జయదేవ్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరాబాద్ → హైదరాబాదు, ప్రధమ → ప్రథమ, శ్రద్ద → శ్రద్ధ, using AWB
పంక్తి 35:
| weight =
}}
'''జయదేవ్''' ప్రముఖ తెలుగు [[వ్యంగ్య చిత్రాలు|వ్యంగ్య చిత్రకారుడు]]. [[1940]] [[సెప్టెంబర్ 13]]న [[కడప]]లో జన్మించాడు. ఇతని పూర్తి పేరు '''సజ్జా జయదేవ్ బాబు'''. [[1959]]వ సంవత్సరం నుండి కార్టూన్లు (వ్యంగ్య చిత్రాలు) చిత్రిస్తూ ఉన్నాడు. గీతల్లో ఒడుపే కార్టూన్ కు ప్రాణం అన్నమాటను నిత్య సత్యం చేస్తూంటాయి ఆయన కార్టూన్లు. ఈయన తన బాల్యంలో ఎక్కువ భాగం [[మదరాసు]] లోని పాత చాకలి పేటలో గడిపాడు. చదువుకొనే రోజుల్లోనే స్వతహాగా చిత్రాలు గీయటం ప్రారంభించాడు. ఆచార్యుడిగా జంతుశాస్త్రాన్ని [[మదరాసు]]లోని సర్ త్యాగరాయ కాలేజీ లోకాలేజీలో [[1997]] వరకు బోధించాడు.
 
[[ఆంధ్రపత్రిక]] సచిత్ర వార పత్రికలో [[1959]]లో మొదలు పెట్టి, [[తెలుగు]]లో వచ్చిన దాదాపు అన్ని వార, మాస పత్రికలన్నిటిలోనూ తన వ్యంగ్య చిత్రాలను ప్రచురించాడు. అన్ని ప్రముఖ పత్రికలు, ముఖ్యంగా [[యువ (పత్రిక)|యువ]] దీపావళి సంచికలలో ఈయన కార్టూన్లు లేకుండా ప్రచురించబడేవి కాదు. [[2002]] వరకు ఆయన చిత్రీకరించిన వ్యంగ్య చిత్రాల సంఖ్య 40,000 పైగా ఉన్నాయి. జయదేవ్ కార్టూన్లతో వుత్తేజంపొంది ఆయనకు ఏకలవ్య శిష్యులుగా చాలా మంది తెలుగు కార్టూనిష్టులు ఏర్పడ్డారు. వారినందరిని వీలైనంతవరకు ముఖాముఖిగా కలిసి ప్రోత్సహించేవాడు. కార్టూన్ల సంకలనాలు, "గ్లాచ్చూ మీచ్యూ" అనే ఆత్మకథ రచించాడు. వివిధ సంస్థలచే సత్కరించబడ్డాడు. ధూమపానం వల్ల వచ్చే దుష్పరిణామాలనుదుష్పరిణామాల గురించిసామాజిక స్పృహ కల్గించే వ్యంగ్య చిత్రాలు కూడా గీశాడు. వ్యంగ్యచిత్రాల కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. 'నేపాళం', 'భూపాళం', '(తాగుబోతు) బ్రహ్మం', 'మిస్టర్ నో', 'బాబాయ్-అబ్బాయ్' వంటి పాత్రలను కార్టూన్లలో సృష్టించి పాఠకులను అలరించాడు. అంతర్జాలంలో వ్యంగ్యచిత్రాల వెబ్సైట్ లను నిర్వహించాడు. తోటి కార్టూనిస్టులను కూడా అంతర్జాలాన్ని అధునికి సాంకేతికతలను వాడటానికి ప్రోత్సహించాడు.
 
==కార్టూనిస్ట్ అయిన విధం==
జయదేవ్ చిన్నతనంలో చదువు మొదలు పెట్టినప్పుడు పడిన పునాది చేతి వ్రాత గుడ్రంగా వ్రాసేవాడు. 6వ 7వ తరగతులు చదువుతున్నప్పుడు బొమ్మల ఉపాధ్యాయుడు దగ్గర [[పెన్సిల్]] తో బొమ్మలు గీయటం నేర్చుకున్నాడు. 9వ తరగతిలో తరగతి పత్రిక కుపత్రికకు ఆంగ్లకవి [[వర్డ్స్ వర్త్]] పద్యానికి బొమ్మ గీసి మెప్పు సంపాయించాడు. [[1957]]లో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, జీవశాస్త్ర ఆచార్యుడు వ్రాయబోతున్న పుస్తకానికి బొమ్మలు వేయటంకోసం, పెన్సిల్ తో కాకుండా, [[ఇండియన్ ఇంక్]] తో, బ్రిస్టల్ బోర్డు పేపరు మీద, సన్నటి క్రోక్విల్ పాళీతో బొమ్మలు వెయ్యటం నేర్చుకున్నాడు.
డ్రాయింగ్ మాష్టారి
;జయదేవ్ మొదటి కార్టూన్
పంక్తి 50:
 
==వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు==
[[బాపు]] తరువాత సంతకం అక్కర్లేని అతి కొద్దిమంది వ్యంగ చిత్రకారులలో జయదేవ్ ఒకడు. చూడగానే ఇది జయదేవ్ కార్టూన్ అని తెలిసిపోతుంది. ఇతడు వేసిన కార్టూన్లలో చక్కటి పొందిక అకట్టుకునే ఆకర్షణ. బొమ్మ చిత్రీకరణలో ఎటువంటి విపరీతాలు (మిడి గుడ్లు, అసహజ రూపాలు వంటివి) ఉండవు. సహజత్వానికి దగ్గరగా కార్టూన్ల లోని అయా పాత్రల ముఖ భంగిమలు, సదర్భానికి సరిపొయే ముఖ కవళికలు హాస్యప్రధానంగా చిత్రీకరించటంలో జయదేవ్ దిట్ట. అలాగే కార్టూన్లలోని సంభాషణలు ఎంతో పొదుపుగా చక్కటి భాషలో ఉండి అరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తాయి. బొమ్మకి వ్యాఖ్యా, లేదా వ్యాఖ్యకు బొమ్మా అని తటపటాయించేవారికి, వ్యాఖ్య లేకుంటే బొమ్మ అర్ధం కాదు. బొమ్మలేకుంటే వ్యాఖ్య అర్ధంకాదు. కార్టూన్లలో ఈ రెండిటికీ మంచి సంబంధం ఉండాలి అని వివరిస్తారు జయదేవ్.
 
'నేపాళం', 'భూపాళం', '(తాగుబోతు) బ్రహ్మం', 'మిస్టర్ నో', 'బాబాయ్-అబ్బాయ్' వంటి పాత్రలను కార్టూన్లలో సృష్టించి పాఠకులను అలరించాడు.
పంక్తి 58:
*1991: ఊర్కహోన్డె ఛార్టర్, న్నొకి-హైస్ట్, బెల్జియం-గౌరవ ప్రస్తావన
*1992: ఒక్ హొట్స్క్ అంతర్జాతీయ కార్టూన్ పోటీ, జపాన్-ప్రత్యేక బహుమతి
*1993: భారత ప్రభుత్వం నిర్వహించిన పర్యావరణ అవగాహన పోటీలో ప్రధమప్రథమ బహుమతి
*1994: ఒక్ హొట్స్క్ అంతర్జాతీయ కార్టూన్ పోటీ, జపాన్-ప్రత్యేక బహుమతి
*1995: అంతర్జాతీయ సందేశాత్మక కార్టూన్ ఫెస్టా, 1994, మియాగవ, జపాన్- కంపెనీ సౌజన్య బహుమతి
పంక్తి 71:
*మన కార్టూన్ ఆలోచనలు మన దేశవాతావరణానికి అనుగుణంగా ఉండాలి.
*చిత్తు బొమ్మ వేసి, ఊహకు సరిపడా వ్యాఖ్య రాసేయాలి.
*కార్టూన్ అనుకున్నప్పుడు దృశ్యాన్ని చిత్రించడమే కాకుండా పాత్రల కుపాత్రలకు సంబంధించిన భావాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.
*మాట్లాడే పాత్ర నోరు తెరిచి ఉండాలి. ఆవతలి పాత్ర భావాన్ని సూచించేలా ఉండాలి.
*పాత్రల చిత్రీకరణ అయ్యాక నేపథ్యాన్ని గీయాలి. నేపథ్య స్థానాన్ని సూచించాలి.
*ముఖ్యమైన అంశాలుంటే చాలు. అనవసరమైన వివరాలతో నేపథ్యం, పాత్రలపై ఆధిపత్యం చేయకుండా జాగ్రత్తపడాలి.
*కార్టూన్ గీశాక ముందస్తుగా ఇంట్లో వాళ్ళకీ, స్నేహితులకి చూపించాలి. వాళ్ళి మెచ్చుకుంటే తప్పకుండా పత్రికల ఎడిటర్లు ఆ కార్టూన్ కు పాస్ మార్కులిచ్చినట్లే.
*ఓపిక అలవరుచుకోండి. అలోచించండి. హాయిగా సరదాగా నోరువిప్పి మాట్లాడండి. ఇతరుల మాటలను వినండి. శ్రద్దగాశ్రద్ధగా పరిశీలన చేయండి.......కార్టూన్లు గీయండి.
 
