"అడివి బాపిరాజు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి., లో → లో (2) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి., లో → లో (2) using AWB)
 
[[File:Adavi Baapiraju Statue at RK Beach 01.jpg|thumb|విశాఖలో అడివి బాపిరాజు విగ్రహం]]
బాపిరాజు [[పశ్చిమ గోదావరి]] జిల్లా లోని [[భీమవరం]] లో [[అక్టోబర్ 8]], [[1895]] న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు [[బందరు]] నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పని చేశాడు. 1944లో [[హైదరాబాదు]] నుండి వెలువడే తెలుగు దినపత్రిక [[మీజాన్ ]] సంపాదకునిగా పని చేశాడు. తరువాత [[విజయవాడ]] [[ఆకాశవాణి]] రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి [[గుంటూరు]]లో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.
 
బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల '''[[నారాయణరావు]]'''కు [[ఆంధ్ర విశ్వకళా పరిషత్]] అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. [[విశ్వనాథ సత్యనారాయణ]] గేయ సంపుటి [[కిన్నెరసాని పాటలు]] బాపిరాజు చిత్రాలతో వెలువడింది.
 
1922లో [[సహాయ నిరాకరణోద్యమం]]లో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందుపరచాడు.
 
[[సెప్టెంబరు 22]], [[1952]] న బాపిరాజు మరణించాడు.
 
==చిత్రకళ==
నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన ''శబ్ద బ్రహ్మ'' అనే చిత్రం డెన్మార్కు ప్రదర్శనశాలలో ఉంది. ''భాగవత పురుషుడు'', ''ఆనంద తాండవం'' మొదలగు చిత్రాలు తిరువాన్‍కూరు మ్యూజియంలో వున్నాయిఉన్నాయి. 1951లో అప్పటి మద్రాసుప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు.
==రచనలు==
===నవలలు===
 
==వనరులు, బయటి లింకులు==
* http://www.vepachedu.org/Bapiraju.html లోhtmlలో వ్యాసం - ఎమ్.ఎల్.నరసింహారావు 'నూరుగురు తెలుగు ప్రముఖులు' ఆధారంగా వ్రాసినది.
 
* http://www.andhrabharati.com/kavitalu/shashikaLa/index.html బాపిరాజు కవిత 'శశికళ' ఇక్కడ చూడవచ్చును.
==మూలాలు==
{{వికీసోర్స్|రచయిత:అడివి బాపిరాజు}}
{{మూలాలజాబితా}}
 
 
[[వర్గం:1895 జననాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1959872" నుండి వెలికితీశారు