హలో గురు ప్రేమకోసమే

2018 లో త్రినాథ రావు చే విడుదల చేసిన చిత్రం

హలో గురు ప్రేమ కోసమే [2][3][4][5] 2018లో విడుదలైన తెలుగు రసభరితమైన, హాస్యంతో కూడిన చలన చిత్రం. త్రినాధరావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత సుభాష్లు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రకాష్ రాజ్, ఆమని, జయప్రకాష్, సితార, నోయెల్ సియాన్, సాయాజీ షిండే,పోసాని కృష్ణ మురళిలు సహాయక పాత్రల్లో నటించారు.

హలో గురు ప్రేమకోసమే
Hello Guru Prema Kosame.jpg
దర్శకత్వంత్రినాధరావు నక్కిన
రచనప్రసన్న కుమార్
స్క్రీన్‌ప్లేప్రసన్న కుమార్
కథప్రసన్న కుమార్
నిర్మాతదిల్ రాజు
నటవర్గంరామ్ పోతినేని
అనుపమ పరమేశ్వరన్
ప్రణీత సుభాష్
ప్రకాష్ రాజ్
ఛాయాగ్రహణంవిజయ్ సి చక్రవర్తి
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
విడుదల తేదీలు
2018 అక్టోబరు 18 (2018-10-18)
నిడివి
145 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు
వసూళ్ళు20 కోట్లు [1]

కథసవరించు

సంజు (రామ్ పోతినేని) కాకినాడకు చెందిన గ్రాడ్యుయేట్. బాధ్యతలు ఇంకా వంటబట్టని యువకుడు. అతని జీవితం అంతా తను ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రుల చుట్టూ, స్నేహితుల చుట్టూ అల్లుకుని ఉంటుంది. మొదటినుంచి అతనికి ఉద్యోగం కోసం తన ఊరును వదిలి, హైదరాబాద్ కు వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అయితే తల్లిదండ్రులకు తాను మంచి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా స్థిరపడాలని కోరిక ఉందని తెలుసుకుని హైదరబాద్ వెళ్ళేందుకు ఒప్పుకుంటాడు. హైదరాబాద్ లో సంజు తల్లి గాయత్రి(సితార) తన స్నేహితుడు విశ్వనాథ్(ప్రకాష్ రాజ్) ఇంట్లో ఉండటానికి ఏర్పాటు చేస్తుంది.

హైదరాబాద్ కు ట్రైన్ లో వెళ్తుండగా, సంజు అనుపమ(అనుపమ పరమేశ్వరన్)ను కలుస్తాడు. అంతకుముందు స్టేషన్ లో కాకినాడ అబ్బాయిలు ఆకతాయిలు అన్న అనుపమ మాట విని, ఆమెను ట్రైన్ లో ఏడిపిస్తాడు సంజు. ఆ తరువాత, తను ఉండాల్సిన ఇంటి యజమాని విశ్వనాధ్ కూతురే అనుపమ అని తెలుసుకుని ఇబ్బంది పడతాడు. పైగా ప్రతీరోజూ ఆమెను కాలేజీకి తీసుకెళ్ళి, ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా అతని మీదే పడుతుంది. మొదట్లో ట్రైన్ లో సంజు చేసిన ఆకతాయి పనులకు అతనిపై ద్వేషం పెంచుకున్న అనుపమ, తరువాత అతని కుటుంబంపై అతనికి ఉన్న ప్రేమ, అభిమానాలు తెలుసుకుని కాస్త మెత్తపడుతుంది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అవుతారు. సంజూ కూడా విశ్వనాథ్ మాటపై నిలబడే తత్త్వం గురించి, చనిపోతున్న స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం అతని కూతుర్ని డాక్టర్ ని చదివించడం, దాని కోసం తన కూతుర్ని డాక్టర్ చదివించలేక, బీటెక్ లో చేర్చడం గురించి తన తల్లి ద్వారా తెలుసుకుంటాడు.

తన ఆఫీస్ లో పనిచేస్తున్న రీతు(ప్రణీత సుభాష్) పై ఇష్టం పెంచుకుంటాడు సంజు. ఈలోపు అనుతో స్నేహం మరింత బలపడుతుంది. ఐతే రీతు, సంజుకి తన ప్రేమను వ్యక్తం చేసినప్పుడు, తనకు అనుపై ఉన్న ప్రేమను తెలుసుకుంటాడు. ఇన్నాళ్ళూ తెలీకుండానే ఆమెపై ప్రేమ పెంచుకున్నానని అర్ధం చేసుకుంటాడు. తన ప్రేమను చెప్పాలనుకుంటున్న సమయంలోనే విశ్వనాథ్ అనూకి కార్తీక్(నోయెల్ సియన్)తో పెళ్ళి నిశ్చయం చేస్తాడు.

