రాకేష్ రోషన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , ఉద్దేశ్యం → ఉద్దేశం, అతిధి → అతిథి , బర్త → భర్ using AWB
పంక్తి 1:
'''రాకేష్ రోషన్''' (జననం 6 సెప్టెంబరు 1949) ప్రముఖ భారతీయ నిర్మాత, దర్శకుడు, నటుడు. రాకేష్ అసలు పేరు రాకేష్ రోషన్ లాల్ నగ్రత్. 1970-1990ల కాలంలో బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. 1970ల నుంచి 90ల వరకు దాదాపు 84 సినిమాల్లో నటించారు ఆయన. సినిమా పేర్లలో "K" అక్షరంతో మొదలయ్యే సినిమాలకు దర్శకత్వం వహించడం ద్వారా చాలా ప్రసిద్ధి పొందారు రాకేష్. ప్రముఖ బాలీవుడ్ నటుడు [[హృతిక్ రోషన్]] రాకేష్ కుమారుడు. ఖుద్గర్జ్, ఖూన్ భారీ మాంగ్, కిషన్ కన్హయ్యా, కరణ్ అర్జున్, కహో నా.. ప్యార్ హై, కోయీ.. మిల్ గయా, క్రిష్ (సిరీస్) వంటి సినిమాల్లో ఈయన నటన చెప్పుకోదగ్గది. కహో నా ప్యార్ హై, కోయీ మిల్ గయా సినిమాలకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు.
 
== కుటుంబం ==
[[పంజాబీ హిందువులు|పంజాబీ హిందూ]] కుటుంబంలో పుట్టారు రాకేష్.<ref>[http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Rakesh-Roshan-Hrithik-Roshan-Bollywood-Krrish-3/articleshow/24255933.cms What I don’t like about Hrithik is that he trusts everybody: Rakesh Roshan – Times of India]. </ref> ఆయన తండ్రి రోషన్ బాలీవుడ్ సంగీత దర్శకుడు. తమ్ముడు రాజేష్ రోషన్ కూడా సంగీత దర్శకుడే. దర్శకుడు జె.ఓం ప్రకాష్ కుమార్తె పింకీని వివాహం చేసుకున్నారు ఆయన. వీరి కుమారుడు [[హృతిక్ రోషన్]] నటుడు. కుమార్తె సునయన. రాకేష్ మహారాష్ట్ర, సతారాలోని సైనిక్ స్కూలులో చదువుకున్నారు.
 
== కెరీర్ ==
 
=== 1970–1990 ===
1970లో ఘర్ ఘర్ కి కహానీ సినిమాలో సహనటునిగా సినీ రంగప్రవేశం చేశారు రాకేష్. ఆయన కెరీర్ మొత్తం మీద సోలో హీరోగా చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. కథానాయికా ప్రధానమైన సినిమాల్లో ఎక్కువగా సోలో హీరో అవకాశాలు వచ్చాయి ఆయనకు. హేమా మాలినితో పరయా ధాన్, భారతితో ఆంఖ్ మిచోలీ, రేఖాతో ఖూబ్ సూరత్, జయప్రద తోజయప్రదతో కామ్ చోర్ వంటివి ఆ కేవకు చెందినవే. సోలో హీరోగా ఆయన చేసిన  ఆంఖో ఆంఖో మే, నఫ్రత్, ఏక్ కున్వారీ ఏక్ కున్వారా, హమారీ బహూ అల్కా, శుభ్ కామ్నా, రాటి అగ్నిహోత్రి వంటి సినిమాలు మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి. ఆంఖో ఆంఖో మే సినిమాను  నిర్మించిన జె.ఓం ప్రకాశ్ రాకేశ్ సహాయ నటునిగా ఆఖిర్ క్యూ అనే సినిమా కూడా తీశారు. మన్ మందిర్, ఖేల్ ఖేల్  మే, బుల్లెట్, హత్యారా, ధోంగే, ఖాందాన్, నీయాత్ వంటి సినిమాల్లో సహాయ నటునిగా చేశారు. [[రాజేష్ ఖన్నా]] హీరోగా నటించిన సినిమాల్లో ఎక్కువగా  సహాయ  నటునిగా నటించారు రాకేష్. ఈ కాంబినేషన్ లో వచ్చిన చట్లా పుర్జ్  ఫ్లాప్ అయినా, ఆ తరువాత వచ్చిన ధన్వాన్, ఆవాజ్, ఆఖిర్ క్యూ సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్లు అయ్యాయి. 1977-1986 ల్లో సంజీవ్ కుమార్ తో కలసి ఆయన రెండో హీరోగా చేసిన దేవతా, శ్రీమాన్ శ్రీమతి,  హాత్కడీ వంటి మల్టీ స్టారర్ సినిమాలు విజయం సాధించాయి. మిథున్ చక్రబర్తితోచక్రభర్తితో కలసి, రెండో కథానాయకునిగా ఆయన చేసిన జాగ్ ఉఠా ఇన్సాన్, ఏక్ ఔర్ సికందర్ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. సోలో హీరోగానూ, రెండో హీరోగానూ చేసిన దిల్ ఔర్ దీవార్, ఖట్టా మీఠా, ఉన్నీస్-బీస్ (1980), మకార్ (1986) సినిమాలు కూడా విజయం సాధించాయి.
 
