టీ.జి. కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), లో → లో , కి → కి , పని చేస్తూ → పనిచేస్తూ, నేప using AWB
పంక్తి 35:
}}
 
'''టి.జి.కమలాదేవి''' ([[డిసెంబర్‌ 29]], [[1930]] - [[ఆగస్టు 16]], [[2012]]) (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు)<ref>http://www.oldtelugusongs.com/cgi-bin/search/search.pl?scode=p85</ref> అసలు పేరు '''తోట గోవిందమ్మ'''. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె [[తెలుగు సినిమా]] నటి మరియు [[స్నూకర్]] క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు [[చిత్తూరు నాగయ్య]] భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలం [[కార్వేటినగరం]]. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా [[చూడామణి]]. [[మాయలోకం]] అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. [[అక్కినేని నాగేశ్వరరావు]]తో జోడీగా [[ముగ్గురు మరాఠీలు]] సినిమాలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. [[పాతాళభైరవి]], [[మల్లీశ్వరి]] (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది. ఈమె మల్లీశ్వరిలో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది. తెలుగుతో పాటు అనేక [[తమిళం|తమిళ]] సినిమాల్లో కూడా ఈమె నటించింది.
 
కమలాదేవి ఆగస్టు 16, 2012 న చెన్నైలో మరణించింది.
 
కమలాదేవి ఆగస్టు 16, 2012 న చెన్నైలో మరణించింది.
 
==వ్యక్తిగతం==
Line 46 ⟶ 45:
 
==బాల్యం==
ఎనిమిదేళ్ళ వయసులో ఎవిఎం వారి ''నాటి సరస్వతి స్టార్స్‌'' తరపున ఓపెన్‌ రికార్డింగ్‌లో ఓ పాట పాడేందుకు తొలిసారిగా [[చెన్నై]] వెళ్ళింది. [[టి.చలపతిరావు]] ఈమెకు ''నేను కనలేని జీవితము...'' అనే పాటను సుమారు 20 రోజుల పాటు నేర్పించి ఓపెన్‌ రికార్డింగ్‌లో పాడించాడు. చిన్న వయస్సులోనే ''కనకతార'', ''భూపుత్రి'', ''ఐదు పువ్వుల రాణి'' వంటి పలు నాటకాల్లో ఈవిడ నటించింది. ఈమెకు చిన్నతనం నుండి సినిమాలంటే ఆసక్తి, ఇష్టం ఉండేది. అక్క జయమ్మ వివాహం చిత్తూరు నాగయ్యతో జరగడంతో ఈవిడ మిగతా బాల్యం [[చెన్నై]] లోని మైలాపూర్, మాంబళంలలో వారింట్లో కొనసాగింది. అప్పట్లోనే [[చెన్నై]] [[ఆకాశవాణి]] కేంద్రంలొకేంద్రంలో సంగీత, పౌరాణిక నాటకాలలొనాటకాలలో, లైట్ మ్యూజిక్ కచేరిలలోను తన ప్రతిభ కనబరిచింది.
 
==బహుముఖ ప్రఙ్ఞాశాలి==
రంగస్థలం, చిత్రసీమ, ఆకాశవాణి, క్రీడారంగం వంటి నాలుగు మాధ్యమాల్లో నిలదొక్కుకున్న వ్యక్తి కమాలదేవి. నాటక రంగం ఆమె ప్రధాన వ్యాపకం, అభిమాన రంగం. మద్రాసులో ఉన్న ''చెన్నపురి ఆంధ్రమహాసభ'' కార్యక్రమాల వెనుక ఆమె కార్యదీక్ష, దక్షత, ముందుచూపు ఉన్నాయి. [[1950]]లో ఆ సంస్థలో సభ్యత్వం పొంది [[1956]] నుంచి కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో సేవ చేసింది.
 
