కర్పూరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''కర్పూరం''' (Camphor) : ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ వుండో ఒక ఘాటైన [[వాసన]] గల పదార్థము.<ref>{{cite book |author=Mann JC, Hobbs JB, Banthorpe DV, Harborne JB |title=Natural products: their chemistry and biological significance |publisher=Longman Scientific & Technical |location=Harlow, Essex, England |year=1994 |pages=309–11 |isbn=0-582-06009-5 }}</ref> ఇది టర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం.ఇది ''కాంఫర్ లారెల్'' అనే చెట్లలో దొరుకుతుంది. ప్రత్యేకంగా [[ఆసియా]] ఖండంలోనూ, ప్రధానంగా [[బోర్నియో]] మరియు [[తైవాన్]] లలో ఎక్కువగా లభిస్తుంది. దీనిని కృత్రిమంగా టర్పెంటైన్ ఆయిల్ నుండి సింథసైజ్ చేసి తయారు చేస్తారు.కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు.వెలుగుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా ఆరిపోతుంది. నీటి మీద ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. నీటిలో కరగదు. కర్పూరం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ.
 
కర్పూరం కాంఫర్ లారెల్ లేదా Cinnamomum camphora (కుటుంబం: లారేసీ ) అనే చెట్టునుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.
 
కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగపడుతుంది.
 
==పచ్చకర్పూరం==
కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.
 
==హారతి కర్పూరం==
టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.
 
రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.
 
==భీమసేని కర్పూరం==
సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాలకోసం విరివిగా వాడుతూ ఉంటారు.
 
==సితాభ్ర కర్పూరం==
ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.
==హిమవాలుక కర్పూరం==
ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.
==ఘనసార కర్పూరం==
ఇది మేఘంలాంటి సారం కలిగినది.
==హిమ కర్పూరం==
ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.
 
==కర్పూరం ఉపయోగాలు , Camphor and Uses==
"https://te.wikipedia.org/wiki/కర్పూరం" నుండి వెలికితీశారు