జమున (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
'''జమున''', తెలుగు సినిమా నటి. [[తెలుగు]] మాతృభాషకాకపోయినా తెలుగునేలలో పెరిగి, తెలుగు చలన చిత్రంలో అరుదైన కథానాయికగా గుర్తింపు పొందిన తార.
==జీవిత విశేషాలు==
 
జమున [[1937]] సంవత్సరం [[హంపీ]]లో పుట్టింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాస రావు, కౌసల్యాదేవి. ఆయన ఒక వ్యాపారవేత్త. బాల్యం గడిచింది [[గుంటూరు]] జిల్లా [[దుగ్గిరాల]]లో. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాబాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా [[నది]] పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో 'ము' అక్షరం చేర్చి జమునగా మార్చారు. ఉత్తరాదివారు [[యమున]]ను జమునగా పిలవడంతో ఆమెకు ఆ పేరు ఉంచారు. సినిమా కోసం ప్రత్యేకంగా ఆమె పేరు మార్చలేదు. సినీనటుడు [[జగ్గయ్య]]దీ అదే గ్రామం కావడంతొ జమున కుటుంబానికి జగ్గయ్యతో కొంత పరిచయం ఉంది. సహజంగా బెరుకు అంటూ లేని జమున స్కూలులొ చదివేకాలంలో నాటకాలపై ఆకర్షితురాలయ్యింది.
 
"https://te.wikipedia.org/wiki/జమున_(నటి)" నుండి వెలికితీశారు