ఏకవీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ముక్కామల నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 23:
== నిర్మాణం ==
=== మూలకథ నేపథ్యం ===
ఈ సినిమాకు మూలకథ అందించిన [[ఏకవీర]] తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కారం పొందిన రచయిత [[విశ్వనాథ సత్యనారాయణ]] రాసిన నవల. నవల విశ్వనాథ సత్యనారాయణ రచనాజీవితంలోకెల్లా విశిష్టమైన రచనల్లో ఒకటిగా నిలిచింది. విమర్శకుల నుంచి ప్రశంసలతో పాటుగా నవల విస్తృతంగా పాఠకాదరణ పొందింది. ఆయన రచించిన వందకు మించిన రచనల్లో విశ్వనాథ సత్యనారాయణే స్వయంగా ''నా ఏకవీర, [[వేయిపడగలు]] కళాత్మకమైనవి. సంపూర్ణమైన రచనలని నేను భావిస్తాను'' అన్నారు.<ref name="విశ్వనాథ ఒక కల్పవృక్షం">{{cite book|last1=పురాణం|first1=సుబ్రహ్మణ్యశర్మ|title=విశ్వనాథ ఒక కల్పవృక్షం|date=2005|publisher=పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాద్|pages=235, 236|edition=1}}</ref> నవల పలుమార్లు పునర్ముద్రణలు చెందడంతోపాటుగా విద్యాప్రణాళికల్లో పాఠ్యాంశంగా కూడా నిర్దేశింపబడింది. దీన్ని మలయాళంలోకి అనువదించి ప్రచురించారు. ఈ నవల గురించి పలువురు సాహిత్యవేత్తలు అనేకవిధాలుగా మెచ్చుకున్నారు. పోరంకి దక్షిణామూర్తి ఈ నవలను రసవత్తరమైన కావ్యమని మెచ్చుకోగా, మధురాంతకం రాజారాం దీనిలోని కథాకథనకౌశలాన్నెంతగానో ప్రశంసించారు.<ref name="పోరంకి తెలుగు నవల">{{cite book|last1=పోరంకి|first1=దక్షిణామూర్తి|title=తెలుగు నవల|date=1975|publisher=ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ|page=19|edition=1}}</ref><ref name="మధురాంతకం విశ్వనాథ భారతి">{{cite book|last1=మధురాంతకం|first1=రాజారాం|title=విశ్వనాథభారతి|date=2002|publisher=పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాద్|page=154}}</ref> అటువంటి నవలను సినిమాకు మూలకథాంశంగా స్వీకరించారు.
 
=== స్క్రిప్ట్ అభివృద్ధి ===
"https://te.wikipedia.org/wiki/ఏకవీర_(సినిమా)" నుండి వెలికితీశారు