సప్తగిరులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కి → కి (2), గా → గా , తో → తో , కూడ → కూడా , అభివృ using AWB
పంక్తి 6:
 
== చరిత్ర ==
1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రికుడు, యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] అప్పట్లో ఈ ప్రాంతం ఎలావుండేదో వ్రాశారు. [[గాలిగోపురం]] వరకూ ఎక్కడం, దిగడం బహు ప్రయాస అని వ్రాసుకున్నారు. అక్కడ నుంచి కొంత భూమి సమంగా ఉండేదని, మళ్ళీ ఎక్కిదిగాల్సిన ప్రాంతాలున్నా ఆపై ప్రయాణం అంత ప్రయాసగా ఉండేది కాదన్నారు. దారిలో నిలిచేందుకు జలవసతి గల [[మంటపాలు]] చాలా ఉండేవి. గాలిగోపురం వద్ద ఒక [[బైరాగి]] శ్రీరామవిగ్రహాన్ని పూజిస్తూ, యాత్రికులకు మజ్జిగ వంటివిచ్చి ఆదరించేవాడని వ్రాశారు<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
 
==ఉపోద్ఘాతము==
[[భగవంతుడు]] పంచాత్మ స్వరూపుడని [[తైత్తరీయ ఉపనిషత్తు]] పేర్కొంటోంది. అంటే దేవుడిని మనం [[పర]], [[వ్యూహ]], [[విభవ]], [[అంతర్యామి]], [[అర్చావతారం|అర్చావతారాలలో]] చూడగలుగుతాం. నిత్యులు, ముక్తులు- అంటే జన్మరాహిత్యాన్ని పొందినవారు మాత్రమే స్వామిని పరరూపంలో- వైకుంఠంలో చూడగలుగుతారు. నారదుని వంటి మహామునులు మాత్రమే స్వామిని-వ్యూహంలో అంటే క్షీరాబ్దిలో చూడగలుగుతారు. స్వామివారి అవతారాల రూపంలో జన్మించినవారు లేదా ఆయా అవతారాల సమయంలోని సమకాలికులు- అంటే [[శ్రీకృష్ణుడు]], [[శ్రీరాముడు]] వంటి వారు మాత్రమే స్వామి విభవ స్వరూపాన్ని చూడగలుగుతారు. యోగసాధనతో, నిరంతర తపస్సుతో స్వామిని భజించేవారికే అంతర్యామి స్వరూపదర్శనం లభిస్తుంది. ఇక సామాన్యులకు లభించేది అర్చావతారమే! ఈ అర్చావతారం మనకు 108 దివ్యదేశాలలో కానవస్తుంది. ఈ 108 దివ్యదేశాల గురించి శ్రీ వేంకటేశ్వరుని భక్తాగ్రేసరులైన [[ఆళ్వారు|ఆళ్వార్లు]] తమ [[నాలాయిర దివ్య ప్రబంధము|నాలాయీర దివ్యప్రబంధాలలో]] ప్రస్తుతించారు.
"https://te.wikipedia.org/wiki/సప్తగిరులు" నుండి వెలికితీశారు