స్వాతి కిరణం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కె. విశ్వనాధ్ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎చిత్రవిశేషాలు: వ్యక్తిగత అభిప్రాయాలు తొలగింపు
పంక్తి 23:
అనంత రామశర్మను పక్షితీర్ధం మామ్మగారి ఇంటి దగ్గర దించిన తరువాత అతనికి స్వస్థత చేకూరుతుంది. కోలుకున్న అనంత రామశర్మ భార్య గంగాధరం పేరు మీద సంగీత అకాడమీ స్థాపిస్తుంది. భార్య సంగీతం నేర్పుతూ ఉంటే తరగతిలో శిష్యులలో కూర్చొంటాడు అనంత రామశర్మ. పాఠాన్ని సాధన చేస్తూ ఉన్న అనంత రామశర్మను శృతి సరి చేసుకోమంటుంది సంగీతం నేర్చుకుంటున్న బాలిక. దానితో సినిమా ముగుస్తుంది.
 
== చిత్రవిశేషాలు ==
ఏ విధంగా చూసినా ఇది చాలా గొప్ప సినిమా..తెలుగు సినిమా లలోనే కాదు యావత్తూ సినిమాలను ఎంతగా కాచి వడపోసి ఆణిముత్యాలని ఏ కొద్ది పాటి సినిమాలను ఏరినా ఈ సినిమాకు స్ధానం దక్కాలి..ఏదో దురభిమానంతోనో లేదా ఇతర సంకుచితిత్వంతోనో చెప్పడం కాదు. కథాంశం, పాత్రల రూపకల్పన, నటీనటుల అద్వీతయ నటన, మధురాతి మధురమైన పాటలు అన్నీ అంత గొప్పగా సమకూరేయి.. అనంత రామశర్మగా ముమ్ముటి, అతని భార్యగా రాధిక, గంగాధరంగా మాస్టర్ మంజునాధ్ పాత్రలలో ఇమిడి పోయేరు.. పక్షితీర్ధం మామ్మగారిగా జయంతి, గంగాధరం తండ్రిగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తల్లిగా జానకి, పక్షితీర్ధ మామ్మగారి మేనల్లుడిగా అచ్యుత్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.. ఆనతి నీయరా హరా పాటకు రాధిక, మమ్ముటి ఆహబావాలు చెప్పనలవి కావు.. అనంత రామశర్మను శివునిగా, అతని భార్యను పార్వతిగా, గంగాధరాన్ని బాలగణపతిగా పోల్చి రూపకాలంకారంతో జాలిగా జాబిలమ్మ పాట రచించిన తీరు, స్వరకల్పన, చిత్రీకరణ, నటీనటుల నటన అన్నీ అద్వీతయం.
కె.వి.మహదేవన్ స్వర రచన మహోన్నతం.. ఆనతి నీయరా పాటకు వాణీ జయరాంకు జాతీయ స్ధాయిలో ఉత్తమ గాయనిగా ఎన్నికైంది..ఇంత గొప్ప చిత్రానికికళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకులు, కథా రచయిత.. ఆయన కీర్తికిరీటంలో ఈ సినిమా కలికితురాయి..మరొక విశేషం ఈ చిత్రంలో గణపతి సచ్చిదానందస్వామి దర్శనమిస్తారు.<br />
== యాంటీ సెంటిమెంట్ ==
బలమైన పతాక సన్నివేశం కోసం కథ ముగింపు ఈ విధంగా చేసి ఉంటారు కానీ, గంగాధరం మరణం ప్రేకక్షులకు ఏ మాత్రం నచ్చలేదు..యాంటీ సెంటిమెంటయ్యింది..దానితో ప్రజాదరణ పొందలేదు.. చిత్రంలో కనిపించే గణపతి సచ్చిదానాంద స్వామి ద్వారా అనంత రామశర్మలో పరివర్తన తీసుకు వచ్చినట్లు కథ మార్చి ఉంటే ప్రజల ఆమోదం పొంది ఉండేదా.. ఏమో..
"https://te.wikipedia.org/wiki/స్వాతి_కిరణం" నుండి వెలికితీశారు