అమరావతి స్తూపం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
==పురాతన స్తూపం వెలుగు చూసిన విధం==
క్రీ.శ. 14వ శతాబ్దం తర్వాత మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. గృహనిర్మాణం కోసం ధ్వంసం చేయబడుతున్న స్తూప కట్టడాలు, శిల్పాల గురించి విన్న కోలిన్ మెకంజీ 1797లో ఈ మహోన్నత సంపదను వెలికితీసి రక్షణకు నాంది పలికాడు. అటు తర్వాత సర్ వాల్టర్ స్మిత్ (1845), రాబర్ట్ సెవెల్ (1877), జేమ్స్ బర్జెస్ (1881), అలెగ్జాండర్ రె (1888-1909), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (1958-59), యం. వెంకటరామయ్య (1962-65), [[ఇంగువ కార్తికేయశర్మ|ఐ. కార్తికేయ శర్మ]] (1973-74) మున్నగు పురాతత్వవేత్తలు సాగించిన త్రవ్వకాలలో శిథిలమై విఛ్ఛినమైన మహా చైత్యము బయల్పడింది<ref>{{Cite web |title=Amaravathi Stupa (Interactive exploration) |url=http://www.ancientindia.co.uk/buddha/explore/intro.html|archiveurl=https://web.archive.org/web/20030807181627/http://www.ancientindia.co.uk/buddha/explore/intro.html|archivedate=2003-08-07}}</ref>.
 
చైనా యాత్రీకుడు హ్యూయెన్ త్సాంగ్ ఆరవ శతాబ్దములో [[అమరావతి స్తూపం|అమరావతి స్తూపం]] సందర్శించునాటికి క్షీణదశ ప్రారంభమైనది. ఐతే క్రీ.శ. 1344 వరకు పూజాపునస్కారాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. హిందూమత ప్రాభవమువల్ల క్రీ.శ. 1700 నాటికి స్తూపం శిథిలావస్థకు చేరుకొంది. పెర్సీ బ్రౌను మహాచైత్యం ఉచ్చస్థితిలో ఎలా ఉండేదో ప్రణాళికను చేశారు.
"https://te.wikipedia.org/wiki/అమరావతి_స్తూపం" నుండి వెలికితీశారు