తన ఆత్మకథను "గ్లాచ్చూ మీచ్యూ" అన్న పేరుతో ప్రచురించాడు.
పంక్తి 82:
==కార్టూన్లతో సంఘ సేవ==
[[ఫైలు:NO SMOKING_WKIPEDIA_JAYADEV.jpg|200Px|right|thumb|'''పొగతాగటం అనారోగ్య హేతువు అని చక్కగా చెపుతున్న నిశ్శబ్ద వ్యంగ్య చిత్రం''']]
పొగ తాగటం వల్ల వచ్చే దుష్పరిణామాలు, నలుగురూ ఉన్నచోట ధూమపానం వల్ల జరెగే అసౌకర్యం, ఇతరులకు అనారోగ్య హేతువు కావటం వంటి విషయాలమీద అవగాహన 1970లలోనే వచ్చింది. కాని, బహిరంగ ప్రదేశాలలో పొగతాగటాన్ని నిషేధించటానికి అప్పటినుండి, మూడు దశాభ్దాల పైన పట్టింది. 1960-1970 దశకాలలో మధ్యాహ్నం సమయంలో వేసే ఆటలకు (అప్పట్లో సౌకర్యవంతమైన చల్లని వాతావరణం కలిగివుండే హాళ్ళు లేవు, మొదటి ఆటకు బయట వెలుగు ఉండదు కనుక తలుపులు మొత్తం తీసేవారు)సినిమాకు వెళ్ళితే, పొగ మేఘాల మధ్య చూడవలసి వచ్చేది. పొగరాయుళ్ళు అంతగా తమ అలవాటును యధేచ్ఛగా అన్ని చోట్లా కొనసాగించేవారు. ఇది గమనించి బాధపడిన జయదేవ్, తన కార్టూన్లను మాధ్యమంగా వాడుకుంటూ, ధూమపానం వల్ల వచ్చే దుష్పరిణామాలను ప్రజలకు హాస్యంతో జతపరిచి చెప్పసాగారు. అంతేకాక, తాను స్వతహాగా ఆచార్యుడవటం వల్ల, తాను పాఠం మొదలు పెట్టటానికి ముందు విద్యార్ధులకు పొగ తాగవద్దని హితవు పలికేవారు. వీరి మాటలు సరైన సమయంలో, సరైన విధంగా ఆ విద్యార్ధుల మనస్సులమీద పనిచేసి అనేకమందిని ఆ చెడ్డ అలవాటు బారిన పడకుండా చేసింది. వీరు వేసిన కార్టూన్ (పక్కన కనబడుతున్న కార్టూన్) సకల ప్రజాదరణ పొందటమే కాకుండా, భారత కాన్సర్ సంఘం వారు, తమ ధూమపాన వ్యతిరేక ఉద్యమ ప్రచారంలో కూడకూడా వాడుకుంటున్నారట. భారత వాణిజ్య ప్రదర్శన సంస్థ వారు జయదేవ్‌ను ఢిల్లీకి ఆహ్వానించి సత్కరించారు.
 
==ప్రముఖుల అభిప్రాయాలు==
పంక్తి 94:
Image:6jayadev_176_08.png|<sub>'''అపార్టుమెంటు సంస్కృతి మీద ఒక విసురు'''</sub>
Image:7jayadev_168_08.png|<sub>'''భార్యలకు భర్తల తెలివితేటల మీద సహజంగా ఉండే చులకన భావం మీద వ్యంగ్యం'''</sub>
Image:5jayadev_rraj-50.png|<sub>''' చారిత్రాత్మక హైదరాబాద్హైదరాబాదు లోని [[గోల్కొండ]] కోట లోగల సమాచార ప్రసార విధానం ఆధారంగా అధికారి ఇస్తున్న ఆజ్ఞ హాస్యపూరకంగా'''</sub>
Image:8jayadev_143_08.png|<sub>'''కొడుకుని తొందరగా నిద్రపుచ్చాలో తెలియక తికమకగా తంటాలు పడుతున్న భర్తను చూసి చిలిపిగా నవ్వుకుంటున్న భార్య.'''</sub>
Image:9jayadev_154_08.png|<sub>'''మిఠాయి దుకాణం లోంచి ఉచితంగా మచ్చుక (శాంపిల్) పేరిట మిఠాయులు తినేసి, కొద్దిగా కారపుపదార్థాలు (హాట్) కొనమంటున్న ఒక గడుసు మహిళ'''</sub>
"https://te.wikipedia.org/wiki/జయదేవ్" నుండి వెలికితీశారు