ఆదిత్య 369: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
imdb_id=
}}
'''ఆదిత్య 369''', 1991లో విడుదలైన [[తెలుగు సినిమా]].<ref name="పాతికేళ్ల ‘ఆదిత్య 369’">{{cite web|title=పాతికేళ్ల ‘ఆదిత్య 369’|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=267578|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=16 October 2017}}</ref> [[బాక్ టు ఫ్యూచర్]] అనే ఆంగ్ల చిత్రం, ఇంకా హెచ్.జి.వెల్స్ [[టైం మెషీన్]] నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రం. సైన్స్‌ఫిక్షన్‌ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్‌ను జోడించి తీసిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఒక ముఖ్యమైన గుర్తింపును పొందింది.
==చిత్రకథ==
కృష్ణ మోహన్ ([[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]]) కు టి.వి.లు తయారు చేసే కంపెనీ ఉంది. అతను హేమ (మోహిని) ను ప్రేమిస్తాడు. హేమ తండ్రి ప్రొఫెసర్ రామదాస్ (టిన్నూ ఆనంద్) ఒక [[శాస్త్రవేత్త|సైంటిస్టు]]. అతను కాలయంత్రాన్ని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. రాజావర్మ (అమ్రిష్ పురి) అనే స్మగ్లర్‌కు పురాతన వస్తువులు సేకరించడం హాబీ. అందుకు అవరమైతే ఎంతటి నేరాన్నైనా చేయగలడు. వయొలిన్ ను వయలెన్స్ ను సమంగా ప్రేమిస్తాడు. [[సాలార్ జంగ్ మ్యూజియం]]లో విలువైన పురాతన వస్తువుకోసం మనుషుల్ని పంపుతాడు. వారిని మ్యూజియం చూడటానికి వచ్చి అక్కడ తప్పిపోయిన ఓ కుర్రాడు ([[మాస్టర్ తరుణ్]]) చూస్తాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతన్ని కృష్ణమోహన్ కాపాడతాడు.
పంక్తి 25:
 
ఈ సినిమాలో భూతకాలం, భవిష్యత్కాలం, వర్తమానకాలం - ఈ మూడింటిలోనూ కనిపించేది ఒక వజ్రం.
 
== నిర్మాణం, అభివృద్ధి ==
ప్రముఖ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఒకసారి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తో మాట్లాడుతూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గరున్న టైం ట్రావెల్ (కాలంలో ప్రయాణం) గురించిన కథ చెప్పాడు. అది విన్న కృష్ణప్రసాద్ వెంటనే ఆయనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కృష్ణదేవరాయల కాలం అనగానే ఆయనకు కథానాయకుడు బాలకృష్ణ గుర్తొచ్చాడు. బాలకృష్ణకు వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఆయన కూడా ఇందులో నటించడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమా చిత్రీకరణకు 110 రోజులు పట్టింది. మొదట్లో ఈ సినిమాకు పి. సి. శ్రీరాం ఛాయాగ్రాహకుడు. ఆయనకు అత్యవసరంగా శస్త్రచికిత్స జరపవలసి రావడంతో ఆయన బాధ్యతను వి. ఎస్. ఆర్. స్వామి, కబీల్ లాల్ కి అప్పగించారు.
 
మొదట్లో సుమారు 1 కోటి 30 లక్షలు అవుతుందనుకున్న బడ్జెట్ తర్వాత మరో 30 లక్షలు అదనంగా అయింది. చిత్రీకరణలో వేసిన సెట్లు, వాటికి కలిగిన ఆదరణ చూసి డిస్ట్రిబ్యూటర్లు ఈ అదనపు సొమ్మును వెచ్చించడానికి ముందుకు వచ్చారు. దీంతో సినిమాకు కోటి 52 లక్షలు ఖర్చు అయింది. మొదట్లో ఈ సినిమాకు యుగపురుషుడు, ఆదిత్యుడు అనే పేర్లు అనుకున్నారు. తర్వాత ఆదిత్య అని పేరు పెట్టి టైం ట్రావెలింగ్ కాబట్టి 369 అనే ఆరోహణా క్రమంలోని అంకెలు చేర్చారు. జులై 18, 1991 న విడుదలైన ఈ చిత్రం మంచి ప్రజాదరణకు నోచుకుంది.<ref name="పాతికేళ్ల ‘ఆదిత్య 369’"/>
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/ఆదిత్య_369" నుండి వెలికితీశారు