అంగ్ సాన్ సూకీ: కూర్పుల మధ్య తేడాలు

సవరన
చి clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 39:
'''ఆంగ్ సాన్ సూకీ''' 1945 జూన్ మాసంలో జన్మించింది. ఆమె బర్మాదేశ ప్రతిపక్షనాయకురాలు. ఆమె [[బర్మా]]లో ప్రముఖ రాజకీయవాది మరియు "నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ " (ఎన్ ఎల్ డి)చైర్ పర్సన్. 1990 జనరల్ ఎన్నికలలో ఎన్ ఎల్ డి 59% ఓట్లను, 81% (మొత్తం 485 స్థానాలలో 382 స్థానాలు) పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అయినప్పటికీ ఆమెను ఎన్నికలకు ముందే బర్మా ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ఆమె 1987 నుండి 2010లో విడుదల అయ్యేవరకూ దాదాపు 15 సంవత్సరాలకాలం గృహనిర్బంధంలోనే ఉంచబడింది. ఆమె ప్రపంచంలో ప్రముఖ రాజకీయఖైదీగా గుర్తించబడింది.
 
సూకీ 1990లో స్వతంత్ర భావాల కొరకు రాఫ్టో మరియు షాఖ్రోవ్ పురస్కారం అందుకున్నది. 1991లో [[నోబుల్ బహుమతి|నోబుల్ బహుమతి]] అందుకున్నది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ అవగాహన కొరకు ఆమెకు జవహర్ లాల్ పురస్కారం ఇచ్చింది.[[వెనుజులా]] ప్రభుత్వం ఆమెకు " సైమన్ బోలీవర్ " పురస్కారం ఇచ్చి గౌరవించింది. 2007 లో [[కెనడా]]
ప్రభుత్వం ఆమెకు గౌరవ పౌరసత్వం ఇచ్చి గౌరవించింది. కెనడా నుండి ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో ఆమె నాలుగవది. 2011లో ఆమె వాలెన్ బర్గ్ పతకం అందుకున్నది. 2012 సెప్టెంబర్ 19 తేదీన ఆంగ్ కై సూకీ కాంగ్రెస్ బంగరు పతకం అధ్యక్షుని స్వాతంత్ర్య పతకంతో చేర్చి అందుకున్నది.ఇది సంయుక్తరాష్ట్రాల పురస్కారాలలో అత్యుత్తమమైనది.
 
2012 ఏప్రెల్ 1 ఆమె పార్టీ అయిన నేషనల్ కాంగ్రెస్ లీగ్ ఫర్ డెమక్రసీ ఆమె బర్మా దిగువ సభ కొరకు ఎన్నికైనట్లు ప్రకటించింది. ఆమె పార్టీ బర్మా దిగువ సభ 45 ఖాళీ స్థానాలలో 43 స్థానాలను ఎన్నికలలో గెలుచుకుంది. తరువాత రోజు అధికారికం గా ఎన్నికల కమీషన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. రాఖిన్ రాష్ట్రం లోని యాంటీ-రోహింగ్యా దౌర్జన్య కారుల విషయంలో మౌనం వహించినందుకు అదే సంవత్సరం కొంతమంది ఉద్యమకారుల చేత ఆమె విమర్శించబడింది. సూకీ ఫాదర్ ఆఫ్ బర్మా గా కీర్తించబడిన అంగ్ సాన్ యొక్క ఏకైక పుత్రిక.
పంక్తి 49:
 
== వ్యక్తిగత జీవితం ==
ఆంగ్ సాన్ సూకీ 1945 జూన్ 19 తారీఖున రంగూన్ (ప్రస్తుతం యాంగన్) లో పుట్టింది. ఆమె తండ్రి అయిన ఆంగ్ సాన్ 1947 లో బర్మా సైన్య స్థాపకుడే కాక బర్మీయుల స్వాతంత్రం కొరకు ఆంగ్లేయులతో దౌత్యం నడిపాడు. అదే సంవత్సరం ఆయన తన రాజకీయ శత్రువుల చేత కాల్చి చంపబడ్డాడు. ఆమె తన తమ్ములైన సాన్ లిన్ మరియు ఆంగ్ సాన్ ఊ తల్లి పోషణలో బర్మాలో నివసించారు. ఆంగ్ సాన్ ఊ తమ ఇంటి వద్ద ఉన్న అలంకార సరస్సులో పడి తన ఎనిమిదవ సంవత్సరంలో మరణించాడు. పెద్ద సహోదరుడైన సాన్ లిన్ కాలిఫోర్నియా లోని [[శాన్ డియోగో ]] కు వలస వెళ్ళి తరువాత సంయుక్తరాష్ట్రాల పౌరుడు అయ్యాడు. ఆంగ్ సాన్ మరణించిన తరువాత కుటుంబం ఇన్యా లేక్ ప్రాంతానికి నివాసం మార్చుకున్నది. అక్కడ సూకీకి వైవిద్యమైన నేపథ్యం కలిగిన ప్రజల పరిచయం అయింది. రాజకీయ నేపధ్యం మరియు మతం వాటిలో ప్రధానమైనవి. సూకీ " మెథడిస్ట్ ఇంగ్లీషు హైస్కూల్ఉన్నత పాఠశాల" లో విద్యాభ్యాసం సాగించింది. ఆమె తరువాత బౌద్ధ మతానికి చెందినది.
 
