కాటం లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4), ) → ) , నారయణ → నారాయణ, తో → తో (2) using AWB
పంక్తి 41:
కాటం లక్ష్మీనారాయణ [[రంగారెడ్డి జిల్లా]] [[శంషాబాదు]]లో, లక్ష్మయ్య, సత్తెమ్మ దంపతులకు [[1924]] వ సంవత్సరంలో [[సెప్టెంబరు 19]] న జన్మించాడు. ఇతని తాత కాటం నారాయణ స్థానిక జమీందారుల అకృత్యాలను ఎదిరించిన దైర్యవంతుడు. తాత పేరుతో పాటు దైర్య సాహాసాలు కూడ మనమనికి వచ్చాయి. 1942 అక్టోబరు 12 న [[బూర్గుల రామకృష్ణారావు]] చాదర్ ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండులో సత్యాగ్రహం చేయడానికి సన్నాహాలు ప్రారంభించగా నైజాము పోలీసులు లాటీలు ఝుళిపించారు. అక్కడే కాటం లక్ష్మినారాయన సత్యాగ్రహానికి మద్దతుగా నినాదాలు చేయగా పోలీసులు [[భూర్గుల రామ కృష్ణారావు]]ని, లక్ష్మినారాయణని అరెస్ట్ చేశారు. అప్పటికి నారాయణ వయస్సు పంతొమ్మిది. అప్పటి నుండి లక్ష్మినారాయణ బూర్గుల రామకృష్ణా రావుని గురువుగా బావించాడు. పోలీసులు లక్ష్మినారాయణను ఏడు నెలల పాటు చెంచల్ గూడ జైల్లో వుంచారు. ఆ జైల్లో స్థానిక నాయకులెందరో వున్నారు. అక్కడే వారి అనుభవాలను తెలుసుకున్నాడు. అతనికి జైలు జీవితం చాల మంచి పాఠాలను నేర్పింది. బయటకు వచ్చిన లక్ష్మినారాయణ న్యాయవిద్య పూర్తి చేసి బూర్గుల వారి వద్దనే జూనియర్ లాయర్ గా చేరారు. వారికి చేదోడు వాదోడుగా వుంటూ, అన్ని కార్య కలాపలాలలో క్రియా శీలక పాత్ర పోషించాడు. లక్ష్మి నారాయణ రాజకీయ కార్యకలాపాలే గాక ఆనాటి సామాజికి సమస్యలలో కూడ పాలు పంచుకున్నాడు. నిజాం ప్రభుత్య ఆజ్ఞలను దిక్కరించి హింది పాఠశాలను స్థాపించాడు. ఖాది వ్యాప్తి, దళిత జనోద్దరణ వంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు. [[ఎన్.జి.రంగా|ఆచార్య రంగా]] ప్రేరణతో 1945 లో లక్ష్మినారాయణ హైదరాబాదు యువ జన కాంగ్రేసు స్థాపించి తాను ప్రదాన కార్యదర్శిగా పని చేశారు.
 
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కాని నైజాము స్టేటులో విముక్తి లబించలేదు. బూర్గుల వారు, కాటం వారు ఈ విషయాన్ని ప్రపంచ నాయకుల దృష్టికి తీసుకురావాలని వారి సహకారాన్ని కోరాలని 1947 ఆగస్టు 15 న బూర్గులవారి తోబూర్గులవారితో కలిసి మద్రాసు చేరి [[రష్యా]], [[అమెరికా]], [[ప్రాన్సు]] వంటి దేశాలకు టెలిగ్రాములు ఇచ్చారు. కాని వారు తిరిగి [[హైదరాబాదు]]లో అడుగు పెట్టగానే నైజాము పోలీసులు వారి అరెస్టు చేశారు. [[కొండా వెంకట రంగారెడ్డి]]కి లక్ష్మినారాయణ అంటే చాల ఇస్టం. అతను జైల్లో వున్నప్పుడు లక్ష్మినారాయణకు కుటుంబ పోషణకు నెలకు పదిహేను రూపాయలనిచ్చే వారట. ఇలా లక్ష్మినారాయణకు ఆనాటి ప్రముఖు లందరితో మంచి పరిచయాలుండేవి. 1947 మే నెల 11 న పెళ్లి చేసుకొన్న లక్ష్మినరాయణ నాలుగు నెలలకె మళ్లీ అరెస్ట్ అయాడు. ఇలా లక్ష్మి నారాయణ ఏదో ఒక ఉద్యమంలో పాల్గొనడం, అరెస్ట్ కావడం, తిరిగి రావడం, మళ్లి జైలుకెళ్లడం నిత్య కృత్యం అయింది.
 
