చార్లెస్ ఫిలిప్ బ్రౌన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
==జీవిత విశేషాలు==
సి. పి. బ్రౌన్ [[1798]] [[నవంబర్ 10]]న [[కలకత్తా]]లో జన్మించాడు.<ref>తెలుగు భాషా సాహిత్యాల సముద్ధారకుడు సి.పి.బ్రౌన్ - [[జ్ఞానమద్దిజానమద్ది హనుమచ్ఛాస్త్రి]], తెలుగు తేజం, డిసెంబర్ 2013, పేజి44-46</ref> <ref>{{Cite wikisource |title=లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు|chapter=తెలుగు భాషా భానుడు సి. పి. బ్రౌన్|author=మండలి బుద్ధ ప్రసాద్|year=2010}}</ref> ఈయన తండ్రి [[డేవిడ్ బ్రౌన్]] పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో సీపీ బ్రౌన్ గ్రీక్, లాటిన్, పారశీ, సంస్కృత భాషల్లో ఆరితేరాడు, బ్రౌను అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. తరువాత [[1817]] [[ఆగష్టు 4]] న [[మద్రాసు]]లో [[ఈస్ట్ ఇండియా కంపెనీ]]లో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించాడు. వేమన, సుమతి శతకాలతోపాటుగా పల్నాటి యుద్ధం లాంటి చారిత్రిక కావ్యాలను నన్నయ్య, తిక్కన, గౌరన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, రామరాజ భూషణుల కృతుల పరిష్కరణ - ప్రచురణల ముద్రింపచేసాడు.
 
[[బొమ్మ:C.p.brown telugu course.JPG|right|thumb|లండన్ యూనివర్సిటీ కాలేజీకి బ్రౌన్ రూపొందించిన తెలుగు కోర్సు పాఠ్యాంశాలు [http://www.archive.org/details/BrownLakhalu 'బ్రౌన్ లేఖలు'నుండి ]]]