పంక్తి 20:
 
Dvratnamగారు, ఇలా ఆంటున్నానని అన్యదా భావించకండి. అంగ్ల వికీ నుండి వ్యాసాలను ఇక్కడ తెచ్చిన తరువాత అనువదించేబదులుగా, ముందే అనువదించి ఆ తరువాత ఇక్కడ చేర్చండి. ఇది తెలుగు వికీపీడియా కాబట్టి అన్ని వ్యాసాలూ తెలుగులోనే ఉండాలనే చర్చ ఒకసారి జరిగింది. ఎక్కువమంది సభ్యులు ఆంగ్లవ్యాసాలు తెలుగు వికీపీడియాలో ఉండకూడదనే అభిప్రాయపడ్డారు. మీరు వ్యాసాలను సృష్టించేటప్పుడు, అందులో ఓ 5-6 వాక్యాల ఉపోత్ఘాన్ని తెలుగులో రాయండి. ఆ తరువాత వాటిని మెళ్ళగా అభివృద్ధిపరచవచ్చు. ఆంగ్ల వ్యాసాలకంటే చిన్నచిన్న వ్యాసాలు నయం. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 09:09, 18 సెప్టెంబర్ 2007 (UTC)
::రత్నం గారూ, అనేక సార్లు ఈ విషయంపై చర్చ జరిగింది. ఇటీవలి జరిగిన ఈ చర్చ చూడండి [[వికీపీడియా:రచ్చబండ (అనువాదాలు)#పెరిగిపోతున్న అనువాదాలు]]. నేనూ కొత్తలో వచ్చినప్పుడు ఇలానే ఆంగ్లవికీనుండి అతికించాను. ఎవరో ఒక [http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%B5%E0%B1%88%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A4_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A_1 అజ్ఞాత సభ్యుడు మందలించేదాక] ఆపలేదు. అప్పుడు అతికించిన వ్యాసాలు రెండేళ్ళైనా అనువాదం కాక అలాగే ఉన్నాయి. మహానుభావుడు కాసుబాబు చాలా సమయం వెచ్చించి ఒక సగం మాత్రం అనువదించారు, శేషభాగన్ని ఇటీవలే స్వయంగా తుడిచివేశాను. అలా అతికించడానికి వ్యక్తిగతంగా నేను పుర్తిగా వ్యతిరేకం కాకపోయినా.. ఒకసమయంలో ఒక వ్యాసాన్ని తెచ్చుకొని అనువదించి ఆ తరువాతది తెచ్చుకుంటే సభ్యులపై ఎక్కువ భారం పడకుండా ఉంటుంది. [[:వర్గం:అనువాదము కోరబడిన పేజీలు|అనువదించవలసిన వ్యాసాలు]] ఇంకా 90కి పైగా ఉన్నాయి ముందు వాటిపని పడదాం ఏమంటారు? --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 09:56, 18 సెప్టెంబర్ 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Dvratnam" నుండి వెలికితీశారు