1980లో స్వంత నిర్మాణ సంస్థ ఫిలిం క్రాఫ్ట్ ను స్థాపించారు రాకేష్. సంస్థ మొదటి సినిమా ఆప్ కే దీవానే (1980)  ఫ్లాప్ అయింది. ఆ తరువాతా ఆయన నిర్మించిన కామ్ చోర్ కమర్షియల్ గానూ, సంగీతపరంగానూ మంచి విజయం సాధించింది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన శుభ్ కామ్నా పెద్ద హిట్ అయింది. జె.ఓం ప్రకాశ్ దర్శాకత్వంలో రాకేష్, [[రజనీకాంత్|రజినీకాంత్]] హీరోలుగా నటించిన భగవాన్ దాదా  సినిమా ఫ్లాప్ అయింది. 1983-90ల మధ్యకాలంలో  బహూరాణి, మకర్, ఏక్ ఔర్ సికందర్ వంటి సినిమాల్లో నటించారు ఆయన. 1989లో మాణిక్ చటర్జీ దర్శకత్వంలో రేఖతో కలసి నటించిన  బహూరాణి సినిమా హీరోగా రాకేష్ కు ఆఖరి చిత్రం.
 
=== 1990-ఇప్పటివరకు ===
[[దస్త్రం:_Rakesh_Roshan,_Thakur_Doultani_&_Hrithik_Roshan.jpg|thumb|కుమారుడు [[హృతిక్ రోషన్]], ఠాకూర్ దౌల్తానిలతో రాకేష్ రోషన్]]
రాకేష్ కు దర్శకునిగా ఖుద్గర్జ్ (1987) మొదటి సినిమా. ఆ తరువాత ఆయన దర్శకత్వం వహించిన ఖూన్ భారీ మాంగ్ (1988), కిషన్ ఖన్నయ్యా (1990), కరణ్ అర్జున్ (1995) వంటి హిట్లు సాధించారు ఆయన. 1990-1999 మధ్యకాలంలో అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్లో అతిధిఅతిథి పాత్రలు మాత్రమే చేశారు. ఆ సమయంలో ఎక్కువగా దర్శకత్వం పైనే దృష్టి పెట్టారు రాకేష్. తన కుమారుడు హృతిక్ ను స్వంత దర్శకత్వంలో, నిర్మాణంలో తీసిన కహో నా.. ప్యార్ హై (2000) సినిమాతో తెరంగేట్రం చేయించారు రాకేష్. ఆ సంవత్సరానికి అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమా ఇదే కావడం ఒక విశేషమైతే, లిమ్కా బుక్ తో సహా అతి ఎక్కువ అవార్డులు సాధించిన బాలీవుడ్ సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. 2003లో మళ్ళీ తన కుమారుడు హీరోగా కోయీ.. మిల్ గయా సినిమాకు దర్శకత్వం వహించారు ఆయన. ఈ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం అందుకున్నారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.sify.com/movies/filmfare-awards-2004-winners-list-news-bollywood-kkfvNnffjfa.html|title=Filmfare Awards 2004: Winners List|accessdate=21 July 2012}}</ref> దీనికి సీక్వెల్ గా వచ్చిన క్రిష్ (2006)కూడా పెద్ద హిట్ అయింది.<ref>{{వెబ్ మూలము|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=127&catName=MjAwMC0yMDA5|title=Boxofficeindia.com|date=|accessdate=29 June 2011|publisher=Boxofficeindia.com}}</ref> 2008లో క్రేజీ4 సినిమాను నిర్మించారు. 2010లో కైట్స్ సినిమాను విడుదల చేశారు రాకేష్. ఈ సినిమానే బ్రెట్ రాట్నర్ ప్రెజంట్స్ కైట్స్: ది రీమిక్స్ పేరుతో అంతర్జాతీయంగా విడుదల చేశారు. తాజాగా కుమారుడు విడాకులు తీసుకోవడంతో బాధకు గురైన రాకేష్, "K" అక్షరంతో మొదలయ్యే సినిమా పేర్ల సెంటిమెంట్ ను పక్కకు పెట్టి బంధాల గురించి తెలిపే కథతో "జుదాయీ.. మతలబ్ ప్యార్ హై" టైటిల్ తో సినిమా తీయబోతున్నారు. ఈ సినిమా 2017 విడుదల కావచ్చు.
 
