సి.హెచ్. నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ౩ → 3 using AWB
పంక్తి 49:
ఎక్కువగా నాటకానుభవం లేకపోయినా, సినిమాలకి వచ్చిన తర్వాత నాటకాల్లో నటించారు. మల్లాది కృష్ణ శర్మ రాసిన ‘మిస్‌ ప్రేమ బి.ఏ.’ (తిమ్మరాజు శివరావు దర్శకత్వం) లో నారాయణరావు హీరోగా నటించి, చాలా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. పకడ్బందీగా, క్రమశిక్షణతో రిహార్సల్సు జరిపి ఆ నాటకంలో నటించారు. హరీంద్రనాథ్‌ ఛటోపాధ్యాయతో సాన్నిహిత్యమున్న ఆయన తరువాతి రోజుల్లో [[పాలగుమ్మి పద్మరాజు]] 'పట్నవాసం' లాంటి రేడియో నాటికల్లోనూ పాల్గొన్నారు.
==సినీ జీవితం==
[[1939]] సంవత్సరంలో ''నారాయణరావు'' చిన్న ఉద్యోగం చేసుకుంటూ తరచు [[చెన్నపట్నం]] వెళ్ళి వస్తుండేవారు. ఒకసారి హోటల్‌ లో ఆయన భోజనం చేస్తుండగా ప్రముఖ దర్శకుడు [[ద్రోణంరాజు కామేశ్వరరావు]] గారితో పరిచయం అయింది. మొదట ద్రోణంరాజు గారు నారాయణరావుని చూసి బెంగాలీ అనుకొన్నారట. తరువాత నారాయణరావు తెలుగువాడే అని తెలిసిన మీదట తన దర్శకత్వంలో [[శోభనాచల]] సంస్థ నిర్మించబోయే [[జీవన జ్యోతి]] అనే చిత్రానికి స్క్రీన్‌ టెస్ట్‌ కు రమ్మని చెప్పారు. స్క్రీన్‌ టెస్ట్‌లో భాగంగా నారాయణరావుకు కొన్ని సంభాషణలు ఇచ్చి చిత్రీకరించారు. ఆ టెస్ట్‌ పీస్‌ ను థియేటర్లో ప్రొజెక్ట్‌ చేసే తతంగం సాగర్‌ టాకీస్‌ లో మొదలైంది. దర్శకుడు రాజు గారు, నిర్మాతలు, కెమెరామెన్‌ కొట్నీస్‌ , సౌండ్‌ ఇంజనీర్‌ రంగయ్య తదితరులు ఈ సందర్భంగా హాజరయ్యారు. తరువాత ఆ సినిమా అసిస్టెంట్‌ కెమెరామెన్‌ వచ్చి నారాయణరావు [[జీవన జ్యోతి]] సినిమాకు హీరోగా నారాయణరావు ఎంపికయ్యారు అన్న వార్తను చేరవేశారు. ఈ సినిమాకోసం ఆయనకు ఇచ్చిన పారితోషికం అక్షరాలా వంద రూపాయలు. అప్పట్లో వంద రూపాయల జీతగాడంటే ధనవంతుడుగా లెక్క. అలా సిఫారసు లేకుండా నటుడైన నారాయణ రావు [[మనదేశం]], [[ముగ్గురు మరాఠీలు]], [[లక్ష్మమ్మ]], [[వీలునామా]], [[రహస్యం]] వంటి 50కి పైగా చిత్రాల్లో హీరోగా, సహాయ నటుడుగా నటించారు.
 
నారాయణరావు శోభనాచల స్టూడియోకి దగ్గర్లోనే అళ్వారుపేటలో ఉండేవారు. సినిమాల్లో ప్రవేశిస్తూ మొదట ఏ ఇంట్లో ప్రవేశించారోస్టార్‌ అయిన తరువాత కూడా అదే ఇంట్లో ఉన్నారు. ఆయనకి ఆర్భాటం లేక పోయినా, ఆత్మాభిమానం హెచ్చు. ఒక దశలో ఆయనకి చిత్రాలు లేవు.
 
