బి. పద్మనాభం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 55:
 
 
[[షావుకారు]]లో నౌకరు పోలయ్య వేషానికి ముందు బాలకృష్ణను అనుకున్నారు. ఐతే చక్రపాణి "వీడు ముదురుగా ఉన్నాడు. ఇంకెవరూ లేరా?" అని అడగడంతో దర్శకుడు [[ఎల్.వి.ప్రసాద్]] వెంటనే "రాధికలో కృష్ణుడిగా వేసిన పద్మనాభం ఉన్నాడు." అని పిలిపించి వేషం ఇప్పించారు. [[పాతాళభైరవి]] స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కె.వి.రెడ్డి తోటరాముడిగా [[రాజారెడ్డి]], మాంత్రికుడిగా [[ముక్కామల కృష్ణమూర్తి|ముక్కామల]] అనుకున్నాడు. షావుకారు రషెస్ చూసిన వెంటనే మనసు మార్చుకుని హీరోగా [[ఎన్.టి.ఆర్.]], మాంత్రికుడిగా [[ఎస్.వి.ఆర్.]], అంజిగా బాలకృష్ణ (పాతాళభైరవితో ఇతడి అసలు పేరు మరుగునపడిపోయి అంజి(గాడు)గానే ప్రసిద్ధి పొందాడు), సదాజపుడిగా పద్మనాభం లను ఖరారు చేసుకుని విజయావారి పర్మనెంటు ఆర్టిస్టులుగా మూడేళ్ళ అగ్రిమెంటు తీసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పాతాళభైరవితో బాటు విజయావారి తర్వాతి చిత్రాలైన పెళ్లిచేసిచూడు, చంద్రహారం లలో నటించాడు. అదే సమయంలో గుబ్బి ప్రొడక్షన్స్ శ్రీకాళహస్తి మహాత్మ్యం లో కాశి వేషం వేశాడు. 1954లో వచ్చిన సతి అనసూయతో మొదలుపెట్టి [[కృష్ణప్రేమ]],[[ సతి సుకన్య]], [[కృష్ణలీలలు]], [[శ్రీరామకథ]], [[సతి తులసి]], [[ప్రమీలార్జునీయం]] లలో నారదుడిగా వేశాడు.
 
==నిర్మాతగా==
"https://te.wikipedia.org/wiki/బి._పద్మనాభం" నుండి వెలికితీశారు