కోదాటి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది. using AWB
పంక్తి 1:
'''కోదాటి నారాయణరావు''' ([[డిసెంబరు 15]], [[1914]] - [[నవంబరు 11]], [[2002]]) గ్రంథాలయోద్యమం నేత మరియు విశాలాంధ్ర ప్రచారకులు.
 
వీరు [[నల్గొండ జిల్లా]] [[రేపాల]] గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి రంగారావు గారు రేపాల కరణంగా చేసేవారు. రేపాలలోని శ్రీ లక్ష్మీనరసింహ మనోహర బాలభారతీ పుస్తక భాండాగారం బాల్యం నుండే అతన్ని ఆకర్షించింది. దాని కార్యకర్తగా గ్రంథాలయ మంచి చెడ్డలు చూసేవారు. ప్రాథమిక తర్వాత సూర్యాపేటలో మెట్రిక్ పూర్తిచేశారు. ఆర్ధిక కారణాల వలన సాయం కళాశాలలో చేరి పట్టా పొందారు. ఎల్.ఎల్.బి. పూర్తిచేశారు. వీరు కొంతకాలం [[గోలకొండ]] పత్రికలో పనిచేసి, జర్నలిజంపై ఆసక్తి కలిగి మందుకుల నరసింగరావు సంపాదకత్వంలోని "రయ్యత్" పత్రికలో ఏజెంట్ గా పనిచేశారు. తర్వాత ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఏజన్సీ తీసుకోవడంతో ప్రజా జీవనంతో సంబంధంలో ఏర్పడింది. వీరు అస్పృశ్యతా నివారణోద్యమం, [[గ్రంథాలయోద్యమం]], జాతీయోద్యమం లలో ప్రముఖ పాత్ర పోషించారు. [[ఖమ్మం]]లోని [[విజ్ఞాన నికేతన గ్రంథాలయం]] ఆయన కృషి వలన స్థాపించబడినదిస్థాపించబడింది. గ్రంథాలయోద్యమం ద్వారా విశాలాంధ్రకు నాందిపలికాడు. విజ్ఞాన నికేతనానికి జరిగే వార్షికోత్సవాల ద్వాతా నిజాం మరియు బ్రిటిష్ వారిలో ప్రముఖులను కోదాటి సమావేశపరిచేవారు.
 
1944లో [[ఇల్లెందు]]లో 25వ ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు [[బూర్గుల రామకృష్ణారావు]] అధ్యక్షతన జరిగింది. [[కోస్తా]], [[రాయలసీమ]], [[తెలంగాణ]] ప్రాంతాల నుండి అనేకమంది ప్రముఖులు విచ్చేశారు. [[విశాలాంధ్ర]] స్వరూపాన్ని ఆ సభ ప్రతిబింబించింది. గ్రంథాలయోద్యమం యావదాంధ్ర దేశానికి ప్రాతినిధ్యం వహించే ఉద్యమంగా మారింది.
పంక్తి 21:
{{తెలంగాణ విమోచనోద్యమం}}
{{నల్గొండ జిల్లాకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1914 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/కోదాటి_నారాయణరావు" నుండి వెలికితీశారు