సూకీ తల్లి ఖిన్‌కీ కొత్తగా రూపొందించబడిన బర్మా ప్రభుత్వంలో రాజకీయ ప్రాముఖ్యత సంపాదించింది. 1960లో ఆమె భారతదేశప్రభుత్వానికి మరియు నేపాల్ ప్రభుత్వానికి రాజకీయ ప్రతినిధులను నియమించింది. ఆమెను అనుసరించిన ఆంగ్ సాన్ సుకీ ఢిల్లీ లోని జీసెస్ అండ్ మేరీ స్కూల్ కాన్వెంటులో విద్యాభ్యాసం పూర్తిచేసి న్యూఢిల్లీ శ్రీ రాం కాలేజ్‌లో పట్టభద్రురాలైంది. ఆమె 1964లో పొలిటికల్ పట్టభద్రురాలైంది. సూకీ తన విద్యాభ్యాసం కొనసాగించి 1969లో ఆక్స్‌ఫర్డ్ హాస్ కాలేజ్ నుండి ఫిలాసఫీ, పాలిటిక్స్ మరియు ఎకనమిక్స్ మాస్టర్ డిగ్రీ పొందింది. విద్యాభ్యాసం తరువాత ఆమె కుటుంబ మిత్రుడూ ఒకప్పుడు బర్మా పాప్ గాయకుడు అయిన మా తాన్ ఈ తో [[న్యూయార్క్]] నగరంలో నివసించింది. ఆమె సంయుక్త రాష్ట్రాలలో మూడు సంవత్సరాలు ప్రణాళిక వ్యవహారాల శాఖలో పని చేసింది. 1971లో సూకీ టిబెటన్ సంస్కృతి స్కాలర్" డాక్టర్ మైకేల్ ఆరిస్" ను వివాహం చేసుకుని భూటాన్‌లో నివసించసాగింది. తరువాత సంవత్సరంలో ఆమె [[లండన్]] నగరంలో తన మొదటి సంతానమైన అలెగ్జాండర్ ఆరిస్‌కు జన్మనిచ్చింది. 1977లో ఆమె రెండవ కుమారుడైన కిం కు జన్మనిచ్చింది. 1985-1987 మధ్య కాలం లో బర్మీస్ సాహిత్యంలో రీసెర్చ్ స్టూడెంటుగా లండన్ లోని " ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ " అనే పాఠశాలలో పనిచేసింది. 1990లో ఆమె ఆనరరీ ఫెలోగా ఎన్నిక చెయ్యబడింది. తరువాత రెండు సంవత్సరాలు ఆమె సిమ్లాలోని " ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాంస్డ్ స్టడీస్ " లో ఫెలో గా ఉన్నది. ఆమె గవర్నమెంట్ ఆఫ్ యూనియన్‌లో కూడా పనిచేసింది.
పంక్తి 59:
 
== ఆరంభకాల రాజకీయాలు ==
1988లో సూకీ బర్మాలో ప్రవేశించిన సమయంలోనే అధికకాలం సైనికపాలకుడైన జనరల్ నే విన్ పాలన పతనం అయింది. ఆ సందర్భంలో 1988 ఆగస్ట్ 8 తేదీన సామూహిక విధ్వంసకాండ చెలరేగింది. (8-8-88 తేదీ శుభప్రథమైనదిగా భావించబడుతుంది). ఈ రోజు 8888 పునరుత్థానంగా అభివర్ణించబడింది.సూకీ 1988 ఆగస్ట్ 26 "షూడగాన్ పగోడా" లో గుమికూడిన 5 లక్షల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజాప్రభుత్వ నిర్మాణానికి ఆహ్వానం పలికింది. అయినప్పటికీ సెప్టెంబర్‌లో ఎలాగో కొత్త సైనికాధికారి " జుంటా" అధికారాన్ని చేజిక్కించుకున్నాడు.
 
మహాత్మా గాంధీ సిద్ధాంతాలతో ప్రభావితమైన సూకీ బౌద్ధ మత అహింసా సిద్ధాంతాన్ని బలపరుస్తూ 1988 సెప్టెంబర్ 27న " నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ " పార్టీని స్థాపించింది.
జుంటా ప్రభుత్వం సూకీని 1989 జూలై 20వ తేదీన గృహనిర్బంధంలో ఉంచింది . ఆమె దేశం వదిలి వెళ్ళిపోతే స్వతంత్రంగా ఉండడానికి అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ సూకీ ఆ అవకాశాన్ని నిరాకరించింది.
 
