జానమద్ది హనుమచ్ఛాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
ఇతడు [[ సెప్టెంబరు 5]], [[1926]] లో [[అనంతపురం]] జిల్లా [[రాయదుర్గం]] లో జన్మించాడు. [[రాయదుర్గం]] జిల్లా బోర్డు హైస్కూలులో ఎస్.ఎస్.ఎల్.సి చదివాడు. ప్రైవేటుగా బి.ఎ. ఉత్తీర్ణుడైనాడు. బి.ఇడి. కూడా పూర్తి చేశాడు. స్వయంకృషితో [[తెలుగు]], [[ఇంగ్లీషు]] భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు.
 
1946లో [[బళ్ళారి]] లోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. [[కడప]] లో [[సి.పి.బ్రౌన్]] స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడి 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించాడు. వీరి కృషితో అది వాస్తవ రూపం ధరించింది. ఈ కేంద్రానికి 15 వేల గ్రంథాలను శాస్త్రి సేకరించి, బ్రౌన్ ద్విశతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాడు. 'బ్రౌన్ శాస్త్రి'గా పేరు గడించాడు. కడపజిల్లా రచయితల సంఘం 1973లో స్థాపించి 20ఏళ్లు కార్యదర్శిగా పనిచేశాడు. రాష్ట్రంలోని సుప్రసిద్ధ రచయితలను కడపజిల్లాకు పరిచయం చేసిన ఘనత ఇతనిదే. [[బెజవాడ గోపాలరెడ్డి]], [[ఆరుద్ర]], [[దాశరథి]], [[కుందుర్తి]], [[పురిపండా అప్పలస్వామి]], [[శ్రీశ్రీ]], [[సి.నా.రె.]],[[దేవులపల్లి రామానుజరావు]],[[దివాకర్ల వెంకటావధాని]] మొదలైన రచయితలను, విద్వాంసులను రప్పించి అద్భుతమైన కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు.