అసెంబ్లీ రౌడీ: కూర్పుల మధ్య తేడాలు

కథ
పంక్తి 9:
starring = [[మోహన్ బాబు ]],<br>[[దివ్య భారతి]]|
}}
'''అసెంబ్లీ రౌడీ''' 1991 లో [[బగ్గిడి గోపాల్|బి. గోపాల్]] దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]], [[దివ్యభారతి]] ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మంచి ప్రజాదరణ పొంది మోహన్ బాబుకు ''కలెక్షిన్ కింగ్'' అనే బిరుదును సాధించి పెట్టింది.
 
== కథ ==
శివాజీ (మోహన్ బాబు) డిగ్రీ పూర్తి చేసుకుని అల్లరి చిల్లరగా తిరిగే యువకుడు. అతని తండ్రి (జగ్గయ్య) అదే ఊర్లో ఒక ఉపాధ్యాయుడు. ఆయనకు కొడుకు అలా ఊరికే ఉండటం నచ్చదు. పూజ (దివ్యభారతి) అదే ఊర్లో పనిచేసే మరో ఉపాధ్యాయుడి (గొల్లపూడి మారుతీ రావు) కూతురు. శివాజీ ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు.
 
ఊర్లో దాదాగిరీ చెలాయించే బాషా అనే రౌడీ ఒక హత్య చేస్తుండగా శివాజీ చూస్తాడు. ఆ గొడవలో తన తల్లి తలకు గాయం అవుతుంది. దాంతో శివాజీ అతనికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబుతాడు. బాషా శివాజీ మీద కక్షతో అతన్ని ఓ నేరం మీద జైలుకి పంపిస్తాడు. శివాజీ తల్లిదండ్రులు అతన్ని కేసునుంచి బయట పడేయటానికి ఊర్లో వాళ్ళనెవరైనా సాక్ష్యం చెప్పమని అడుగుతారు. కానీ బాషాకు భయపడి ఎవరూ ముందుకు రారు. శివాజీ జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఇంతలోనే ఎన్నికలు వస్తాయి. ఒక లాయరు ఎన్నికల్లో గెలవడం ద్వారా శివాజీ ప్రజల సాక్ష్యం కోరవచ్చునని సలహా ఇస్తాడు. శివాజీని జైల్లో నుంచే ఎమ్మెల్యే పదవికి పోటీకి నిలబెట్టి అతని తల్లిదండ్రులు అతని తరపున ప్రచారం చేస్తారు. ఆ ఎన్నికల్లో శివాజీ గెలిచి ఎమ్మెల్యే అవుతాడు. అది భరించలేని బాషా అతని తల్లిదండ్రులని చంపేస్తాడు. శివాజీ ఆ రౌడీలను మట్టుబెట్టి కత్తిపోట్లతో తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చేరతాడు. చివర్లో అతను కోలుకుని ప్రజలందరికీ అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో కథ ముగుస్తుంది.
 
== తారాగణం ==
* శివాజీ గా [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]]
* పూజ గా [[దివ్యభారతి]]
* శివాజీ తండ్రి గా [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]]
* శివాజీ తల్లి గా [[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]
* పూజ తండ్రి గా [[గొల్లపూడి మారుతీరావు]]
* [[కైకాల సత్యనారాయణ]]
* [[ప్రసాద్ బాబు]]
* [[మోహన్ రాజ్]]
* శివాజీ మేనమామగా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[పాకీజా]]
* [[మాడా వెంకటేశ్వరరావు|మాడా వెంకటేశ్వర రావు]]
* [[అనంత్]]
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/అసెంబ్లీ_రౌడీ" నుండి వెలికితీశారు