అయితే విశ్వనాథ్, సంజు స్నేహితులు అవుతారు. సంజూ హైదరాబాద్ లో ఉన్నన్నాళ్ళూ తను స్నేహితునిగా అన్ని విషయాల్లోనూ సాయం చేస్తానని విశ్వనాథ్ మాటిస్తాడు. ఈలోపు తన అనూపై తన ప్రేమను తెలుసుకున్న సంజు ఈ విషయం విశ్వనాథ్ కు చెప్తాడు. ఇప్పుడు విశ్వనాథ్ ఇరకాటంలో పడతాడు. తన మాట నిలబెట్టుకుని ప్రేమ విషయంలో సంజూకి సాయం చేయడమా, లేక అనూకి తండ్రిగా వ్యవహరించడమా అని. అతనికి సాయం చేస్తూనే, అనూని అతనికి దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్ని సరదా సంఘటనల తరువాత, తను కూడా సంజూని ప్రేమిస్తున్నానని అనూకి అర్ధమై, అతనికి తన ప్రేమ వ్యక్తం చేస్తుంది. తన తండ్రి ఇచ్చిన మాటపై నిలబడి కార్తీక్ కి ఇచ్చి పెళ్ళి చేస్తాడేమో అన్న భయంతో, ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్ళి చేసుకోమని సంజూని అడుగుతుంది. ఈ విషయం తెలిసిన విశ్వనాథ్ కూడా ఆమెను ఎక్కడికైన తీసుకుపొమ్మనీ, తను ఇచ్చిన మాట దాటలేనని సంజూతో చెప్పి, బాధపడతాడు. కానీ విశ్వనాథ్ అంచనాలు తారుమారు చేస్తూ, సంజూ ఇల్లు వదిలి, కాకినాడ ఒంటరిగా వెళ్ళిపోతాడు. వెళ్తూ తాను విశ్వనాథ్ ను బాధపెట్టలేననీ, ఎప్పటికీ అతనికి మంచి స్నేహితునిగానే ఉండిపోతాననీ, అనూకి ఏది మంచో తండ్రిగా విశ్వనాథ్ కే బాగా తెలుసు అని ఉత్తరం రాసి వెళ్ళిపోతాడు. అయితే కొంతకాలం తరువాత విశ్వనాథ్ కాకినాడ వచ్చి, అనూని సంజూ కంటే ఎవరూ బాగా చూసుకోలేరని చెప్పి, వాళ్ళిద్దర్నీ పెళ్ళి చేసుకోమని తన అనుమతి తెలపడంతో కథ సుఖాంతం అవుతుంది.

తారాగణంసవరించు

  • రామ్ పోతినేని సంజూగా నటించాడు. కాకినాడకు చెందిన ఈ యువకుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు.
  • అనుపమ పరమేశ్వరన్ అనుపమగా నటించింది. మొదట్లో సంజూని ఇష్టపడకపోయినా, తరువాత అతన్ని ప్రేమిస్తుంది.
  • ప్రణిత సుభాష్ రీతుగా నటించింది. సంజూ ఆఫీస్ లో పనిచేసే ఈ అమ్మాయిని మొదట్లో ప్రేమిస్తాడు.
  • ప్రకాష్ రాజ్ విశ్వనాథ్ గా నటించాడు. అనూ తండ్రి అయిన విశ్వనాథ్, సంజూతో స్నేహం పెంచుకుంటాడు.
  • ఆమని అనూ తల్లి లక్ష్మిగా నటించింది.
  • సితార సంజు తల్లి గాయత్రిగా నటించింది. ఆమె విశ్వనాథ్ స్నేహితురాలు.
  • సంజూ తండ్రిగా జయప్రకాష్ నటించాడు.
  • పోసాని కృష్ణమురళి సంజూ మావయ్యగా నటించాడు.
  • అనూను పెళ్ళి చేసుకోబోయిన కార్తీక్ పాత్రలో నోయెల్ సియాన్ నటించాడు.
  • సురేష్ రీతు తండ్రిగా చేశాడు.
  • సాయాజీ షిండే కార్తీక్ తండ్రిగా నటించాడు.
  • రామ్ ప్రసాద్ సంజూ స్నేహితుడిగా నటించాడు.
  • ప్రవీణ్ మెకానిక్ పాత్రలో చేశాడు.
  • ఆటో డ్రైవర్ గా సప్తగిరి నటించాడు.

మూలాలుసవరించు

  1. Hello Guru Prema Kosame First Weekend Collections
  2. Hooli, Shekhar H. "Hello Guru Prema Kosame, Sandakozhi 2 to take toll on Aravind Sametha collection at box office". International Business Times, India Edition. Retrieved 17 October 2018.
  3. "'Hello Guru Prema Kosame': The Ram Pothineni starrer gets a 'U' certificate". The Times of India. 16 October 2018. Retrieved 15 March 2019.
  4. tabloid!, Mythily Ramachandran, Special to (17 October 2018). "'Hello Guru Prema Kosame': A Telugu romcom". GulfNews. Retrieved 17 October 2018.
  5. "Ram's Hello Guru Prema Kosame Pre-Release Business Report". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 17 October 2018.