==పత్రికారంగంలో==
పంక్తి 47:
 
==మరిన్ని కార్యక్రమాలు==
స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొన్న యోధులకు పెన్షన్ ఒక వరం లాంటిది అని నమ్మేవారు లక్ష్మి నారయణనారాయణ. స్వతంత్ర భారత్ లో ఈ అవకాశాన్ని అందరు వినియోగించు కుంటున్నా.... [[నైజాము స్టేటు]] లోని యోధులకు ఆ అవకాశం రాలేదు. వీరికి కూడ ఆ అవకాశం రావాలని లక్ష్మినారాయణ కేంద్ర ప్రభుత్వం తోప్రభుత్వంతో చర్చలు జరిపారు. కేంద్రం దానికి అంగీకరించ లేదు. దాంతో లక్ష్మినారాయణ " [[తెలెంగాణ సమర యోధుని సత్యాగ్రహం]]" అని రాసిన ఒక అట్టను మెడలో తగిలించు కొని ప్రధాని ఇంటి ముందు [[నిరాహార దీక్ష]] చేసారు. ఈ విషయాన్ని ఢిల్లీ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. దాంతొ ఇందిరా గాంధి లక్ష్మిణాయణను పిలిపించి కారణం అడగగా......, దానికి లక్ష్మి నారాయణ " సంస్థానాలలో స్వాతంత్ర్య యోధులను మీరు గుర్తించక పోవడాన్ని మేము అవమానంగా భావిస్తున్నాము. బ్రిటిష్ ఆంధ్ర స్వాతంత్ర్య యోధులు ఒక బ్రిటిష్ వారితోనె పోరాడారు. కాని సంస్థాన లోని యోధులు అటు సంస్థానాధీశులతోను, ఇటు బ్రిటిష్ వారితోను పోరాడారు. 15 ఆగస్టు మాకు స్వాతంత్ర్య దినం కాదా? హైదరాబాదు విముక్తి జరిగిన సెప్టెంబరు 17 ను స్వాతంత్ర్య దినంగా జరుపుకో మంటారా? ఒక్క హైదరాబాదు సంస్థాన ప్రజలే కాదు పలు సంస్థానాల ప్రజలు భారతీయులు కారా? అవునా? కాదా? ముందు ఇది తేల్చండి? " అని సూటిగా, దైర్యంగా ఇందిరా గాంధిని ప్రశ్నించి యోధుడు లక్ష్మి నారాయణ. దాంతో సంస్థానాల లోని స్వాతంత్ర్య యోధులకు కూడా పెన్షన్ సౌకర్యం లభించింది. ఈ యోధుడు సాధించిన అతి పెద్ద ఘన కార్యం.
 
ఇతను చేసిన మరో ఘన కార్యం ఏమంటే? హైదరాబాదు స్వాతంత్ర్య సమార చరిత్రను ప్రామాణిక పద్దతుల్లో గ్రంధస్థం చేయించడం. ఆ విధంగా వచ్చిందే మాణిక్య రావు గారి 844 పేజీల [[హైదరబాదు స్వాతంత్ర సమర చరిత్ర]]. ఇది ఇప్పటికీ ప్రామిణిక గ్రంథం. దాన్ని అప్పటి భారత రాష్ట్ర పతి జైల్ సింగ్ చేత ఆవిష్కరింప జేసారు. [[పి.వి.నరసింహ రావు]], [[టి. అంజయ్య]], [[కాసు బ్రంహానంద రెడ్డి]], [[భవనం వెంకట్రామ రెడ్డి]], ఈ నలుగురు ముఖ్య మంత్రులతో ఒక పెద్ద సభను నిర్వహించారు. ఇతను నిర్వహించిన సభలకు ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, పీఠాధిపతులు, స్వాతంత్ర సమర యోధులు, [[దలైలామ]] వంటి వారు కూడ పాల్గొనే వారు. తన స్వంతానికి ఏ మాత్రం పాటు పడక కేవలం ప్రజలకు, విలువల కొరకు ఎంతటి వారినైన ఎదిరించి ధైర్యంగా నిర్మొహమాటంగా నిలబడటం కాటం లక్ష్మినారాయణ గారి వ్యక్తిత్యం లోని ప్రధాన గుణం. ఆ మహా యోధుడు [[2010]] వ సంవత్సరం [[ఫిబ్రవరి 25]] నాడు తను కొలిచే శ్రీ కృష్ణునిలో ఐక్యమైపోయారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
* ఆది వారం: వార్త: 20 పిబ్రవరి 2011.)
==యితర లింకులు==
* http://www.visalaandhra.com/hyderabad/article-6113
"https://te.wikipedia.org/wiki/కాటం_లక్ష్మీనారాయణ" నుండి వెలికితీశారు