాల్

దేవ్ గిల్

సునీల్

శ్రీహరి

శరత్ బాబు

ఛత్రపతి శేఖర్

సాంకేతిక నిపుణుల వివరాలు మార్చు

 • కథ - వి.విజయేంద్ర ప్రసాద్
 • మాటలు - ఎం.రత్నం
 • పాటలు - భువన చంద్ర, చంద్రబోస్, ఎమ్.ఎమ్.కీరవాణి
 • విజువల్ ఎఫెక్ట్స్ ...
 1. 3D technical director -
 2. visual effects pipeline technical director-Pete Draper
 3. visual effects producer -Kamalakkannan R.C
 4. lighting and texturing -Pari Rajulu
 5. visual effects: technical head - Murali Manohar Reddy
 6. vfx supervisor: Firefly -Sanath
 7. set vfx supervisor: EFX Srirengaraj

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు