శ్రీశైల క్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మండలము → మండలం, గ్రామము → గ్రామం, typos fixed: ె → ే , →
పంక్తి 102:
 
====[[హటకేశ్వరం]]====
హటకేశ్వరం, కర్నూలు జిల్లా, శ్రీశైలం మండలానికి చెందిన గ్రామముగ్రామం. శ్రీశైలమల్లికార్జునదేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వరాలయము ఉంది. ఈ పరిశరాలలోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు నివసించారు. పరమశివుడు అటిక (ఉట్టి, కుండ పెంకు)లో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు రానురాను అదేమెల్లగా హటికేశ్వరస్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఆప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువ బడుతోంది. ఇక్కడ చెంచులు అదివాశీలు నివసిస్తున్నారు. ఈ దేవాలయ పరిశరాలలో పలు ఆశ్రమములు, మఠములు ఉన్నాయి. ఇక్కడికి వచ్చెందుకు శ్రీశైలం దేవస్థానము నుండి ప్రతి అర గంటకు బస్సులు ఉన్నాయి.
 
====[[శిఖరం]]====
పంక్తి 110:
శ్రీ దత్తాత్రేయ స్వామి అవతార పరంపరలో 3వ అవతార పురుషుడైన శ్రీ [[నరసింహ సరస్వతీస్వామి|నృసింహ సరస్వతి స్వామి]] మహారాష్ట్రలోని కరంజా నగరంలో జన్మించి నర్సోబవాడాలోను, కర్ణాటకలోని గాణాగాపురంలోనూ తపమాచరించి చివరకు కదళీవనంలో అంతర్ధానమయ్యారు. వీరశైవ సంప్రదాయానికి చెందిన అక్క మహాదేవి కూడా ఇక్కడే అవతార సమాప్తి గావించారని ప్రతీతి.
===భీముని కొలను===
శ్రీశైలంలోని సాక్షి గణపతి గుడి దాటాక కుడివైపు పాపనాశనం తీర్థం ఉంటుంది. దీనికి ఎదురుగా ఉన్న కాలిబాట భీముని కొలనుకు దారితీస్తుంది. ఈ మార్గంలో శతాబ్దాల కిందట రెడ్డిరాజులు మెట్లు కట్టించడం విశేషం. మెట్ల దారిలో ఒక కిలోమీటర్‌ వెళ్లాక.. దట్టమైన అడవితో విశాలమైన లోయ కనిపిస్తుంది. ఇక్కడున్న మహాద్వారం.. అందమైన లోకంలోకి స్వాగతం పలుకుతుంది. పెద్ద పెద్ద మెట్లు.. వీటికి ఇరువైపులా చెట్లు.. వాటికి అల్లుకున్న లతలు.. మనిషంత ఎత్తుండే పుట్టలు.. దారి పొడుగునా కనిపించే దృశ్యాలివి. ఈ దారిలో రెండు కిలోమీటర్లు నడక సాగిస్తే.. త్రివేణీ, త్రి పర్వత సంగమానికి చేరుకుంటారు.వందల అడుగుల లోతున్న లోయల మధ్య తూర్పు నుంచి ఒక సెలయేరు, దక్షిణం నుంచి మరో సెలయేరు వచ్చి.. చిన్న చిన్న జలపాతాలుగా దూకుతుంటాయి
లపాతాలు ఏర్పరిచే కొలను మనోహరంగా ఉంటుంది. అదే భీముని కొలను. అంటే పెద్ద కొలనని అర్థం. అయితే ఇది మరీ అంత పెద్దగా ఏం ఉండదు. కానీ చాలా ప్రత్యేకమైనది. తూర్పు సెలయేరు, దక్షిణ సెలయేరు సంగమించి.. జలపాతంగా మారి ఒక గుండంలో దూకుతాయి. అక్కడ దూకిన జలాలు.. అనూహ్యంగా మాయమవుతాయి. ఒక పరుపు బండ కింది నుంచి రెండు వందల అడుగులు ప్రయాణించి మళ్లీ బయటకు వస్తాయి. భారీ పరుపు బండ మీద నిలబడితే.. దాని కింది నుంచి నీళ్లు పారుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. పరుపు బండ కింది నుంచి వెలుపలకు వచ్చిన నీళ్లు కొలనులోకి చేరడంతో నిరంతరం అలలు పుడుతుంటాయి. వేసవిలోనూ ఇక్కడ నీటి జాడ కనిపించడం విశేషం. అహోబిలం నరసింహస్వామి.. చెంచులక్ష్మిని వరించి భీముని కొలనులో సయ్యాటలాడాడని స్థానిక కథనం. కొలను ఒడ్డున భీమాంజనేయుల విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడికి సమీపంలోని పురాతన శివాలయం ఉంది. దీనిని సందర్శించి.. మరోసారి లోయల అందాలను చూస్తూ.. పొద్దుగూకే లోగా శ్రీశైల క్షేత్రానికి చేరుకోవచ్చు.
 
