35,867
edits
Arjunaraoc (చర్చ | రచనలు) చి |
Arjunaraoc (చర్చ | రచనలు) చి |
||
'''ప్రాణాయామం''' (Pranayama) అంటే ప్రాణశక్తిని విసరింపజేసి అదుపులో ఉంచడం. ప్రాణాయామం [[మనస్సు]]ను ఏకాగ్రం చేయడానికి, శరీరాంతర్గత నాడీ శుద్ధికి తోడ్పడుతుంది. [[పతంజలి]] మహర్షి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను అదుపులో ఉంచడం ప్రాణాయామమని నిర్వచించారు.
[[File:Tanumânasî kapalabhati.JPG|thumb|300px|right|{{center|ప్రాణాయామం సాధకుడు}}]]
ప్రాణాయామము ముఖ్యముగా త్రివిధములు. 1. కనిష్ఠ ప్రాణాయామము 2. మధ్యమ ప్రాణాయామము. 3. ఉత్తమ ప్రాణాయామము. సాధకులు ప్రథమములో ఉదయం నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని సుఖాసీనులై ఎడమ ముక్కుతో గాలిని నెమ్మదిగా పీల్చి రెండు ముక్కులను బంధించి, కుంభించి, పిమ్మట కుడి ముక్కుతో నెమ్మదిగా వదులుట ఒకటవ ఆవృతము తిరిగి కుడి ముక్కుతో నెమ్మదిగా బాగా గాలిని పీల్చి, కుంభించి, ఎడమ ముక్కుతో చాల నెమ్మదిగా వదిలివేయుట రెండవ ఆవృతము. ఇట్లు ఆరు ఆవృతములతో ఆరంభించి (అనగా ఒక మాత్ర) క్రమముగ పెంచుచు పూటకు 12 ఆవృతములు (రెండు మాత్రలు) చొప్పున మూడు పూటలా 3*12 = 36 ఆవృతములు చేయుట కనిష్ఠ [[ప్రాణాయామము]]. 72 ఆవృతములు చేయుట మధ్యమ ప్రాణాయామము. 108 ఆవృతములు చేయుట ఉత్తమ ప్రాణాయామము.
|