"జయలలిత" కూర్పుల మధ్య తేడాలు

 
== బాల్యం ==
జయలలిత ఫిబ్రవరి 24, 1948న అప్పటి [[మైసూరు]] రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది.<ref>http://www.dnaindia.com/mumbai/report-j-jayalalithaa-s-victory-in-tamil-nadu-finds-resonance-in-mumbai-1989569</ref><ref>{{Cite news|url=http://www.dnaindia.com/mumbai/report-j-jayalalithaa-s-victory-in-tamil-nadu-finds-resonance-in-mumbai-1989569|title=Jayalilathaa victory finds resonance|publisher=DNA|access-date=2 February 2016}}</ref> జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.
 
తిరుచ్చి జిల్లా శ్రీరంగం పూర్వీకంగా కలిగిన జయలలిత [[1981]]లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించి రామచంద్రన్ మరణానంతరం అతని భార్య [[జానకి రామచంద్రన్]] తమిళనాడు ముఖ్యమంత్రి అయిననూ ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది. జయలలిత [[1989]] అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానంసంపాదించిరి. [[1991]]లో [[రాజీవ్ గాంధీ]] మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో [[కాంగ్రెస్ పార్టీ]]తో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి [[2006]] [[మే]]లో జరిగిన [[శాసనసభ]] ఎన్నికలలో పరాజయం పొందినది. ఆమె పార్టికి కేవలము నాలుగు స్థానాలే దక్కాయి. 2006 లో ఓటమి సమయంలో తమ మిత్రపక్షాలతో కలిసి శాసన సభలో 1977 తరువాత అత్యంత పటిష్ఠమైన ప్రతిపక్షంగా నిలవగల సీట్లను సంపాదించారు. ఈమే ప్రస్తుత తమిళ నాడు ముఖ్యమంత్రి. అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2031825" నుండి వెలికితీశారు