బొబ్బట్టు: కూర్పుల మధ్య తేడాలు

చి బొబ్బట్లు ను, బొబ్బట్టు కు తరలించాం: ఏకవచన పదం సరయినది.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
బొబ్బట్లు తెలుగువారు పండగలలో చేసుకునే ఒక తీపి పిండివంట. పూజలలో కూడా అంటే వరలక్ష్మీ వ్రతం మెదలయిన పూజలలో కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి.
==తయారుచేయు విధానం==
చేసే విధానం: మైదాపిండిని కొద్దిగా నూని, ఉప్పూ వేసి, నీళ్ళు పోసి చపాతీ పిండిలాగ కలుపుకొని, మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. శనగపప్పును ఎక్కువగా కాకుండా తగినంత మాత్రమే అంటే సరిగ్గా ఉడకడానికి సరిపోయినంత నీరుపోసి కుక్కరులో ఉడికించాలి. దానిలో పంచదార వేసి గ్రైండు చేయాలి. దీనిలో ఏలకుపొడి కూడా వేస్తారు. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదాపిండి నుండి చిన్న ఉండను తీసుకొని. చేతికి నూని రాసుకొని, మైదాపిండి ఉండను అరచేతిలో ఉంచుకొని కొద్దిగా చేతితోనే రొట్టిలా సాగదీసి, అందులో శనగపప్పు-పంచదార ముద్దను పెట్టి పూర్తిగా మూసివేయాలి. ఎక్కడా లోపల ఉన్న ముద్ద కనబడకుండా జాగ్రత్తగా మూయాలి. ఇప్పుడు అరటి ఆకుమీదకానీ, లేకపోతే పాలకవరుమీదకానీ, ఏదైనా దళసరి కవరుమీదైనా సరే, నూని రాసి, ఈ తయారుచేసుకున్న ఉండను చేతితోనే గుండ్రంగా వచ్చేలా రొట్టెలాగ కొంచెం లావుగానే వత్తుకోవాలి. లోపలపెట్టిన తీపి పదార్ధం బయటకు రాకుండా వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అది వేడెక్కాక, కొద్దిగానూని రాసి, ఆకుమీద తయారుచేసుకున్న రొట్టెను, అలాగే ఆకుతోనే తీసి పెనంమీద రొట్టె పడేటట్లు, పైవైపుకు ఆకు వచ్చే టట్లు వేసి, మెల్లగా ఆకును తీసివేయాలి. రొట్టెకు చుట్టూ నూనికాని, నెయ్యిగానీ వేస్తూ, చపాతీలాగానే తిరగవేస్తూ, సన్నపు మంటమీద రెండు ప్రక్కలా ఎర్రగా కాల్చాలి. దీనిని నెయ్యిరాసుకుని, వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
*మైదాపిండిని కొద్దిగా నూని, ఉప్పూ వేసి, నీళ్ళు పోసి చపాతీ పిండిలాగ కలుపుకొని, మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి.
[[వర్గం:వంటలు]]
*శనగపప్పును ఎక్కువగా కాకుండా తగినంత మాత్రమే అంటే సరిగ్గా ఉడకడానికి సరిపోయినంత నీరుపోసి కుక్కరులో ఉడికించాలి. దానిలో పంచదార వేసి గ్రైండు చేయాలి. దీనిలో ఏలకుపొడి కూడా వేస్తారు. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి.
*ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదాపిండి నుండి చిన్న ఉండను తీసుకొని. చేతికి నూని రాసుకొని, మైదాపిండి ఉండను అరచేతిలో ఉంచుకొని కొద్దిగా చేతితోనే రొట్టిలా సాగదీసి, అందులో శనగపప్పు-పంచదార ముద్దను పెట్టి పూర్తిగా మూసివేయాలి. ఎక్కడా లోపల ఉన్న ముద్ద కనబడకుండా జాగ్రత్తగా మూయాలి.
*ఇప్పుడు అరటి ఆకుమీదకానీ, లేకపోతే పాలకవరుమీదకానీ, ఏదైనా దళసరి కవరుమీదైనా సరే, నూని రాసి, ఈ తయారుచేసుకున్న ఉండను చేతితోనే గుండ్రంగా వచ్చేలా రొట్టెలాగ కొంచెం లావుగానే వత్తుకోవాలి. లోపలపెట్టిన తీపి పదార్ధం బయటకు రాకుండా వత్తుకోవాలి.
*ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అది వేడెక్కాక, కొద్దిగానూని రాసి, ఆకుమీద తయారుచేసుకున్న రొట్టెను, అలాగే ఆకుతోనే తీసి పెనంమీద రొట్టె పడేటట్లు, పైవైపుకు ఆకు వచ్చేటట్లు వేసి, మెల్లగా ఆకును తీసివేయాలి.
*రొట్టెకు చుట్టూ నూనికాని, నెయ్యిగానీ వేస్తూ, చపాతీలాగానే తిరగవేస్తూ, సన్నపు మంటమీద రెండు ప్రక్కలా ఎర్రగా కాల్చాలి.
*ఈ బొబ్బట్లను నెయ్యిరాసుకుని, వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
 
[[వర్గం:పిండి వంటలు]]
"https://te.wikipedia.org/wiki/బొబ్బట్టు" నుండి వెలికితీశారు