=== రాకేష్ పై దాడి ===
21 జనవరి 2000న సాంతాక్రూజ్ వెస్ట్ లోని తిలక్ రోడ్ లోగల తన ఆఫీస్ వద్ద బుదేష్ గ్యాంగ్ కు చెందిన ఇద్దరు రాకేష్ పై కాల్పులు జరిపారు.<ref>[http://www.hinduonnet.com/fline/fl1917/19170340.htm The stars and the dons]. </ref> వాళ్ళు కాల్చిన రెండూ బుల్లెట్లలో ఒకటి ఎడమ చేతిలోకి, ఒకటి చెస్ట్ లోకి దూసుకెళ్ళింది. ఈ కాల్పులతో రాకేష్ నేలకొరగడంతో దుండగులు ఆ ప్రదేశం నుంచి పారిపోయారు.<ref>[http://www.rediff.com/news/2000/jan/21roshan.htm Rakesh Roshan shot at]. </ref> ఆ తరువాత కాల్పులు జరిపినవారు సునీల్ విఠల్ గైక్వాడ్, సచిన్ కాంబ్లేలుగా గుర్తించారు. కహో నా.. ప్యార్ హై సినిమా ఓవర్ సీస్ లాభాలను తనకు ఇమ్మని బదేష్ బలవంతపెట్టగా, ఇవ్వను అన్నందుకు అతన్ని భయపెట్టాలనే ఉద్దేశ్యంతోఉద్దేశంతో కాల్పులు జరిపారనేది ఆరోపణ.<ref>{{Cite journal|author=Swami, Praveen|url=http://www.hinduonnet.com/fline/fl1711/17110430.htm|title=Of politics and profit|volume=17|issue=11|date=June 2000|journal=Frontline}}</ref>
 
== గౌరవాలు ==
పంక్తి 25:
 