పంక్తి 123:
 
==ఆనాటి శ్రీశైలము. ఏనుగుల వీరాసామయ్య గారి మాటల్లో==
శ్రీశైలయాత్రకు తీసే హాశ్సీలు కందనూరునవాబుకు చేరుచున్నది. శివరాత్రి ఉత్సవములో శూద్రజనము 1కి ర్పూ 2, గురానికి ర్పూ 5, అభిషేకమునకు ర్పూ 3, వాహనోత్సవము చేయిస్తే ఉత్సవపు సెలవులు గాకగా 3, దర్మణసేవోత్సవమునకు ర్పూ 3. ఈప్రకారముగా పుచ్చుకొనుచున్నారు. శ్రీశైలమునకు నాలుగు భాటలు. ఎటుపోయినా నీశ్వర సంకల్పమేమో 4 ఆమడదూరము; ఛీకారణ్యమయిన దోవ. ఒక భాట నెల్లూరు మీద నచ్చి చుక్కల పర్వతము నెక్కవలసినది. మరియొకటి కంభం దూపాటి మీదవచ్చి చుక్కలకొండ నెక్కవలెను. మరియొక భాట పడమటి దేశస్థులు కృష్ణానది దాటి రావలసినది. ఆ కృష్ణ పాతాళగంగయని పేరువహించి శ్రీశైలము క్రింద ప్రవహింపుచున్నది. శ్రీశైలమునుంచి ఆగంగకు పోవలెనంటే రెండుకోసుల దూరము. దిగియెక్కవలెను. కొంతదూరము సుళువైన డోలీమీద పోవచ్చును. మెట్లు పొడుగుగనుక నెక్కడము, దిగడము కష్టము. నేను వచ్చిన యీ యాత్మకూరు భాట తప్పమిగతా మూడు భాటలు ఉత్సవకాలములలో నడవవల్సినది గాని తలుచుకొన్నప్పుడు నడవకూడదు. మృగభయము, చెంచువాండ్ల భయమున్ను విస్తరించియుండును. ఆ ఛెంచువాండ్లు అడివి మనుష్యులయినను యాత్రకు వచ్చేవారిని యాచించి తినే వాడికే పడియున్నారు. శివరాత్రి మొదలు చైత్రమాసమువరకు శ్రీశైలము మీద ప్రతిదినమున్ను పల్లకీసేవ అనే ఉత్సవము జరుగుచున్నది. ఛైత్రమాసములో భ్రమరాంబ యనే దేవికి తామసపూజ చేసి శ్రీశైలముమీద వచ్చియుండే జనులు విరామమును బొందుచున్నారు. అటుపిమ్మటనొకరిద్దరు అర్చకులు మాత్రము మార్చిమార్చి ఆయాత్మకూరు నుంచి వచ్చి యుంచున్నారు. ఎక్కువ నీళ్ళు ఒంటక జ్వరము, మహోదరము, సోభ మొదలయిన రోగములు కలుగుచున్నవి. శ్రీశైలమున గుడికి సమీపముగా 20 చెంచుగుడిశేలున్నవి. వారున్న ఆ గుడిశెలు వదిలి బాధ్రపద మాసములో వలస పోవుచున్నారు. అప్పటికి వర్షాకాలము తీరి యీగెల ఉపద్రవము కలుగుచున్నది. అది సహించతగినది కాదు. గుడివద్ద స్వామికి ఆవులు 100 దనుక నున్నవి. కడప విడిచిన వెనుక ఆవుపాలు, పెరుగున్ను కండ్ల చూడవలెనంటే శ్రీశైలముమీద చూడవలసినది గాని ఇతర స్థలములలో ఆవులను మాత్రము కండ్ల చూడవచ్చును. ఆవుపాలు తీసుటలేదు, దూడలకు విడిచిపెట్టుచున్నారు. అంత జాగ్రత్తగా ఈ దేశస్థులు పసువులను కాపాడిన్ని, దున్నడముకు ఎద్దులు నెల్లూరుసీమనించి తెచ్చే వారివద్ద హమేషా వారికి కొనవలసి యున్నది. ఎనుములు పాడికే గాని అచ్చటి దున్నలు ఆభూమిని నిగ్గి దున్న నేరవు. తడవకు 18-20 వరహాలు పెట్టి యెద్దులను కొనుచున్నారు. ఆ యాత్మకూరి కాపురస్థులు అనేక పర్షన్ వాండ్లను గొప్ప, చిన్నలను చూచి మెరుగైనవారై యున్నారు. ముసాఫరులకు దేవి యాచకులయిన తెనుగు బ్ర్రాంహ్మణులు రెండిండ్లవారున్ను, స్వామి యాచకుడయిన జంగవాడొకడున్ను - వీరే స్థల మివ్వవలసినది గాని, యితరుల యిండ్లు గొప్పలయినను స్థల మివ్వరు. 2-3 చిన్న దేవస్థలములు, చావిళ్ళున్ను న్నవి. తప్పితే అందులో దిగవలసినది. ఆయాత్మకూరినించి పట్టణపు షవారీల మీద కష్టముగా శ్రీశైలపర్వతమునకు పోయి చేరవచ్చునని తెలియనందుచేత మూడు డోలీలు 2 రూపాయీలకు చేయించినాను. వాటిని నొక దినములో అక్కడి వడ్లవాడు చేసాడు. అక్కడి రూపాయికిన్ని చెన్నపట్టణపు రూపాయికిన్ని సుమారు కాలురూపాయి భేదమున్నది. పట్టణపు రూపాయి 1 కెకే అక్కడి రూపాయి12 ఎనిమిదిమంది కూలి బోయీలను అక్కడి వారిని శ్రీశైలమునకు పోయి రాగలందులకు జనము 1 కి రూపాయిలు 4 లెక్కను కుదుర్చుకొన్నాను. (పుటలు. 14-15)
 
==ఆదాయం==
పంక్తి 130:
 
==ఇంకా చూడండి==
*[[శ్రీశైలం మండలముమండలం]]
*[[శ్రీశైలం ప్రాజెక్టు]]
*[[హటకేశ్వరం]]
"https://te.wikipedia.org/wiki/శ్రీశైల_క్షేత్రం" నుండి వెలికితీశారు