హలో గురు ప్రేమకోసమే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
 
అయితే విశ్వనాథ్, సంజు స్నేహితులు అవుతారు. సంజూ హైదరాబాద్ లో ఉన్నన్నాళ్ళూ తను స్నేహితునిగా అన్ని విషయాల్లోనూ సాయం చేస్తానని విశ్వనాథ్ మాటిస్తాడు. ఈలోపు తన అనూపై తన ప్రేమను తెలుసుకున్న సంజు ఈ విషయం విశ్వనాథ్ కు చెప్తాడు. ఇప్పుడు విశ్వనాథ్ ఇరకాటంలో పడతాడు. తన మాట నిలబెట్టుకుని ప్రేమ విషయంలో సంజూకి సాయం చేయడమా, లేక అనూకి తండ్రిగా వ్యవహరించడమా అని. అతనికి సాయం చేస్తూనే, అనూని అతనికి దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్ని సరదా సంఘటనల తరువాత, తను కూడా సంజూని ప్రేమిస్తున్నానని అనూకి అర్ధమై, అతనికి తన ప్రేమ వ్యక్తం చేస్తుంది. తన తండ్రి ఇచ్చిన మాటపై నిలబడి కార్తీక్ కి ఇచ్చి పెళ్ళి చేస్తాడేమో అన్న భయంతో, ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్ళి చేసుకోమని సంజూని అడుగుతుంది. ఈ విషయం తెలిసిన విశ్వనాథ్ కూడా ఆమెను ఎక్కడికైన తీసుకుపొమ్మనీ, తను ఇచ్చిన మాట దాటలేనని సంజూతో చెప్పి, బాధపడతాడు. కానీ విశ్వనాథ్ అంచనాలు తారుమారు చేస్తూ, సంజూ ఇల్లు వదిలి, కాకినాడ ఒంటరిగా వెళ్ళిపోతాడు. వెళ్తూ తాను విశ్వనాథ్ ను బాధపెట్టలేననీ, ఎప్పటికీ అతనికి మంచి స్నేహితునిగానే ఉండిపోతాననీ, అనూకి ఏది మంచో తండ్రిగా విశ్వనాథ్ కే బాగా తెలుసు అని ఉత్తరం రాసి వెళ్ళిపోతాడు. అయితే కొంతకాలం తరువాత విశ్వనాథ్ కాకినాడ వచ్చి, అనూని సంజూ కంటే ఎవరూ బాగా చూసుకోలేరని చెప్పి, వాళ్ళిద్దర్నీ పెళ్ళి చేసుకోమని తన అనుమతి తెలపడంతో కథ సుఖాంతం అవుతుంది.
 
== తారాగణం ==
{{colbegin}}
*[[రామ్ పోతినేని]] సంజూగా నటించాడు. కాకినాడకు చెందిన ఈ యువకుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు.
*[[అనుపమ పరమేశ్వరన్]] అనుపమగా నటించింది. మొదట్లో సంజూని ఇష్టపడకపోయినా, తరువాత అతన్ని ప్రేమిస్తుంది.
*[[ప్రణిత సుభాష్]] రీతుగా నటించింది. సంజూ ఆఫీస్ లో పనిచేసే ఈ అమ్మాయిని మొదట్లో ప్రేమిస్తాడు.
*[[ప్రకాష్ రాజ్]] విశ్వనాథ్ గా నటించాడు. అనూ తండ్రి అయిన విశ్వనాథ్, సంజూతో స్నేహం పెంచుకుంటాడు.
*[[ఆమని]] అనూ తల్లి లక్ష్మిగా నటించింది.
*[[సితార (నటి)|సితార]] సంజు తల్లి గాయత్రిగా నటించింది. ఆమె విశ్వనాథ్ స్నేహితురాలు.
*సంజూ తండ్రిగా జయప్రకాష్ నటించాడు.
*[[పోసాని కృష్ణమురళి]] సంజూ మావయ్యగా నటించాడు.
*అనూను పెళ్ళి చేసుకోబోయిన కార్తీక్ పాత్రలో నోయెల్ సియాన్ నటించాడు.
*[[సురేష్ (నటుడు)|సురేష్ ]] రీతు తండ్రిగా చేశాడు.
*[[సాయాజీ షిండే]] కార్తీక్ తండ్రిగా నటించాడు.
*రామ్ ప్రసాద్ సంజూ స్నేహితుడిగా నటించాడు.
*[[ప్రవీణ్ (నటుడు)|ప్రవీణ్ ]] మెకానిక్ పాత్రలో చేశాడు.
*ఆటో డ్రైవర్ గా [[సప్తగిరి (నటుడు)|సప్తగిరి]] నటించాడు.
{{colend}}
 
== మూలాలు ==