వికీపీడియా:రచ్చబండ (పాలసీలు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 131:
* చర్చల్లో జేవీఆర్కే ప్రసాద్ గారిని గారు అనడం నా ఇష్టం ఎందుకు అంటే ఇది వ్యక్తిగతమైన పాఠ్యం కనుక. కింద నా సంతకం ఉంటుది కనుక. అలా వ్యాసాల్లో సంతకాలు ఉండవు, ఉండరాదు. ఉదాహరణకు చర్చల్లో [[వాడుకరి:pranayraj1985]]ని ప్రణయ్ రాజ్ గారు అని పిలిస్తే పవన్ సంతోష్ అనే వ్యక్తి [[వాడుకరి:pranayraj1985]] పట్ల చూపించే గౌరవం అని అర్థం అవుతుంది, అదే [[ప్రణయ్‌రాజ్ వంగరి]] అన్న వ్యాసంలో గౌరవవాచకాలు నేను పెట్టాననుకోండి, అప్పుడు వికీపీడియా గౌరవం చూపినట్లు అవుతుంది. కాబట్టి కనీస గౌరవం తప్ప ప్రత్యేక గౌరవం కానీ, ప్రత్యేక అగౌరవం కానీ ఎవరికీ వికీపీడియా చేయకూడదు, వికీపీడియన్లు వారి వారి వ్యక్తిగత స్థాయిలో చేయవచ్చు.
మీరు అడిగిన ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు ఇవి, ధన్యవాదాలు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:06, 15 మే 2018 (UTC)
:::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు, మీరు వికీపీడియనులు వ్యాసాలు ఒకసారి చదవండి, వ్యాసాలు ఎలా వ్రాసారో మీకు తెలుస్తుంది. ఉదా: డా.రాజశేఖర్ గారి వ్యాసం ఎలా వ్రాసారో అలాగే వ్రాస్తే బాగానే ఉంటుంది కదా ! అన్ని వ్యాసాలు ఒకే రీతిగా ఉండాలా లేక వ్యక్తులును బట్టి ఉండాలో కూడా ఒక సందేహం వాడుకరులకు కూడా ప్రశ్న ఉదయిస్తుంది. అందరి గురించి, అన్ని వ్యాసాలు ఒకే రీతిగా, తీరులో వ్రాయాలనే పాలసీ నా మనసుకు అంతగా ఒప్పటము లేదు. మీ స్పందనలకు సంతోషం, నాకు ఎవరితోనూ సమస్యలు లేవు, పెట్టుకోను. ఇక్కడ నిర్ణయాలు అన్నీ అమలు పరిచేది కేవలం కొద్దిమంది మాత్రమే. వారి పాలసీలు తప్ప మరొకరివి అమలు జరగవు. దేనికైన కొత్తవాటికి అయినా వారి అభిప్రాయాలు తీసుకుని అమలు చేసుకుంటే చాలా తేలిక. మిగతావారి అభిప్రాయాలు లెక్కకోసం, భంగపడటం కోసం మాత్రమే. ఇది సత్యం. మీ స్పందనలకు ధన్యవాదములు.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 05:16, 15 మే 2018 (UTC)