1953 లో వై.వి.రావు దర్శకత్వంలో వరుణ అండ్‌ మహత్మా అనే కంపెనీ ‘మంజరి’ (జానపదం) నిర్మించింది. నారాయణరావు దాదాపు నిర్మాత. తను సంపాదించుకున్నది ఆ చిత్రానికి ధారపోసారు. చిత్రంవిజయవంతం కాలేదు. అప్పులు మిగిలాయి. అప్పట్నుంచి నారాయణరావు ఆర్దికంగా ఇబ్బందులు పడ్డారు. చిత్రాలూ లేవు. జరుగుబాటుకీ, పిల్లల చదువులకీ ఎదురీత మొదలైంది. అయినా, ఆయన గుండె నిబ్బరం తగ్గలేదు. చాలా మంది తారలు, కళాకారులు ఉచ్ఛస్థితికి వెళ్ళీ, కిందికి పడిపోవడం సామాన్యంగా చూస్తూనే ఉంటాం. అదే జరిగింది నారాయణరావు జీవితంలోనూ. ఎంతటి ప్రసిద్దుడికైనా, గొప్పవాడికైనా ఒక దశ దాటిన తరువాత పరిస్థితి, స్థితీ మారడం విధాత శాపం కాబోలు.
 
తెలుగు, తమిళం, కన్నడం, ఇంగ్లీషుతో పాటు మలయాళం, హిందీ భాషలు కూడా ఆయన ధారాళంగా మాట్లాడేవారు. కెరీర్‌ తొలి రోజుల్లోనే 'దీనబంధు' (1942) చిత్రంలో వకీలుగా కోర్టు సీనులో ఆయన అనర్గళంగా చెప్పిన ఇంగ్లీషు డైలాగులు పరిశ్రమ వర్గీయులనూ, ప్రేక్షకులనూ ఆశ్చర్యపరిచాయి. మంచి గాత్రమున్న నారాయణరావు ఆ సినిమాలో సొంత గొంతుకలోనే పాట పాడారు. ఇక, ఘంటసాల పాడిన తొలి సినీ గీతం 'స్వర్గసీమ' (1946)లో నారాయణరావు, భానుమతులపై చిత్రీకరించినదే!
పంక్తి 65:
‘మనదేశం’ చిత్రం ఎన్‌.టి.రామారావు తొలి చిత్రం. అందులో నారాయణరావు హీరో, రామారావుది ఇన్స్పెక్టర్‌ పాత్ర. తనకి షూటింగులేని ఓ రోజున రామారావు తెల్లని పంచె, జుబ్బాతో కుడిచేత్తో పంచెకొంగుని పైకి పట్టుకుని నడుస్తూ వచ్చి, మేకప్పులో ఉన్న నారాయణరావుకు నమస్కరించి కూచున్నారు. ఆయన్ని చూడగానే ‘అరె..మీరా! ఇన్స్పెక్టర్‌ డ్రస్‌ లో చూసి, మాములుగా చూచేసరికి ఎవరో అనుకున్నాను. చాలా అందంగా ఉన్నారు. ఎప్పుడూ ఇలాగే వేసుకుంటారా డ్రెస్సు?’ అని అడిగారు నారాయణరావు.
==వ్యక్తిత్వం==
ఎంతమందిలో ఉన్నా నారాయణరావు మీదనే అందరి కళ్ళూ ఉండేవి. ఆ తరం ప్రేక్షకులకి నిరంతరం ఆయన బాగా గుర్తుంటారు. వ్యక్తిగా చూస్తే మృదువైన సంభాషణ. సౌమ్యుడు. ఆత్మాభిమానం గలవాడు. బాగా చదువుకున్నారు. ఆంగ్లభాషలో చక్కగా మాట్లాడేవారు. ఆంగ్లభాషలోని గొప్ప గొప్ప పుస్తకాలమీద నిత్యమూ మిత్రులతో చర్చించేవారు. తరచూ రేడియో నాటకాల్లో కూడా పాల్గొనేవారు.
 
