మాడపాటి హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''మాడపాటి హనుమంతరావు''' ([[జనవరి 22]], [[1885]] - [[నవంబరు 11]], [[1970]]) ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు రచయిత. హనుమంతరావు 20వ శతాబ్ది తొలిదశకంలో [[హైదరాబాద్ రాష్ట్రం|హైదరాబాద్]] రాజ్యంలోని [[తెలుగు]] ప్రాంతాల్లో (నేటి తెలంగాణ) ఆంధ్రోద్యమం వ్యాప్తిచేసేందుకు కృషిచేశారు. ఆయన చేసిన కృషికి గాను ఆంధ్ర పితామహుడు అన్న పేరును పొందారు. న్యాయవాద వృత్తిని చేపట్టిన మాడపాటి విజయవంతమైన లాయరుగా పేరుపొందారు. తీరిక సమయాలన్నిటా ఆంధ్రోద్యమానికి, తెలంగాణాలో గ్రంథాలయాల అభివృద్ధికి కేటాయించేవారు. ఆంధ్రజనసంఘం, [[ఆంధ్రమహాసభ]] వంటి ప్రజాసంఘాల స్థాపనలోనూ, వాటి నిర్వహణలోనూ కీలకపాత్ర వహించారు. తర్వాతి తరం ప్రజానాయకులు వీరిని మితవాదిగా గుర్తించారు. అయితే [[నైజాం]] ప్రాంతంలో తర్వాతి తరం రాజకీయ నాయకత్వం ఏర్పడడానికి పునాదిగా వీరు చేసిన కృషి సార్థకమైనది. ఆయన ప్రజాహితరంగంలో, సాంస్కృతిక చైతన్యం కలిగించడంలో ఎంతో కృషిచేసినా చాలా కాలం వరకూ క్రియాశీలకమైన రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. 1952లో శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయరు పదివిని అధిష్టించారు.
 
==వ్యక్తిగత జీవితం==
పంక్తి 50:
 
=== గ్రంథాలయోద్యమం ===
ఆయన గ్రంథాలయోద్యమంలోనూ చెప్పుకోదగ్గ కృషి సాగించారు. ఈ క్రమంలో ఆయన తనకు సన్మానం ద్వారా లభించిన సొమ్మును కూడా గ్రంథాలయాల అభివృద్ధికే అందజేశారు. హైదరాబాద్‌లోని [[శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం]], [[హన్మకొండ]]<nowiki/>లోని రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం కూడా ఆయన అభివృద్ధి చేసినవే. వీటిలో [[శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం]] నిజాం పాలిత తెలుగు ప్రాంతంలోని తొలి తెలుగు గ్రంథాలయంగా చారిత్రిక ప్రశస్తి పొందింది. గ్రంథాలయాల ద్వారానే చైతన్యాన్ని వ్యాప్తిచేయాలన్న దృక్పథంతో సాగిన ఆయన ప్రయత్నం సత్ఫలితాలనిచ్చింది.
 
=== విద్యారంగం ===
"https://te.wikipedia.org/wiki/మాడపాటి_హనుమంతరావు" నుండి వెలికితీశారు