 
 
=== 1990 ఎన్నికలు ===
Line 77 ⟶ 75:
 
=== ఐక్యరాజ్యసమితి జోక్యం ===
ఐక్యరాజ్యసమితి (యు.ఎన్) జుంటా మరియు సుకీ మధ్య రాజీచర్చలకు మార్గం సుగమం చెయ్యడానికి ప్రయత్నించింది. 2002 మే 6 న ఐక్యరాజ్యసమితి నాయకత్వంలో జరిగిన రహస్య సమావేశం సుకీ విడుదలకు దారితీసింది. బర్మాప్రభుత్వ స్పోక్స్ మాన్ " మేము ఇరువురం ఒకరిని ఒకరం విశ్వసిస్తున్నాం కనుక ఆమెను స్వతంత్రంగా తిరగడానికి అనుమతించాం". 2003 మే 30 తేదీన 1996 లో జరిగినట్లు తిరిగి దాడి జరిగింది. ఉత్తరప్రాంత గ్రామమైన " డిపేయిన్" లో ఆమెప్రయాణం చేస్తున్న కారవేన్ మీద ప్రభుత్వ నియమిత కూలి మూక ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ దాడిలో సుకీ మద్దతుదార్లను చంపడం, గాయపరచడం చేసారు. సుకీ కారు డ్రైవర్ కో క్యా సో లిన్ " సాయంతో పారిపోయి నిరాపాయంగా తప్పించుకున్నది. అయినప్పటికీ యే-ఈ చేరుకునే సమయానికి ఖైదు చేయబడింది. బర్మా ప్రభుత్వం ఆమెను రంగూన్ లోని ఇంసేయిన్ జైలులో బంధించింది. 2003 ఆమె సర్జరీ తరువాత తిరిగి రంగూన్ జైలులో బంధించబడింది.
 
ఐఖ్యరాజ్యసమితి ప్రత్యేక దూత రాజాళీ ఇస్మాయిల్ " ఆంగ్ సాన్ సుకీ " ని కలుదుకున్నాడు. బర్మాలో తిరిగి ప్రవేశించడానికి అనుమతించని కారణంగా ఇస్మాయిల్ తన పదవికి రజీనామా చేసాడు. 2006లో ఇబ్రహీం గాంబారి " యుఎన్ అండర్ సెక్రెటరీ-జనరల్ (యు.ఎస్.జి) ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్ " ఆంగ్ సాన్ సుకీని కలుసుకున్నాడు. 2004 తరువాత సుకీతో విదేశీదూత సమావేశం ఇదే. అదే సంవత్సరం తరువాత మరొకసారి అయన సుకీని కలుసుకుని సంభాషించాడు. 2007 అక్టోబర్ 2వ తేదీన గాంబారి తిరిగి వచ్చి షూ మరియు ఇతర సభ్యులను కలుసుకున్న తరువాత నైపిడాలో సుకీతో సంభాషించాడు. బర్మా టెలివిషన్ గాంబారి మరియు సుకీ సమావేశం ప్రసారం చేసింది. ఖైదు చేసిన నాలుగు సంవత్సరాల అనంతరం సుకీ మాధ్యమంలో కనిపించడం ఇదే మొదటి సారి.
 
ఐఖ్యరాజ్యసమితి బర్మాప్రభుత్వ ఈ ఏకపక్ష ఖైదును గురించి తమ అభిప్రాయం తెలియజేస్తూ ఇది స్వాతంత్రాన్ని అణగదొక్కే ఈ ఏకపక్ష నిర్ణయం " ఆర్టికల్ 9 యూనివర్సల్ డిక్లరేషన్ " ప్రకారం మానవహక్కుల ఉల్లంఘన అని ఖండిస్తూ సుకీని విడుదల చేయమని బర్మా అధికారులను కోరింది. బర్మా అధికారులు ఆ అభ్యర్ధను తోసిపుచ్చింది. బర్మా ప్రభుత్వం తమ ప్రత్యుత్తరంలో " ఆంగ్ సాన్ సుకీని ఖైదు చేయలేదు, ఆమెను రక్షణ కొరకు మాత్రమే సురక్షితమైన నిర్బంధంలో ఉంచాము. తరువాత దేశీయ చట్టఉల్లంఘన నెపంతో సుకీ మీద చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఆ చర్యలను మాయాన్మార్ పోలీస్ ఫోర్స్ అధికారి బ్రిగ్-జనరల్ ఖిన్-యి నిరాకరించాడు. 2007 జనవరి 18తేదీన
"https://te.wikipedia.org/wiki/అంగ్_సాన్_సూకీ" నుండి వెలికితీశారు