శివాజీ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శివాజీ''' తెలుగు సినిమా రంగానికి చెందిన ఒక నటుడు. ఆయన స్వస్థలం [[గుంటూరు జిల్లా]], [[గొరిజవోలు]] అనే ఒక కుగ్రామం. మొదట బుల్లితెరపై యాంకర్ గా పనిచేశాడు. తరువాత చిన్న పాత్రల ద్వారా పరిశ్రమ లోకి వచ్చిన శివాజీ తరువాత హీరోగా నిలదొక్కుకున్నాడు. మొదట్లో ఏదైనా చిన్న ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిద్దామని హైదరాబాద్ కి వచ్చాడు. అప్పుడే కొత్తగా ప్రారంభమైన [[జెమినీ టీవీ]]లో వీడియో ఎడిటర్ గా చేరాడు. కొన్ని విచిత్రమైన పరిస్థితుల మధ్య అక్కడే యాంకర్ గా మారాడు.
 
[[కె. రాఘవేంద్ర రావు]] 2000 సంవత్సరంలో తను చేయబోయే కొత్త సినిమా [[పరదేశి (1998 సినిమా)|పరదేశి]] అనే సినిమా కోసం నూతన నటీనటుల కోసం ''స్టార్ 2000 కాంటెస్ట్'' అనే ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అందులో [[లయ]], శివాజీ రెండో స్థానంలో నిలిచారు. విచిత్రమేమిటంటే మొదటి స్థానంలో నిలిచిన వారు పరదేశి సినిమాలో కనిపించిన తరువాత మరే సినిమాలలోనూ కనిపించలేదు. కానీ ఆ షో వల్ల శివాజీ గురించి పదిమందికి తెలిసింది. దాంతో నెమ్మదిగా సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.
"https://te.wikipedia.org/wiki/శివాజీ_(నటుడు)" నుండి వెలికితీశారు