ధర్మపత్ని (1941 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 24:
budget = |
imdb_id = tt0255924}}
'''ధర్మపత్ని''', 1941లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సుప్రసిద్ధ మరాఠీ [[రచయిత]] విష్ణు సఖారాం ఖండేర్కర్ రాసిన ఓ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/dharmapathni-1941/article2421779.ece DHARMAPATHNI (1941) - m. l. narasimham - The Hindu September 4, 2011]</ref> పి.పుల్లయ్య దర్శకత్వంలో ఫేమస్‌ ఫిలింస్‌ పతాకాన ఈ' చిత్రాన్ని షిరాజ్‌ ఆలీ హకీం నిర్మించాడు. రామానుజాచారి హీరోగా నటించగా, [[పుల్లయ్య]] భార్య [[శాంతకుమారి]] ఈ చిత్రంలో హీరోయిన్‌.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-141404 ఊపందుకున్న సాంఘిక చిత్రాల నిర్మాణం - ఆంధ్రప్రభ సెప్టెంబరు 2, 2010]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> [[కొల్హాపూర్‌]]లోని శాలిని సినీటోన్ స్టూడియోలో చిత్రీకరణ జరిపారు. అప్పటి ప్రఖ్యాత రంగస్థల నటుడు [[ఉప్పులూరి సంజీవరావు]] కుమారుడు హనుమంతరావు హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత ఆయన '[[భీష్మ ప్రతిజ్ఞ]], '[[వందేమాతరం]]' సినిమాల్లో మాత్రమే నటించి, ఆ తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి [[భీమవరం]]లో మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరారు.<ref>[http://www.indiaglitz.com/channels/telugu/article/81460.html అలనాటి ఆణిముత్యం: ధర్మపత్ని (1941) - ఇండియా గ్లిట్జ్]</ref>
 
మొదట సంభాషణల రచయితగా [[విశ్వనాథ సత్యనారాయణ]] ఎంపికయ్యారు. కానీ ఆయన సంభాషణలు మరీ గ్రాంధికంగా ఉండటంతో శరత్‌చంద్ర ఛటర్జీ నవలల్ని తెలుగులో అనువదించిన [[చక్రపాణి]]ని మాటల రచయితగా పరిచయం చేశారు. అదివరకు హిందీ, [[మరాఠీ]] సినిమాలకు పనిచేసిన అన్నాసాహెబ్ మైంకర్ సంగీతం సమకూర్చిన ఏకైక తెలుగు సినిమా ఇదే. [[అక్కినేని నాగేశ్వరరావు]] నటించిన తొలి సినిమా ఇదే. ఓ చిన్న పాత్రలో బాలనటుడిగా ఆయన కనిపించాడు.