కోటప్ప కొండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 69:
 
=='''ప్రభల ఉత్సవ సంబరాలు'''==
[[దస్త్రం:Prabha 26.jpg|thumb|శివరాత్రికి కోటప్పకొండ ప్రభలు]]మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా సాగుతోంది. జంగమయ్య చిత్రాలతో చిన్న ప్రభల నుంచి భారీ ఎత్తున ప్రభలను ఊరేగింపుగా తీసుకువస్తారు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు వైభవంగా జరుగుతాయి. తిరునాళ్ళ సందర్భంగా ఏర్పాటయ్యే ఎత్తయిన ప్రభలు చాలా ప్రసిద్ధిని పొందాయి. కార్తీకమాసంలోనే ఈ దేవాలయంలో కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతూ వుంటాయి. కోటప్ప కొండ అనగానే శివరాత్రి ప్రభల సంబరమే గుర్తుకొస్తుంది. కోటప్ప కొండ త్రికూటేశ్వరునికి సంబంధించి ప్రభల సంభరం అత్యంత ప్రసిద్ధిగాంచిన ఓ ఉత్సవం. ఈ ఉత్సవంలో భాగంగా చిన్న పిల్లలు చిన్న చిన్న ప్రభలు, అలానే పెద్దలు దాదాపు 100 అడుగులకు పైగా ఎత్తుండే చక్కగా అలంకరించబడ్డ ప్రభలను చుట్టుపక్కల గ్రామాల వారు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్మించి, శివుడికి కానుకగా సమర్పిస్తారు. వీటిని త్రికూట పర్వతం ముందు నిలిపి ఉంచుతారు. వీటిని ట్రాక్టర్లలో, బండ్లలో డప్పులు, బ్యాండు, రికార్డింగ్ డ్యాన్సులతోనూ, పగటి వేషాల వంటి పలు కార్యక్రమముల తోనూ తీసుకొస్తారు. ఒక్కొక్క ప్రభను ఒక్కొక్క రకంగా అలంకరించి కొండ క్రింద పొలాల్లో ఉంచుతారు. ఇవి పెద్దవే వందల సంఖ్యలో ఉంటాయి. చిన్నవయితే లక్షల సంఖ్యలో కనుపిస్తూ, కొండ పైభాగమునుండి చూసేవారికి సముద్రంలో తెరచాపల్లా కనువిందు చేస్తూఉంటాయి. గతంలో ఎడ్లబండ్లలో తీసుకువచ్చేవారు. ప్రస్తుతం ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మేడారం తరువాత రెండో అతిపెద్ద జన జాతర శివరాత్రి రోజున కోటప్పకొండలోనే జరుగుతుంది. విభజన తర్వాత కోటప్పకొండ తిరునాళ్లకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది. ఈ తిరునాళ్లలో విద్యుత్ ప్రభలే ప్రధాన ఆకర్షణ.
 
ప్రభల బండ్లకు కావలసిన ఎడ్లను ఎంతో ముద్దుగా పెంచుతారు. అందు కోసం వాటికి మంచి తిండి తయారుచేస్తారు. బిడ్డలను సాకినట్లు సాకుతారు. వాటికి మెడలో మువ్వల పట్టెడ, గంటల పట్టెడ, మూతికి అందమైన శికమార్లు, నడుంకు తోలు బెల్టు, ముఖానికి వ్రేలాడే కుచ్చులు, కొమ్ములకు రంగులు, కాళ్ళకు గజ్జెలు, వీపుమీద రంగు రంగుల గుడ్డలు అలంకరిస్తారు. ప్రభలు బయలుదేరి వస్తూవుంటే ఈ ఎడ్ల సౌందర్యాన్ని చూడడానికి జనం మూగుతారు. ప్రభలు వారి వారి శక్తి కొలది పెద్ద పెద్ద ప్రభలను తీసుకు వస్తారు. ఆ ప్రభలను రంగు రంగుల గుడ్డలతో, రంగుల కాగితాలతో, ఫోటోలతో అలంకరిస్తారు. శక్తి కలవారు జనరేటర్ పెట్టి ప్రభలకు ఎలెక్ట్రిక్ బల్బులను అమర్చుతారు.
;శరభ శరభ
 
