అమరావతి స్తూపం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి Arjunaraoc (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2713348 ను రద్దు చేసారు
ట్యాగులు: రద్దుచెయ్యి విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 4:
[[బొమ్మ:Budhist Stupa Structure.JPG|right|325px|thumb| అమరావతి స్తూపం నమూనా (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మ్యూజియంలో ఉన్న చిత్రం]]
[[ఫైలు:Amaravati Stupa.JPG|right|thumb|300px|అమరావతి స్తూపం అవశేషాలు]]
ఆంధ్రదేశమందు, ముఖ్యముగా కృష్ణానదీ లోయలో, [[బౌద్ధమతము]] [[మౌర్య సామ్రాజ్యం|మౌర్య]] కాలము నుండి పరిఢవిల్లింది. అమరావతి (ధరణికోట), [[భట్టిప్రోలు]], [[జగ్గయ్యపేట]] బేతవోలు,[[ఘంటసాల]], [[శాలిహుండం]] మొదలైన చోట్ల స్తూప నిర్మాణము జరిగింది. వీటిలో [[అమరావతి స్తూపం|అమరావతి స్తూపం]] ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. [[కార్బన్ డేటింగ్]] ద్వారా అమరావతి (ధాన్యకటకము) పట్టణం క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందిందని తెలిసింది. స్తూపం క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి మార్పులు చేర్పులు చేయబడినది.<ref>{{Cite book |title=అమరావతి |author= భ. ఆంజనేయ శర్మ, |date=2008|publisher=భారతీయ పురాతత్వ సర్వేక్షణ, హైదరాబాదు మండలం.}}</ref> ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ట స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. బుద్ధుని జీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ [[బౌద్ధం]] నీరాజనాలందుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. '''దీపాలదిన్నె''' గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ [[కోలిన్ మెకంజీ]]. <ref> {{Cite wikisource |title=ఆంధ్రుల_చరిత్రము_-_ప్రథమ_భాగము|chapter=తొమ్మిదవ_ప్రకరణము|ref=#amaravathi|author=చిలుకూరి వీరభద్రరావు|date=1910}}</ref>
 
[[అమరావతి (గ్రామం)|అమరావతి]], [[ధరణికోట]] పరిసరములలో మరియు చైత్యపు అట్టడుగు పొరల్లో బృహత్ శిలాయుగపు సాంస్కృతిక అవశేషాలు లభించాయి. క్రీ. పూ 4-3 శతాబ్దాలనాటి నివాస ప్రదేశాలు, కట్టడాలు, స్తంభాలు వెలుగు చూశాయి. మౌర్యులకు పూర్వమే ఇచట నాగ, యక్ష తెగల జనపదం (గణతంత్ర రాజ్యం) ఉండేదని తెలుస్తోంది. బౌద్ధ భిక్షువు, చరిత్రకారుడు తారనాథుని ప్రకారము [[గౌతమ బుద్ధుడు]] ధరణికోటలో కాలచక్ర మండలాన్ని ఆవిష్కరించాడు<ref>{{Cite book|chapter=Buddha's Preaching of the Kalachakra Tantra at the Stupa of Dhanyakataka, |author=H. Hoffman |title=German Scholars on India, |volume=I|date= 1973|pages=136-140 |place=Varanasi}}</ref><ref>Taranatha; http://www.kalacakra.org/history/khistor2.htm</ref>. బహుశా ఈ కారణము వల్ల బుద్ధుని మరణానంతరము అమరావతిలో గొప్పస్తూప నిర్మాణము జరిగివుండవచ్చును. [[మౌర్యులు]], సదవంశీయులు, [[శాతవాహనులు]], [[ఇక్ష్వాకులు]], [[పల్లవులు]], [[శాలంకాయనులు]], [[విష్ణుకుండినులు]], [[అనంద గోత్రీయులు]], [[చాళుక్యులు]], [[చోళులు]], కోట వంశీయులు, [[కాకతీయులు]], [[విజయనగర రాజులు]], కుతుబ్ షాహి నవాబులు వరుసగా ఈ ప్రాంతాన్ని పాలించారు. క్రీ.శ. 4వ శతాబ్ది నుండి 15వ శతాబ్దము వరకు ధరణికోట ఆంధ్రదేశ రాజకీయ చరిత్రలో కీలకస్థానం వహించింది.
"https://te.wikipedia.org/wiki/అమరావతి_స్తూపం" నుండి వెలికితీశారు