===సినిమాలు===
Line 61 ⟶ 60:
 
===ఆటలు===
1947లో సరదాగా ఆమె [[బిలియర్డ్స్]] నేర్చుకుంది. ఇంకో కథనం ప్రకారం 54 సంవత్సరాల వయసులో తొలిసారిగా స్నూకర్ ఆడటం ప్రారంభించింది<ref name=manikns>లైవ్ స్పేసెస్ లోని [http://manikns.spaces.live.com/blog/cns!FEA72452726CF2A8!144.entry మనీస్ స్పేస్] అనే ఒక బ్లాగులోని పోస్టు నుండి సేకరించారు. ఈ పోస్టులో కమలా చంద్రబాబు 54 సంవత్సరాలప్పుడు స్నూకర్ ఆడటం ప్రారంభించిందని చెప్పారు. [[జూలై 13]] [[2007]]న సేకరించారు.</ref>. [[1956]]లో [[ఆస్ట్రేలియా]] ఛాంపియన్ బాబ్ మార్షల్ తో [[బెంగళూరు]]లో తలపడింది. ఆ తరువాత అఖిలభారత ఛాంపియన్ సెల్వరాజ్ తో క్వార్టర్ ఫైనల్ లో పోటీపడింది. [[1994]], [[1995]]లలో బెంగళూరులో జరిగిన స్నూకర్ పోటీలలో విజేతగా నిలిచింది. తిరిగి 1994లో ఓపెన్ బిలియర్డ్స్, స్నూకర్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లోనూ విజేతగా నిలిక్చింది. [[జమ్మూ కాశ్మీరు|జమ్మూ]]లో జరిగిన జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో కూడా ఈమె ఆడింది. బిలియర్డ్స్ ఆడి, విజేత అయిన మొదటి భారత స్త్రీ, కమలాదేవి. బిలియర్డ్స్ ఆటలో [[1991]] లో జెంషెడ్ పూర్ లో, ఆ తరువాత 1995 బెంగుళూరులో జరిగిన జాతీయస్థాయి పోటీలలో విజేతగా నిలచింది. దాదాపు 80 సంవత్సరాల వయసులో ఇప్పటికీ స్నూకర్ పోటీలలో పాల్గొంటుంది<ref>2006 జనవరి 3 [[హిందూ పత్రిక]]లో [http://www.hindu.com/2006/01/03/stories/2006010312131800.htm స్నూకర్ పోటీలపై వచ్చిన వార్త]. జూలై 13 2007న సేకరించారు.</ref>.
 
===ఇతర విశేషాలు===
* [[పాతాళభైరవి]] సినిమాలో ''ఇతిహాసం విన్నారా ఆ అతిసాహసులే ఉన్నారా'' గీతాన్ని ఆలపించింది
* ''ఎవరే పిలిచే రల్లన మెల్లన పిల్లనగ్రోవిని ప్రియా ప్రియా'' అన్న దేవులపల్లి గీతాలు పాడింది
* [[దొంగలున్నారు జాగ్రత్త]]లో [[జి.వరలక్ష్మి]]కి, [[భక్త రామదాసు]]లో [[కన్నాంబ]]కు, [[గొల్లభామ]]లో [[అంజలీదేవి]]కి నేపధ్యనేపథ్య గానం చేసింది.
* [[సంపూర్ణ రామాయణం (1936 సినిమా)|సంపూర్ణ రామాయణం]]లో [[పద్మిని]]కి, [[పాండురంగ మహత్యం]]లో [[బి.సరోజాదేవి]]కి, ఇతర భాషా నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది.
* ''కంజన్‌'' అనే తమిళ సినిమాలోనూ నటించింది.
* 1956నుండి చెన్నపురి ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలిగా పని చేస్తూందిపనిచేస్తూంది.
* చిత్తూరు నాగయ్య జ్ఞాపకార్ధం నెలకొల్పిన చిత్తూరు నాగయ్య మెమోరియల్ అకాడమీ కిఅకాడమీకి ఈమె ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తూంది.<ref>ఏప్రిల్ 9, 2007న హిందూ పత్రికలో [http://www.hindu.com/2007/04/09/stories/2007040915140200.htm చిత్తూరు నాగయ్య 103వ వర్ధంతి] సందర్భంగా వచ్చిన వార్త. జూలై 13, 2007న సేకరించారు.</ref>
 
==సినిమాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/టీ.జి._కమలాదేవి" నుండి వెలికితీశారు