తూర్పు చాళుక్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చరిత్ర చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 33:
 
==మతాలు - వాటి ఆదరణ==
[[శాతవాహనులు|శాతవాహనుల]] కాలంలో ప్రబలంగా ఉన్న [[బౌద్ధ మతం]] చాళుక్యుల కాలానికి క్షీణించింది. బౌద్ధాశ్రమాలు నిర్మానుష్యంగా ఉండేవి. బౌద్ధ స్థూపాల వద్ద నివాసం ఏర్పాటు చేసుకొన్నవారు ఆ స్థూపాలను అంటిపెట్టుకొని ఉండేవారు. అప్పటి చైనా రాయబారి [[హుయాన్ త్సాంగ్]] అందించిన ఆధారాల ప్రకారం 20 బౌద్ధాశ్రమాలు, ప్రతి ఆశ్రమంలోను 3000 బౌద్ధ సన్యాసులు నివసించేవారు. బౌద్ధ మతం క్షీణించినా [[జైనమతం]] ప్రజల ఆదరణ కలిగి ఉంది. ఈ విషయం ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామాలలో శిథిలమైన విగ్రహాలు చూస్తే తెలుస్తుంది. తూర్పుచాళుక్య రాజులు జైన దేవాలయాలకు నిధులు, విరాళాలు ఇచ్చేవారని శిలాశాసనాల ఆధారంగా తెలుస్తున్నది. కుబ్జ విష్ణువర్థనుడు, మూడవ విష్ణువర్థనుడు, రెండవ అమ్మ జైన మతాన్ని ఆదరించారని తెలుస్తోంది. విమలాదిత్యుడు, మహావీరుని నియమాలను పాటించాడని తెలుస్తోంది. అప్పట్లో [[విజయవాడ]], జెనుపాడు, [[పెనుగొండ]], మునుగొండ ప్రసిద్ధ జైన క్షేత్రాలు. హిందూ మతం చాళుక్యుల పరిపాలన కాలంలో రాజ్య మతం. హిందూ మతంలోని రెండు విభాగాలలో [[వైష్ణవులు|వైష్ణవం]] కంటే [[శైవం]]కు ఆదరణ ఎక్కువగా ఉండేది. కొంతమంది రాజులు తమను తామే చక్రవర్తులుగా ప్రకటించుకొన్నారు. బౌద్ధ క్షేత్రాలు వీరి కాలంలో శైవ క్షేత్రాలుగా పరిణతి చెందాయి. తూర్పు చాళుక్య రాజులైన రెండవ విజయాదిత్యుడు, మెదటి యుద్ధమల్ల, మూడవ విజయాదిత్యుడు, మెదటి భీముడు శివాలయాలు నిర్మించడం మీద ఆసక్తి చూపారు. దేవాలయాలు దైవారాధనకే కాక [[నృత్యం]], [[సంగీతం]], మొదలైన కళలకు వేదికగా ఉండేవి.
 
==సాహిత్యం==
"https://te.wikipedia.org/wiki/తూర్పు_చాళుక్యులు" నుండి వెలికితీశారు