=== నటునిగా.. ===
* ఘర్ ఘర్ కీ కహానీ (1970) ... సురేష్
* సీమా (1971)
* మన్ మందిర్ (1971) ... రామూ
* పరయా ధాన్ (1971) .. శంకర్
* ఆంఖో ఆంఖో మే (1972) .... రాకేష్ రాయ్
* నఫ్రత్ (1973) .... ప్రకాష్ కుమార్
* మధోష్ (1974).. గోల్డీ
* జఖ్మే (1975) .... అమర్
* ఖేల్ ఖేల్ మే (1975) .... విక్రమ్ (విక్కీ)
* ఆక్రమణ్ (1975) ...లెఫ్టినెంట్ సునీల్ మెహ్రా
* గిన్నీ ఔర్ జానీ (1976) .... జానీ
* ఆనంద్ ఆశ్రమ్ (1977) .... డా.ప్రకాష్
* చల్తా పుర్జా (1977) .... పోలీస్ ఇన్స్పెక్టర్ సునీల్ వర్మ
* ప్రియతమ (1977) ... విక్కీ
* ఖట్టా మీటా (1978) .... ఫిరోజ్ సేత్నా
* ఆహుతి (1978) ...భరత్ ప్రసాద్
* దిల్ ఔర్ దీవార్ (1978) ... చందు
* దేవత (1978) ... జార్జ్
* ఝూతా కహీ కా (1979) ... విజయ్ రాయ్/విక్రమ్
* ఖాందాన్ (1979) .... రాకేష్ దినంత్
* ఖూబ్ సూరత్ (1980) .... ఇందర్ గుప్త
* ప్యారా దుష్మన్ (1980)
* ఆప్కే దీవానే (1980) .... రహీమ్
* ధన్ వాన్ (1981) .... అనిల్
* శ్రీమాన్ శ్రీమతి (1982) ... రాజేష్
* హమారీ బహూ అల్కా (1982) ... ప్రతాప్ చంద్
* కామ్ చోర్ (1982) .... సూరజ్
* తీస్రా ఆంఖ్ (1982) .... ఆనంద్ నాథ్
* శుబ్ కామ్నా (1983)... రతన్
* జాగ్ ఉఠా ఇన్సాన్ (1984) ... నందు
* ఆవాజ్ (1984) .... విజయ్ గుప్త
* ఆఖిర్ క్యూ? (1985) ... కబిర్ సూరి
* మహాగురు (1985)... సుభాష్
* భగవాన్ దాదా (1986) .... స్వరూప్
* అనుభవ్ (1986).... అమిత్
* ఏక్ ఔర్ సికందర్ (1986) ... బోగ సేత్
* డాకూ హసీనా (1987) ... ఎస్.పి రంజిత్ సక్సేనా
* ఖూన్ భారీ మాంగ్ (1988) .... విక్రమ్ సక్సేనా
* బహూరాణి (1989) .... అమిత్
* అకేలే హమ్ అకేలే తుమ్ (1995) .... పరేష్ కపూర్
* ఔరత్ ఔరత్ ఔరత్ (1996) .... రాకేష్ గుడ్డూ
* మదర్ (1999) .... అమర్ ఖన్నా
* కోయీ మిల్ గయా (2003) .... సంజయ్ మెహ్రా
* ఓం శాంతి ఓం (2007) .... స్వంత పాత్ర
 
=== దర్శకునిగా.. ===
* ఖుద్గర్జ్ (1987)
* ఖూన్ భారీ మాంగ్ (1988)
* కాలా బజార్ (1989)
* కిషన్ ఖన్నయ్యా (1990)
* ఖేల్ (1992)
* కింగ్ అంకుల్ (1993)
* కరణ్ అర్జున్ (1995)
* కొయ్లా (1997)
* కారోబార్:ది బిజినెస్ ఆఫ్ లవ్ (2000)
* కహో నా..ప్యార్ హై (2000)
* కోయీ మిల్ గయా (2003)
* క్రిష్ (2006)
* క్రిష్ 3 (2013)
 
=== నిర్మాతగా.. ===
ఫిలింక్రాఫ్ట్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాకేష్ రోషన్ కొన్ని సినిమాలు నిర్మించారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.boxofficeindia.co.in/tag/filmkraft-productions-india-pvt-ltd/|title=Filmkraft Productions (India) Pvt Ltd &#124; Box Office India : India’s premier film trade magazine|date=22 May 2010|accessdate=31 October 2015|publisher=Box Office India|author=}}</ref><ref>{{వెబ్ మూలము|url=http://www.business-standard.com/article/beyond-business/graphic-india-and-filmkraft-launch-krrish-comics-113092300363_1.html|title=Graphic India and Filmkraft launch Krrish comics &#124; Business Standard News|date=|accessdate=31 October 2015|publisher=Business-standard.com}}</ref>
* ఆప్కే దీవానే (1980)
* కామ్ చోర్ (1982)
* జాగ్ ఉఠా ఇన్సాన్ (1984)
* భగవాన్ దాదా (1986)
* ఖుద్గర్జ్ (1987)
* ఖూన్ భారీ మాంగ్ (1988)
* కిషన్ ఖన్నయ్యా (1990)
* కింగ్ అంకుల్ (1993)
* కరణ్ అర్జున్ (1995)
* కోయ్లా (1997)
* కహో నా..ప్యార్ హై (2000)
* కోయీ..మిల్ గయా (2003)
* క్రిష్ (2006)
* క్రేజీ 4 (2008)
* కైట్స్ (2010)
* క్రిష్ 3 (2013)
 
== మూలాలు ==
{{Reflist|30em}}
 
[[వర్గం:1949 జననాలు]]
[[వర్గం:భారతీయ చలన చిత్ర దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/రాకేష్_రోషన్" నుండి వెలికితీశారు