రోహిణి (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ను → ను (2), → (2) using AWB
పంక్తి 1:
రోహిణి పేరుతో కల మరొక నటి గురించి చూడండి.[[రోహిణీ హట్టంగడి]]
{{Infobox person
| name = రోహిణి
పంక్తి 15:
| awards =
}}
'''ఆర్.రోహిణి''', దక్షిణ భారత సినిమా నటి. సినీరంగములో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం]] మరియు [[మళయాళం]] భాషలలో అనేక సినిమాలలో బాల్యనటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలము తర్వాత చాలా సినిమాలలో చెల్లెలి పాత్రలు చేసింది. [[నవమోహిని]] లాంటి సినిమాలలో గ్లామర్ పాత్రలు పోషించినా, అంతగా విజయవంతము కాలేదు<ref>[http://www.telugucinema.com/c/publish/movieretrospect/stri1995.php తెలుగుసినిమా.కాంలో స్త్రీ సినిమా సమీక్ష]</ref> రోహిణి సినీ నటుడు [[రఘువరన్]] ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నది. వీరి వివాహబంధము పొసగక వివాహమైన ఏడు సంవత్సరాలకు 2003లో విడాకులు తీసుకొని విడిపోయారు.
 
==సినీరంగ ప్రవేశం==
రోహిణి విశాఖపట్నంలో ఒక తెలుగు కుటుంబంలో పుట్టింది. ఈమెకు ముగ్గురు అన్నలు, ఒక తమ్ముడు. తెలుగు టీవీ నటుడు బాలాజీ కూడా ఈమె సోదరుడే. రోహిణి తండ్రికి సినిమాలంటే ఆసక్తి ఉండేది. రోహిణికి నాలుగేళ్ళ వయసులో తల్లి చనిపోవడంతో చెన్నైకి మకాం మార్చి, సినిమాల మీద ఆసక్తితో తండ్రి స్టూడియోల చుట్టూ తిరుగుతుంటే రోహిణిని కూడా తీసుకువెళ్ళేవాడు. అలా స్టూడియోలో ఆమెను చూసి బాలనటిగా అవకాశమిచ్చారు. తండ్రికి సినిమాలంటే ఇష్టమే కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండానే సినీరంగంలో ప్రవేశించింది.
 
== డబ్బింగు ఆర్టిస్ట్ ==
డబ్బింగు ఆర్టిస్ట్ గా చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ లకు స్వర సహాయం చేసింది. "లేచి పోదామా" అని కవ్వించే గీతాంజలి నాయిక గొంతు, "చాయ్ పిలాతే" అనే "శివ" నాయిక గొంతు రోహిణిదే. నాలుగు స్తంభాలాట సినిమాకి సహాయ దర్శకులుగా పనిచేసిన పాణి షూటింగ్లో రోహిణిని గమనించి, గీతాంజలిలో గిరిజ డబ్బింగ్ కోసం ఆర్టిస్టును వెతుకుతుంటే రోహిణిని అడగమని సలహా ఇచ్చాడట. సినిమా ఆర్టిస్టుగా బదులు డబ్బింగ్ ఆర్టిస్టుగా ముద్రపడిపోతుందేమోనని భయంతో చేయకూడదని అనుకున్నా, మణిరత్నం సినిమాలో అవకాశం కాదనలేక ఈ సినిమాకు డబ్బింగు చేసింది. గీతాంజలి తర్వాత "శివ" లో అమల పాత్రకు డబ్బింగ్ చేయమని రాంగోపాల్ వర్మ అడిగితే రోహిణి ఒప్పుకోలేదు. ఒక మూడు రీళ్ళు చూసి నచ్చితే చేయమన్నారు. అది చూసి నచ్చాక అమలకు కూడా డబ్బింగ్ చెప్పారు. ఆ సినిమా పెద్ద హిట్టై పోవడంతో ఇక అలాగే డబ్బింగు రంగంలో కొనసాగింది. ఒక్క విజయశాంతికి తప్ప దాదాపు తెలుగులో అందరు హీరోయిన్లకు డబ్బింగు చెప్పింది రోహిణి.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/rohini_interview.php telugucinema.com Interview with Rohini (Telugu Text)]</ref>
 
==నటిగా గుర్తింపు==
1995లో [[పాలగుమ్మి పద్మరాజు]] "పడవప్రయాణం" కథ ఆధారంగా మలయాళ దర్శకుడు [[కె.ఎస్.సేతుమాధవన్]] నిర్మించిన [[స్త్రీ (1995 సినిమా)|స్త్రీ]] సినిమాలో ముఖ్యపాత్రను పోషించిన రోహిణి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది. రోహిణి తెలుగులో హీరోయిన్‌గా నటించిన చిత్రం "స్త్రీ" లో ఈమె ప్రదర్శించిన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో ఉత్తమ మహిళా నటి నంది బహుమతితో సత్కరించింది. ఈ చిత్రం విడుదలకు నోచుకోక పోయినా ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే నేషనల్ అవార్డు కూడా ఈమెను వరించింది. వీటితో పాటు "వీరుమండి", "తామరైభరణి", "ఒంబదు రూబాయ్ నోట్టు" అనే తమిళ చిత్రాలలో రోహిణి పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.
 
ప్రతిభావంతమైన వ్యక్తి అయిన రోహిణి ఆ తర్వాత సామాజిక సేవ కార్యక్రమాలు మరియు టీవీ కార్యక్రమాలలో నిమగ్నమైనది. చాలా వ్యవధి తర్వాత [[కమల్ హాసన్]] సినిమా [[పోతురాజు]] (తమిళంలో విరుమాండి)లో, అయ్యన్ (తమిళం)లో నటించింది. పోతురాజు సినిమాలో ఒక పరిశోధకురాలి పాత్రలో కనిపించింది. [[అలా మొదలైంది]] సినిమాలో [[నాని]] కి తల్లిగా నటించారు.
 
సినీరంగంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే బుల్లితెరలో ప్రవేశించింది. వివిధ సీరియల్ కథలకు స్క్రిప్టులు రాశారు. "వీరుక్కు నీర్" అనే టెలీ ఫిల్మ్‌ కోసం అమెకు 2005లో సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వరించింది.<ref>[http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/0802/13/1080213016_1.htm నటి రోహిణి సృజనకు ప్రతిరూపం "సైలెంట్ హ్యూస్" - వెబ్ దునియా 14 ఫిబ్రవరి 2008]</ref>
 
రోహిణి [[ఎయిడ్స్]] వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించడానికి అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నది.<ref>http://www.hindu.com/mp/2004/01/07/stories/2004010700480400.htm</ref><ref>http://www.hinduonnet.com/thehindu/mp/2005/11/26/stories/2005112600660400.htm</ref> తమిళనాడు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డాక్టర్ ఎంజిఆర్ విశ్వవిద్యాలయం తరపున నిర్మించిన ఎయిడ్స్ అవగాహన షార్ట్‌ ఫిల్మ్స్‌కు ఆమె దర్శకత్వం వహించింది. అంతేకాకుండా సామాజిక అంశాలను ప్రతిబింభించే అంశాలపై చర్చా వేదికలు నిర్వహించింది.
"https://te.wikipedia.org/wiki/రోహిణి_(నటి)" నుండి వెలికితీశారు