గిడుతూరి సూర్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
== సినిమా రంగం ==
[[రణభేరి]], [[ఆస్తికోసం]], [[కథానాయకురాలు]], [[విక్రమార్క విజయం]], [[పేదరాశి పెద్దమ్మ కథ]], [[అమృతకలశం]],[[నేను నా దేశం]], [[పంచ కళ్యాణి దొంగల రాణి]], [[పంజరంలో పసిపాప]], [[సంగీత లక్ష్మి]], [[స్వామిద్రోహులు]] మొదలైన చిత్రాలకు దర్శకునిగా పనిచేశాడు. [[రాజేశ్వరి (సినిమా)|రాజేశ్వరి]] చిత్రానికి [[అనిసెట్టి సుబ్బారావు]]తో కలిసి పాటలను వ్రాశాడు. [[పంజరంలో పసిపాప]], [[పంచ కళ్యాణి దొంగల రాణి]] సినిమాలకు కథ, చిత్రానువాదం సమకూర్చాడు. [[పంచ కళ్యాణి దొంగల రాణి]] చిత్రాన్ని నిర్మించాడు.
 
మనదేశంలో దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభం కానున్న తొలిరోజులలో [[టి.వి]] కోసం భారతీయ నటులతో, [[రష్యన్]] సాంకేతిక నిపుణులతో నలుపు తెలుపుల్లో మొట్టమొదటిసారిగా ‘[[రామాయణం]]’ లఘుచిత్రాన్ని నిర్మించాడు. ఇతడు మంచి చిత్రకారుడు కూడా. 1949లో ఇతడు [[హైదరాబాదు]] [[కుద్బీగూడ]]లో పద్మశాలి ప్రింటింగ్ ప్రెస్‌ను స్థాపించాడు. ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకునిగా కూడా కొంతకాలం పనిచేశాడు. ఇతని రచనలు [[సుజాత (పత్రిక)|సుజాత]], [[తెలుగు స్వతంత్ర]], [[ఆంధ్రప్రభ]], [[ఆంధ్రపత్రిక]], [[ఉదయిని]], [[ఆనందవాణి]] తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి.
"https://te.wikipedia.org/wiki/గిడుతూరి_సూర్యం" నుండి వెలికితీశారు