అద్దంకి శ్రీరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''అద్దంకి శ్రీరామమూర్తి''' ([[సెప్టెంబరు 21]], [[1898]] - [[1968]]) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటులు మరియు సంగీత విశారదులు.
 
వీరు [[గుంటూరు జిల్లా]] [[కల్వకుర్తి]] గ్రామంలో [[సెప్టెంబరు 21]], [[1898]] సంవత్సరంలో జన్మించారు. [[బాపట్ల]] ఉన్నత పాఠశాలలో చదివారు. చదువుకునే రోజుల్లోనే బడిపిల్లలు ప్రదర్శించిన [[గయోపాఖ్యానం]] నాటకంలో ప్రపథమంగా [[సహదేవుడు]] పాత్రలో నటించారు. సహదేవుడు పాత్రతో ప్రారంభమైన నటజీవితం దశరథుడి పాత్రతో పరాకాష్టకు చేరుకుంది. తర్వాత [[రాజమండ్రి]]లోని [[కృత్తివెంటి నాగేశ్వరరావు]] గారి నాటక సమాజంలో మూడేళ్ళు వివిధ పాత్రలు ధరించారు. సంగీతం మీద ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల విజయవాడలో [[పాపట్ల కాంతయ్య]], [[పారుపల్లి రామకృష్ణయ్య]] ల వద్ద పదేళ్ళు సంగీతం నేర్చుకొని సంగీత విద్వాన్ గా పేరుతెచ్చుకొన్నారు. [[బి.టి.రాఘవాచార్యులు]] వద్ద నాటక కళలోని మెళకువలు నేర్చుకొన్నారు. అనేక పాటకచేరీలు నిర్వహించారు. పాటలు పాడడంలో విశిష్టమైన బాణీ సృష్టించుకున్నారు.ఎంతటి పద్యమైన ఈయన పాడితే ఇట్టే అర్థమైపోయేది. ప్రసిద్ధ నటులు [[హరి ప్రసాదరావు]], [[బళ్ళారి రాఘవ]] ల సరసన ప్రముఖ పాత్రలు ధరించి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. వీరు పాడిన పద్యాలు, కృతులు, శ్లోకాలు గ్రామఫోను రికార్డులుగా ఇవ్వబడి విశేష ప్రచారం పొందాయి. ఈయన [[ధర్మారాజు]] మరియు [[దశరథుని]] పాత్రలకు పేరొందారు. [[పాండవ ఉద్యోగ విజయం]] నాటకంలో ధర్మరాజు పాత్రను వేసేవారు.