శైవులు, వీర శైవులు పలు సందర్భాలలో దక్షయజ్ఞ దండకం చదివినట్లె ఇక్కడా చదువుతారు. ఇలా చదివేటప్పుడు ఖడ్గదారులు ప్రభ ముందు నిలబడి వెనకకూ ముందుకు నడుస్తూ ఎగిరెగిరి గంతులు వేస్తూ పరవళ్ళు త్రొక్కుతూ వుంటే పక్క నున్న వాళ్ళు బుంజ వాయిద్యాన్ని తప్పెట వాయిద్యాన్ని వాయిస్తూ, కొమ్ము బూరలనూ, కాహశాలనూ ఊది దండకం చదువరిని వుత్తేజ పరుస్తారు.
అలంకార శోభితమైన ఈ ప్రభలు వూరేగింపుగా బయలుదేరితే, మ్రొక్కుబడులున్న వారు భక్తి శ్రద్ధలతో ప్రభ ముందు నడుస్తారు. ప్రభ ముందు తప్పెట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ వుంటే వాయిద్యానికి తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు ఠీవిగా నడుస్తూ వుంటే, అలంకరించిన మువ్వల, గజ్జల, గంతల మ్రోతలు తాళానికి అనుగుణంగా మ్రోగినట్లుంటుంది. ఉత్సాహంతో ఠీవిగా నడిచే ఎద్దులు అప్పుడప్పుడు రంకెలు వేస్తూ వుంటే , సంగీత శాస్త్రంలో ఎద్దు వేసే రంకెను, సప్త స్వరాలలో రెండవది అయిన (రిషభం) అని నిర్ణయించారని కీ॥శే॥ డా. కే.యన్. కేసరి గారు వారి చిన్ననాటి ముచ్చట్ల గ్రంధంలో ఉదహరించారు. రిషభ స్వరం ద్వారా వీర రసం, అద్భుత రసం, రౌద్ర రసం వెలువడతాయని వివరించారు.
 
కోడె గిత్తలతో నడుప బడే ఈ ప్రభలను నడిపే వారు యుక్త వయస్సులో వున్న యువకులు, చెర్నాకోలను చేతిలో ధరించి తలకు మంచి తలపాగాను అందంగా చుట్టి ఆహ హై చోచో అంటూ ఎడ్లను అదిలిస్తూ కోర మీసం దువ్వుతూ చలాకీగా ఎడ్లను తోలుతూ వుంటే పౌరుషంతో కోడె గిత్తలు ముందుకు సాగిపోతాయి. ఇలా బయలు దేరిన ప్రభల బండ్లు ఆయా గ్రామలగుండా ప్రయాణించేటప్పుడు గ్రామస్థులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వార పోయగా, పురుషులు కత్తి చేత బట్టి, దండకాలను చదువుతారు. ఇలా చదివేవారు జంగాలు,ఆరాధ్య బ్రాహ్మణులు.
 
శైవులు, వీర శైవులు పలు సందర్భాలలో దక్షయజ్ఞ దండకం చదివినట్లె ఇక్కడా చదువుతారు. ఇలా చదివేటప్పుడు ఖడ్గదారులు ప్రభ ముందు నిలబడి వెనకకూ ముందుకు నడుస్తూ ఎగిరెగిరి గంతులు వేస్తూ పరవళ్ళు త్రొక్కుతూ వుంటే పక్క నున్న వాళ్ళు బుంజ వాయిద్యాన్ని తప్పెట వాయిద్యాన్ని వాయిస్తూ, కొమ్ము బూరలనూ, కాహశాలనూ ఊది దండకం చదువరిని వుత్తేజ పరుస్తారు. <ref> {{cite wikisource|title=తెలుగువారి జానపద కళారూపాలు|chapter=కోటప్పకొండ ప్రభల విన్యాసం|author=మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి}}</ref>
 
=='''వసతి సౌకర్యాలు'''==
"https://te.wikipedia.org/wiki/కోటప్ప_కొండ" నుండి వెలికితీశారు