లక్ష్మీరాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి Robot-assisted disambiguation: సంసారం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''సి.లక్ష్మీరాజ్యం''' ([[1922]] - [[1987]]) [[తెలుగు సినిమా]] నటి మరియు నిర్మాత. [[1922]]లో [[విజయవాడ]]లో జన్మించిన లక్ష్మీరాజ్యం 1935లో విడుదలైన [[శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా)|శ్రీకృష్ణ లీలలు]] సినిమాలో బాలనటిగా నటించింది. లక్ష్మీరాజ్యం మొత్తం 35 సినిమాలలో నటించింది. రెండు చిత్రాలలో [[ఎన్టీ రామారావు]] సరసన హీరోయిన్‌గా నటించింది. ఈమె 1941లో [[తెనాలి]]కి చెందిన రెవిన్యూ శాఖా ఉద్యోగి [[కె.శ్రీధరరావు]]ను వివాహమాడినది.
 
వీరు 1951లో [[రాజ్యం పిక్చర్స్]] అను సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి [[నందమూరి తారక రామారావు]]తో అనేక సినిమాలు తీశారు. వాటిలో ప్రముఖమైనది 1963లో విడుదలైన [[నర్తనశాల]]. ఈ సినిమా జకర్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవములో రెండు బహుమతులు గెలుచుకున్నది. ఈ చిత్రప్రదర్శనకు గాను లక్ష్మీరాజ్యం ఇతర సినిమా బృందముతో జకర్తా వెళ్ళినది. లక్ష్మీరాజ్యం నిర్మించిన ఇతర చిత్రాలలో [[హరిశ్చంద్ర (1956 సినిమా)|హరిశ్చంద్ర]], [[శ్రీకృష్ణ లీలలు]], [[శకుంతల (1966 సినిమా)|శకుంతల]], [[దాసి]], [[రంగేళి రాజా]] మరియు [[మగాడు]] ఉన్నవి. రాజ్యం పిక్చర్స్ సంస్థ నిర్మించిన మొత్తం 11 సినిమాలలోను 5 సినిమాలలో ఎన్.టి.ఆర్. హీరోగా నటించాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/లక్ష్మీరాజ్యం" నుండి వెలికితీశారు