‘నేను చిత్రాల్లో నటించడం మానేసానని ఎవరో అన్నారు. అలానెనేం చెప్పలేదు. నటుడిని నేను. ఎందుకు నటించను? అయితే నేనెవర్నీ వెళ్ళి అడాగను. ఏభై చిత్రాల్లో నటించిన వాడిని... నన్నెరగరా ? అయినా నేను వెళ్ళి అడగడానికి ఆత్మాభిమానం అడ్డం వస్తుంది. అంతకంటె, ఇలా పుస్తకాలు చదువుకుంటూ, సిగరెట్లు కాల్చుకుంటూ, (ఆయన ఎక్కువగా సిగరెట్లు కాల్చేవారు) ఇంట్లో కూచోవడం నయం. ఈ మధ్య ఒక నిర్మాత వేషం వెయ్యమని అడిగారు. తప్పకుండా వేస్తానన్నాను. అయితే పారితోషికం చాలా తక్కువగా మాట్లాడాడు. ఎంచేతనంటే... నాకు సినిమాలు లేవుట. డిమాండ్‌ లేదుట.’ హీరో పాత్రధారణకి తీసుకున్నంత పారితోషికం అడగడం లేదు గాని, రీజనబుల్‌గా ఇవ్వండి.‘ అన్నాను ప్రాధేయపడలేదు. మరీ నన్ను తక్కువగా అంచనా వెయ్యడం నాకు నచ్చలేదు. నాకు డబ్బు కావాలి...నిజమే. కాని, ఎంతో కొంతకి కక్కుర్తి పడి ఎలావెయ్యను? దానివల్ల నాకు అహంకారం అన్నారు. డిమాండ్‌ చేస్తాడన్నారు. అదేం కాదు...నా కున్న పేరునీ, ఒకనాటి నా అనిభవాన్నీ చవగ్గా వాడుకోవాలని చూస్తే సహించవలసిన అవసరంలేదు. ’అదీ ఆయన ధోరణి !
 
అందరికి అందుబాటులో ఉండే నటుడుగా గుర్తింపు పొందిన నారాయణరావు. ఫిబ్రవరి 14 , 1984లో మరణించారు.<ref>[http://www.visalaandhra.com/movieworld/article-17333 తెలుగుతెరమీద తొలి అందాల నటుడు - విశాలాంధ్ర జూలై 3, 2010]</ref>
==చివరి రోజులు==
చివరి రోజుల్లో ప్రోస్టేట్‌ గ్రంథి సమస్యతో, మూత్రపిండాల వ్యాధితో బాధపడిన ఆనాటి రొమాంటిక్‌ హీరో చివరకు తన 71వ ఏట 1984 ఫిబ్రవరి 14న మద్రాసులోని రాయపేటలో ఓ ప్రైవేటు నర్సింగ్‌హౌమ్‌లో కన్నుమూశారు. కనుమరుగై మూడు దశాబ్దాల కాలమవుతున్నా, ఇవాళ్టికీ సిహెచ్‌. నారాయణరావు పేరు చెప్పగానే పాతతరం వాళ్ళకు 'మనదేశం' (1949), కృష్ణవేణితో కలసి నటించిన శోభనాచల వారి 'లక్ష్మమ్మ' (1950), ఏ.వి.ఎం. వారి 'జీవితం' (1950), సేలంలోని మోడరన్‌ థియేటర్స్‌ వారి 'ఆడజన్మ' (1951) లాంటి చిత్రాలే గుర్తుకు వస్తాయి. హీరో నుంచి క్యారెక్టర్‌ యాక్టర్‌గా పూర్తిగా మారిపోయాక ఆయన నటించిన 'బాల భారతం', 'కలెక్టర్‌ జానకి', 'శ్రీకృష్ణ తులా భారం', 'రహస్యం', 'దేశోద్ధారకుడు', 'రాణీ కాసుల రంగమ్మ', 'పులిబిడ్డ' లాంటి చిత్రాలను చూసినప్పుడు పాత జ్ఞాపకాలు మెలిపెడతాయి.
పంక్తి 103:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు రంగస్థల నటులు]]
"https://te.wikipedia.org/wiki/సి.హెచ్._నారాయణరావు" నుండి వెలికితీశారు