వీరమాచనేని ఆంజనేయ చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వీరమాచనేని ఆంజనేయ చౌదరి''' ([[డిసెంబర్ 23]], [[1891]] - [[1988]]) స్వసంఘ పౌరోహిత్యానికి మూలపురుషుడు.
 
== జననం ==
వీరు 23 [[డిసెంబర్ 23]], [[1891]] తేదీన అనగా [[నందన]] నామ సంవత్సరం మార్గశిర మాసంలో గుంటూరు జిల్లాలోని [[దుగ్గిరాల]] గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కోటయ్య మరియు లక్ష్మమ్మ. చిన్నతనంలోనే తల్లితోపాటు ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు పాడేవాడు. పెద్దగా చదువుకోలేదు. అయినా ప్రతిరోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి అర్చకులు చదివే శ్లోకాలను ఒక్కసారి విని తిరిగి చెప్పేవాడు.
 
పది సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో మేనమామల గ్రామం రేపల్లె తాలూకాలోని [[నల్లూరు (రేపల్లె)|నల్లూరు]] చేరారు. అక్కడ వ్యవసాయపనులు చేసుకొంటూ తీరికవేళల్లో పురాణ, హరికథా కాలక్షేపాలకు వెళ్ళి భారత, భాగవత, రామాయణ కథా విశేషాలను గ్రహించి అందులోని పద్యాలను కంఠస్థం చేశారు. కొందరు ఆచార్యులను స్నాన మంత్రాలు, సూర్యనమస్కారాలు మొదలైన వాటిని నేర్పడానికి తిరస్కరించారు. ఆ మంత్రాలను తాను ఎందుకు నేర్చుకోకూడదు అనే ఆలోచన మొదలై అన్వేషించారు. తమ పురోహితులు రఘునాయకులు గారు చదివే మంత్రాలకు ఆకర్షితులై వారు గ్రామంలో జరిపించే శుభాశుభ కార్యాలన్నిటికి హాజరై కర్మకాండను గ్రహించారు. కానీ మంత్రభాగం నేర్చుకోలేకపోయారు. కొంతకాలానికి ప్రతాపరామయ్య అనే అద్వైత వేదాంత గురువును ఆశ్రయించి వారిద్వారా శ్రీరామమంత్రోపదేశాన్ని పొందారు.
Line 11 ⟶ 12:
స్వాములవారి ఆశీర్వాదంతో నల్లూరు గ్రామంలో [[వేద పాఠశాల]]ను స్థాపించి వివిధ జిల్లాల నుండి బ్రాహ్మణేతర విద్యార్ధులకు పౌరోహిత్యం నేర్పారు. ఈ పాఠశాల తర్వాత సమీపంలోని [[మైనేనివారిపాలెం]] అన్న గ్రామానికి మారింది. అక్కడ మైనేని వెంకట్రామయ్య అనే భూస్వామి ఎకరంపైబడిన భూమిని దానం చేశారు. గ్రామస్తుల సహకారంతో అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మింపజేసి దానిని మళయాళ స్వాములవారిచే ప్రారంభం చేయించారు. దానిని శ్రీ సనాతన వేదాంత నిష్టాశ్రమముగా పేర్కొన్నారు. తర్వాత అక్కడ ఒక సంస్కృత పాఠశాలనుకూడా ఏర్పాటుచేశారు. దానికోసం ఆరు ఎకరాల భూమిని ఆంజనేయులు సేకరించారు. కాలక్రమాన ఈ పాఠశాల లౌకిక పాఠశాలగా మార్పుచెందింది.
 
== మరణం ==
వీరు 1988లో తన ఆశ్రమంలోనే తుదిశ్వాస విడిచారు. వీరి భౌతిక కాయాన్ని కృష్ణానదీ తీరంలోని ఆశ్రమం వద్దనే సమాధి చేశారు.