లాల్ కృష్ణ అద్వానీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారత హిందువులు తొలగించబడింది; వర్గం:భారతీయ హిందువులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 36:
కాని ప్రారంభంలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 1982లో పార్టీకి లభించిన [[లోక్‌సభ]] స్థానాల సంఖ్య రెండు మాత్రమే. 1986లో అద్వానీ [[భారతీయ జనతా పార్టీ]] అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ స్థానాల సంక్యను 86 కు పెంచగలిగినాడు. అద్వానీ లోక్‌సభలోకి తొలి సారిగా ప్రవేశించినది కూడా 1989లోనే.
== అయోధ్య రథయాత్ర ==
అద్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన సంఘటన [[అయోధ్య రథయాత్ర]]. [[సోమనాథ దేవాలయం]] నుంచి [[అయోధ్య]]కు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన [[1990]], [[సెప్టెంబర్ 25]]న <ref>{{Cite web |url=http://www.lkadvani.in/eng/content/view/449/295/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-03-29 |archive-url=https://web.archive.org/web/20120822231302/http://www.lkadvani.in/eng/content/view/449/295/ |archive-date=2012-08-22 |url-status=dead }}</ref> ప్రారంభించిన అయోధ్య రథయాత్ర [[బీహార్]] సరిహద్దులో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి [[లాలూ ప్రసాద్ యాదవ్]] అద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది. 10,000 కిలోమీటర్ల [[రథయాత్ర]] చేసి [[అక్టోబర్ 30]]న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయిననూ అప్పటికే అద్వానీ విశేష ప్రజాదరణను పొందినాడు. ఆ తర్వాత [[విశ్వనాథ్ ప్రతాప్ సింగ్]] ప్రభుత్వానికి [[భారతీయ జనతా పార్టీ]] మద్దతు ఉపసంహరించడం, ఆ తర్వాత 1991 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను 120కు పెంచిన ఘనత అద్వానీదే. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన [[కరసేవ]] సంఘటనలో అద్వానీ అరెస్ట్ అయ్యాడు.
 
ఆ తర్వాత పరిణామాలు భారతీయ జనతా పార్టీని కానీ అద్వానీని కానీ అంతగా ప్రభావితం చేయలేదు. 2004 ఎన్నికలలో పరాజయం తర్వాత పార్టీ సీనియర్ నాయకులే అద్వానీపై విమర్శలు గుప్పించారు. [[ఉమా భారతి]], [[మదన్ లాల్ ఖురానా]] లాంటి సీనియర్ నాయకులు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. [[పాకిస్తాన్]] పర్యటన సందర్భంగా [[జిన్నా]] సమాధి వద్ద విజిటర్స్ బుక్ లో అద్వానీ రాసిన వ్యాఖ్యలు దేశంలో కలకలం రేపాయి.
"https://te.wikipedia.org/wiki/లాల్_కృష్ణ_అద్వానీ" నుండి వెలికితీశారు