త్రిపురాంతకం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===త్రిపురాంతకేశ్వరాలయం===
ఇక్కడ కొండ పై కొలువున్న శివుణ్ణి [[త్రిపురాంతకేశ్వరుడు]] అని పిలుస్తారు. అలాగే కొండ దిగువున వెలసిన అమ్మవారిని [[త్రిపుర సుందరీ దేవి]] అని పిలుస్తారు. కొండ పైన వున్న గుడి పక్కనే [[శ్రీశైలం]] వెళ్ళే సొరంగ మార్గం ఉంది. శ్రీశైలం నాలుగు మహద్వారాలలో త్రిపురాంతకం తూర్పు ద్వారం. ఈ ప్రాంతాన్ని పాలించిన రెడ్డి రాజులకు ఈ దేవుడు ఇలవేల్పు.
====పౌరాణికంస్థల పురాణం====
పూర్వం తారకాసురడనె రాక్షసుణ్ని కుమార స్వామి సంహ రించాడు. తారకాసురుని ముగ్గురు కుమారులు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చు కోవాలని బ్రహ్మదేవుడి కొరకు తపస్సు చేస్తారు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా.... "మాకు మరణం వుండకూడదని" వరమివ్వాలని కోరు కుంటారు. అది అసాద్యమని బ్రహ్మ చెప్పగా.... వారు "గగన మార్గాన ప్రయాణించే.... అందులో సకల సౌకర్యాలుండే మూడు నగరాలు కావాలని" కోరు కుంటారు. దానికి బ్రహ్మ వారి కోరికను తీరుస్తూ " ఆ మూడు నగరాలు విడి విడిగా వున్నంత కాలం మీకు తిరుగు లేదు .... అవి ఒక్కటిగా చేరితే మీరు బలహీనులౌతారు" అని వరం ఇస్తాడు. దాంతో త్రిపురాసురులు రెచ్చి పోయి ముల్లోకాలను గడ గడ లాడించారు. దాంతో దేవతలు బ్రహ్మకు మొర పెట్టుకోగా.... బ్రహ్మ వారిని వెంట పెట్టుకొని శివుని వద్దకు వెళ్లి శరణు వేడు తారు. అప్పుడు శివుడు ఆ మూడు నగరాలు ఒక్కదగ్గరికి చేరిన సమయం చూసి ఒక్క బాణంతో ఆ ముగ్గురిని సంహరించాడు. తర్వాత సకల దేవతల కోరిక మేరకు పరమ శివుడు త్రిపురాతకేశ్వరుడుగా లింగ రూపంలో ఈక్షేత్రంలో కొలువయ్యాడని పురాణ కథనం.
 
====చారిత్రికం====
ఈ ఆలయం చుట్టూ కొన్ని వందల శిలా శాసనాలున్నాయి.16 వ శతాబ్దం వరకు పాలించిన రాజులందరు ఈ ఆలయాభివృద్ధికి పాటు పడ్డారు. కాన గమనంలో జీర్ణ్మైనజీర్ణమైన ఈ ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానం వారు పునరుద్దరించ డానికి పూనుకొన్నారు.
 
====నేటి ఆలయం====
త్రిపురాంతకంలో ఈ ఆలయం ఒక చిన్న కొండ పై ఉంది. ఆలయం తూర్పు ముఖంగావుంది. నాలుగు వైపులా గోపురాలు కలిగి ఉంది. లోపల స్వామికిరువైపులా ద్వారపాలకులైన భద్రుడు, వీర భదృడు ఉన్నారు. గర్బగుడిలో స్వామివారు లింగ రూపంలో ఉన్నారు. స్వామి వారి ఆలయానికి ఎడమవైపున అమ్మవారికి ప్రత్యేకమైన గుడి ఉంది. అందులో అమ్మవారు త్రిశూలం, డమరుకం ధరించి చతుర్భుజాలతో అమ్మ వారు దర్శనమిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చీకటి గుహ ఉంది. ఇక్కడి నుండి శ్రీ శైలానికి సొరంగ మార్గమున్నదని, పూర్వం రుషులు ఈ మార్గం గుండా శ్రీ శైలం వెళ్లే వారని చెబుతారు. ప్రక్కనే ఒక చెరువు ఉంది. అందులో బాల త్రిపౌరత్రిపుర సుందరి ఆలయం ఉంది. ఈ అలయ మార్గంలోనెమార్గంలోనే వృచ్చికాల మల్లేశ్వర స్వామి, కాలభైరవ ఆలయాలున్నాయి. <ref>{{Cite web |title=DSAL Image collection about Tripurantakam |url=https://dsal.uchicago.edu/images/aiis/aiis_search.html?quick=tripurantakam&limit=20&skipMissing=1&depth=Quick+Search|accessdate=2019-07-30}}</ref>
 
====ప్రత్యేకత====
శ్రీ చక్ర ఆకారంలో ఈ ఆలయం నిర్మితమై వుండటం విశేషం. కాశీలో తప్ప మరెక్కడా కనిపించని కదంబ వృక్షాలు ఇక్కడున్నాయి. ఇక్కడ వున్న శివ లింగం ఊర్థ్వభాగాన ఒక అంగులం లోతు గల గుంట వుంటుంది. ఆ గుంటలో గంగ (నీరు) ఎల్లవేలలా వూరుచూ వుండుట విశేషం.
ఇక్కడ వున్న శివ లింగం ఊర్థ్వభాగాన ఒక అంగులం లోతు గల గుంట వుంటుంది. ఆ గుంటలో గంగ (నీరు) ఎల్లవేలలా వూరుచూ వుండుట విశేషం.
ఈ ఆలయంలో నిత్య పూజలు యధావిదిగా జరుగుతాయి. పర్వ దినాలలో ప్రత్యేక పూజలు చేస్తారు.
*ఇక్కడకు దగ్గరలోనే బౌద్ధ క్షేత్రమైన [[చందవరం]] ఉంది.
 
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/త్రిపురాంతకం" నుండి వెలికితీశారు